Union Bank of India Waiver of Processing Charges for Home and Auto Loans - Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు శుభవార్త.. ప్రాసెసింగ్‌ ఛార్జీలు మాఫీ!

Published Mon, Aug 21 2023 8:14 PM | Last Updated on Mon, Aug 21 2023 9:50 PM

Union Bank Of India Waiver Of Processing Charges For Home And Auto Loans - Sakshi

హోం లోన్‌, టూ వీలర్‌లోన్‌ తీసుకున్న వారికి భారీ ఉపశమనం కలిగింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్‌ సిబిల్‌ స్కోర్‌ 700పైన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని షరతు విధించింది. 

ఆగస్టు 16, 2023 నుంచి నవంబర్ 15, 2023 మధ్య కాలానికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతే కాదు, ఇతర ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి గృహ రుణాలను తీసుకునేందుకు సైతం ఈ ఆఫర్‌ను పొడిగించారు.

మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-2023 ఆర్థిక సంవత్సరానికి రూ.2022,23 కోట్ల డివిడెండ్ను ప్రకటించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అత్యధిక డివిడెండ్ ఇదేనని బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement