సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు తాత్కాలికంగా మకాం మార్చనున్నారు. కొద్దినెలల పాటు ఆమె గురుగ్రాంలోని డీఎల్‌ఎఫ్ అరాలియా నివాసంలో ఉంటారని ప్రియాంక సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. ఢిల్లీలోని రెండుమూడు ప్రాంతాల్లో వసతి గృహం కోసం పరిశీలిస్తున్న ప్రియాంక త్వరలోనే అద్దె ఇంటిని ఖరారు చేస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్ ప్రాంతంలో ఓ ఇంటిని ఆమె ఎంచుకున్నారని మరమ్మతు పనులు పూర్తయినే వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లవచ్చని పేర్కొన్నాయి.
అప్పటివరకూ గురుగ్రాంలో ప్రియాంక నివసిస్తారని తెలిపాయి. ఇప్పటికే పలు గృహోపకరణాలు, వస్తువులను గురుగ్రాంకు తరలించారని, భద్రతా తనిఖీల ప్రక్రియ కూడా ముగిసిందని వెల్లడించాయి. ప్రియాంక నివాసం వద్ద సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ చెక్‌ను చేపట్టినట్టు తెలిసింది. కాగా ప్రియాంక గాంధీకి ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించడంతో ఢిల్లీలోని 35 లోధీ ఎస్టేట్ నుంచి ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆమెకు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నోటీసులపై ప్రియాంక స్పందిస్తూ జులై 31లోగా లోధీ ఎస్టేట్ నివాసాన్ని ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. చదవండి : పైలట్‌తో మంతనాలు.. రంగంలోకి ప్రియాంక
Comments
Please login to add a commentAdd a comment