SBI Offering 15 To 30 Basis Point Discount On Home Loans From October 4, 2022, To January 31, 2023 - Sakshi
Sakshi News home page

హోమ్‌ లోన్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ బంపరాఫర్‌

Published Mon, Oct 10 2022 10:48 AM | Last Updated on Mon, Oct 10 2022 1:37 PM

Sbi Gives 15-30 Bps Concession On Home Loans Till Jan-2023 End - Sakshi

హోమ్‌ లోన్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. పండుగ సీజన్‌ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ల వడ్డీ రేటుపై 0.15-0.25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. 

ప్రస్తుతం ఎస్‌బీఐ గృహ రుణ రేట్లు 8.55-9.05 శాతంగా ఉండగా, పండుగ ఆఫర్‌లో భాగంగా అవి 8.40 నుంచి 9.05 శాతం మధ్యలో లభించనున్నాయి. సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా వడ్డీ రేటులో రాయితీ, ఈఎంఐలు ఉంటాయని వివరించింది.

ఎస్‌బీఐ సాధారణ గృహ రుణాల రేట్లు
ఫ్లెక్సీపే,ఎన్‌ఆర్‌ఐ,నాన్‌ శాలరీ, ప్రివిలేజ్/శౌర్య,  అపాన్ ఘర్‌తో పాటు మిగిలిన సాధారణ గృహ రుణాల సిబిల్‌ స్కోర్‌ 800 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు బ్యాంక్ 8.40% వడ్డీ రేటును అందిస్తోంది. ఇది సాధారణ రేటు 8.55%తో పోలిస్తే 15 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంది.

ఇంకా, సాధారణ రేటు 8.65%తో పోలిస్తే 750 - 799 నుండి 8.40% మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు 25 బేసిస్ పాయింట్ల రాయితీ ఇవ్వబడుతుంది. అదనంగా, 700 -749 సిబిల్‌  స్కోర్‌లపై 20 బేసిస్ పాయింట్ల రాయితీ, 

1 నుండి 699 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్‌లను కలిగి ఉన్న రుణగ్రహీతలకు గృహ రుణాలపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. 650-600 మధ్య క్రెడిట్ స్కోర్‌లను కలిగి ఉన్న రుణగ్రహీతలకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8.85%గా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement