యాక్సిస్ బ్యాంక్ పండుగ ఆఫర్లు | Axis Bank plans festive offers on auto loans, credit cards | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్ పండుగ ఆఫర్లు

Published Wed, Sep 17 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

యాక్సిస్ బ్యాంక్ పండుగ ఆఫర్లు

యాక్సిస్ బ్యాంక్ పండుగ ఆఫర్లు

ముంబై:  రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ పలు ఆఫర్లను ప్రకటించనున్నది. గృహ, వాహన రుణాలపై, క్రెడిట్ కార్డులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనున్నామని బ్యాంక్ ప్రెసిడెంట్(కన్సూమర్ లెండింగ్ అండ్ పేమెంట్స్) జైరామ్ శ్రీధరన్ చెప్పారు. వీటి వివరాలను రానున్న వారాల్లో వెల్లడించనున్నామని పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్ రుణాల వృద్ధి జోరుగా ఉండగలదని అంచనాలున్నాయని చెప్పారు. తమ మొత్తం రుణాల్లో ప్రస్తుతం రిటైల్ రుణాలు 38 శాతమని, ఇది మరింతగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేట్ రుణాల కన్నా రిటైల్ రుణాలే అధిక వృద్ధి సాధిస్తాయని వివరించారు. కార్పొరేట్ రుణాలకు డిమాండ్ నిరుత్సాహంగా ఉందని, నాలుగో క్వార్టర్ నుంచి పుంజుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement