Pre - Payment
-
హోమ్ లోన్ ముందుగా చెల్లించడం మంచిదేనా..?
సగటు మనిషి తన జీవితంలో తీసుకునే అతిపెద్ద రుణం ఇంటి కోసమే.. ఇది కనీసం 15–30 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం అన్ని సంవత్సరాలు చెల్లించడం వల్ల చాలా ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. మనకు తెలియకుండానే తీసుకున్న రుణం కంటే దాదాపు రెట్టింపుపైనే చెల్లిస్తాం. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్నప్పుడు ఇంటి రుణం ముందుగా చెల్లించడం మంచిదేనా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మీకు అందుబాటులో డబ్బు ఉన్నప్పుడు ఇంటి రుణం తీర్చుకోవడం తెలివైన పని అని సూచిస్తున్నారు. అయితే ఇంటి రుణం ముందుగా చెల్లించాలా? లేదా అనే నిర్ణయం మీరు ఎంచుకున్న పన్ను విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. - సాక్షి, సిటీబ్యూరోవీరికి ప్రయోజనకరంఇంటి రుణం ముందస్తు చెల్లింపు.. ముఖ్యంగా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆదాయం తగ్గకముందే బాధ్యతలను క్లియర్ చేయడంలో ఇది సహాయపడుతుంది. మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు చెల్లింపు రుణ కాలపరిమితిని తగ్గిస్తుంది. అలాగే క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. పైగా ముందస్తు చెల్లింపు ఈఎంఐలను తగ్గించడంలో సహాయపడుతుంది. రుణ గ్రహీత గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించినప్పుడు, అతిపెద్ద ప్రయోజనం మొత్తం వడ్డీ అవుట్గో తగ్గడం, వడ్డీని బాకీ ఉన్న అసలుపై లెక్కించినందున, ఒకేసారి చెల్లింపులు చేయడం వల్ల వడ్డీ వచ్చే బకాయి మొత్తం తగ్గుతుంది.ఈఎంఐల భారం తగ్గుతుంది..ఉదాహరణకు 20 సంవత్సరాల కాల వ్యవధికి 9 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే.. రుణ గ్రహీత ఐదు సంవత్సరాల తర్వాత రూ.5 లక్షలను ముందస్తుగా చెల్లిస్తే.. మిగిలిన రుణ బ్యాలెన్స్ సుమారు రూ.39.35 లక్షలకు తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్తు ఈఎంఐల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంక్ పాలసీని బట్టి రుణ గ్రహీత ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా రుణ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. రుణ గ్రహీత ఈఎంఐని మార్చకుండా ఉంచాలని ఎంచుకుంటే రుణ కాలపరిమితి 20 ఏళ్ల నుంచి దాదాపు 15 ఏళ్లకు తగ్గుతుంది. తద్వారా వడ్డీ చెల్లింపులతో సుమారు రూ.16.30 లక్షలు ఆదా అవుతుంది. -
1.1 బిలియన్ డాలర్లు ముందస్తు చెల్లింపు
న్యూఢిల్లీ: తనఖాలో ఉన్న అదానీ గ్రూప్ సంస్థల షేర్లను విడిపించుకునేందుకు ప్రమోటర్లు 1.1 బిలియన్ డాలర్లను ముందస్తుగా చెల్లించనున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (ఏపీసెజ్) , అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ (ఏటీఎల్) సంస్థల షేర్లు వీటిలో ఉన్నాయి. ఇవి వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూర్ కానున్నాయి. ఇటీవల మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో కంపెనీల షేర్లు కుప్పకూలిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకటన ప్రకారం తనఖా ఉంచిన షేర్లకు సంబంధించి ఏపీసెజ్‌లో 12 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 3 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 1.4 శాతం ప్రమోటర్ల వాటాలను విడిపించనున్నారు. అదానీ ట్రాన్స్మిషన్ లాభం 73 శాతం అప్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అదానీ ట్రాన్స్మిషన్ లాభం దాదాపు 73 శాతం పెరిగి రూ. 478 కోట్లకు చేరింది. అమ్మకాల వృద్ధి, వన్‌టైమ్ ఆదాయం నమోదు కావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో లాభం రూ. 277 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 2,623 కోట్ల నుంచి రూ. 3,037 కోట్లకు చేరింది. -
సెకండ్ హ్యాండ్ కార్ మేడ్ ఈజీ
అందుబాటులోకి అనేక వెబ్సైట్లు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సై రెండేళ్లకే కార్లు మారుస్తున్న యువత దేశంలో కార్ల వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి. అంతే కాకుండా రెండు మూడేళ్లకే కార్లను మార్చేవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. దీంతో సెకండ్ హ్యాండ్/ ప్రీ ఓన్డ్ కార్ల అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా ఆటోమొబైల్ కంపెనీలు సొంతంగానే సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే ఔట్లెట్లను ఏర్పాటు చేస్తుండటమే కాకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ కారును కొనేటప్పుడు, రుణం తీసుకునేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలివీ.. ఆన్లైన్ బెస్ట్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లను ఎంపిక చేసుకోవడానికి అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా ఫస్ట్ చాయిస్, కార్ నేషన్, ఓఈఎం వంటివే కాకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ప్రీఓన్డ్ కార్ల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. వీటిల్లో ఒకదాన్ని సంప్రదించి మీకు నచ్చిన కారును ఎంపిక చేసుకోండి. ఇలా ఆన్లైన్లో మీకు నచ్చిన కారును ఎంపిక చేసుకున్న తర్వాత అది మీ బడ్జెట్‌కు దగ్గరగా ఉందా లేదా చూడండి. ఆ తర్వాత కారు వివరాలు, ఫొటోగ్రాఫ్స్‌తో అమ్మేవాళ్లు ఇచ్చిన రివ్యూలను పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మిగిలిన వాటితో పోలిస్తే ఇలా డీలర్లు, వ్యవస్థీకృత సంస్థల ద్వారా కార్ల ఎంపిక పారదర్శకంగా ఉండటమే కాకుండా వారంటీ కూడా లభిస్తుంది. పరిశీలించాల్సినవి: ఒక కారును ఎంపిక చేసుకున్న తర్వాత ఆ కారు మోడల్, రానున్న కాలంలో ఆ మోడల్ విలువ తగ్గే అవకాశం ఉందా? మైలేజ్ ఎంత ఇస్తోందన్న విషయాలు చూడాలి. కేవలం ఆన్లైన్లో చూడటం కాకుండా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోండి. ఆ కారు ఎన్ని కి.మీ. తిరిగింది, దాన్ని కొని ఎన్నేళ్లయిందనే విషయాలు కూడా ముఖ్యమైనవే. కారు రిజిస్ట్రేషన్, కారుపై ఏమైనా రుణం ఉందా? ఉంటే దాన్ని తీర్చేశారా, హైపోతికేషన్ ఎవరు పేరున ఉంది అనే అంశాలను పరిశీలించాలి. చెల్లించిన పన్నుల కాగితాలను తప్పకుండా చూడాలి. లోన్ కావాలా?: మీరు ఎంపిక చేసుకున్న కారు కాగితాలన్నీ సక్రమంగా ఉండి, కారు కండీషన్ సరిగా ఉంటే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సాధారణంగా కారు ధరలో 80% వరకు రుణం లభిస్తుంది. కొన్ని మోడల్స్‌పై 100% కూడా రుణాన్ని ఇస్తున్నాయి. గరిష్టంగా 5 ఏళ్ల వరకు రుణాన్ని ఇస్తాయి. ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-పేమెంట్ చార్జీల వంటి విషయాలన్నీ కొత్త కార్లను తీసుకునేటప్పుడు పాటించే వాటినే పాటిస్తున్నాయి.