సెకండ్ హ్యాండ్ కార్ మేడ్ ఈజీ | Second Hand Car Made Easy | Sakshi
Sakshi News home page

సెకండ్ హ్యాండ్ కార్ మేడ్ ఈజీ

Published Sun, Mar 23 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

సెకండ్ హ్యాండ్ కార్ మేడ్ ఈజీ

సెకండ్ హ్యాండ్ కార్ మేడ్ ఈజీ

అందుబాటులోకి అనేక వెబ్‌సైట్లు
రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సై
రెండేళ్లకే కార్లు మారుస్తున్న యువత

 
 
 దేశంలో కార్ల వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి. అంతే కాకుండా రెండు మూడేళ్లకే కార్లను మార్చేవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. దీంతో సెకండ్ హ్యాండ్/ ప్రీ ఓన్డ్ కార్ల అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా ఆటోమొబైల్ కంపెనీలు సొంతంగానే సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తుండటమే కాకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ కారును కొనేటప్పుడు, రుణం తీసుకునేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలివీ..
 

ఆన్‌లైన్ బెస్ట్
 

ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లను ఎంపిక చేసుకోవడానికి అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా ఫస్ట్ చాయిస్, కార్ నేషన్, ఓఈఎం వంటివే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ప్రీఓన్డ్ కార్ల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. వీటిల్లో ఒకదాన్ని సంప్రదించి మీకు నచ్చిన కారును ఎంపిక చేసుకోండి. ఇలా ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన కారును ఎంపిక చేసుకున్న తర్వాత అది మీ బడ్జెట్‌కు దగ్గరగా ఉందా లేదా చూడండి. ఆ తర్వాత కారు వివరాలు, ఫొటోగ్రాఫ్స్‌తో అమ్మేవాళ్లు ఇచ్చిన రివ్యూలను పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మిగిలిన వాటితో పోలిస్తే ఇలా డీలర్లు, వ్యవస్థీకృత సంస్థల ద్వారా కార్ల ఎంపిక పారదర్శకంగా ఉండటమే కాకుండా వారంటీ కూడా లభిస్తుంది.
 

పరిశీలించాల్సినవి: ఒక కారును ఎంపిక చేసుకున్న తర్వాత ఆ కారు మోడల్, రానున్న కాలంలో ఆ మోడల్ విలువ తగ్గే అవకాశం ఉందా? మైలేజ్ ఎంత ఇస్తోందన్న విషయాలు చూడాలి. కేవలం ఆన్‌లైన్‌లో చూడటం కాకుండా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోండి. ఆ కారు ఎన్ని కి.మీ. తిరిగింది, దాన్ని కొని ఎన్నేళ్లయిందనే విషయాలు కూడా ముఖ్యమైనవే. కారు రిజిస్ట్రేషన్, కారుపై ఏమైనా రుణం ఉందా? ఉంటే దాన్ని తీర్చేశారా, హైపోతికేషన్ ఎవరు పేరున ఉంది అనే అంశాలను పరిశీలించాలి. చెల్లించిన పన్నుల కాగితాలను తప్పకుండా చూడాలి.

 

 లోన్ కావాలా?: మీరు ఎంపిక చేసుకున్న కారు కాగితాలన్నీ సక్రమంగా ఉండి, కారు కండీషన్ సరిగా ఉంటే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సాధారణంగా కారు ధరలో 80% వరకు రుణం లభిస్తుంది. కొన్ని  మోడల్స్‌పై 100% కూడా రుణాన్ని ఇస్తున్నాయి. గరిష్టంగా 5 ఏళ్ల వరకు రుణాన్ని ఇస్తాయి. ఫ్లోటింగ్, ఫిక్స్‌డ్ రేట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-పేమెంట్ చార్జీల వంటి విషయాలన్నీ కొత్త కార్లను తీసుకునేటప్పుడు పాటించే వాటినే పాటిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement