Lodhi Road
-
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆగస్టు 1 లోగా లోధి ఎస్టేట్ నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రియాంకకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక కొన్ని రోజుల పాటు గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆమె అద్దెకు తీసుకున్న నివాసంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు గృహోపకరణాలు, వస్తువులను గురుగ్రాంకు తరలించారని, భద్రతా తనిఖీల ప్రక్రియ కూడా ముగిసిందని వెల్లడించాయి. ప్రియాంక నివాసం వద్ద సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చెక్‌ను చేపట్టినట్టు తెలిసింది. (బీజేపీ ఎంపీకి ప్రియాంక ఆహ్వానం) ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలో నివసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని అనిల్ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే. -
ప్రియాంక గాంధీని డిన్నర్‌కు పిలిచిన బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, బీజేపీ ఎంపీ అనిల్ బలూనీని టీ కోసం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ మధ్యే కాన్సర్‌కు డయాలసిస్ చేసుకున్న కారణంగా రాలేనని ప్రియాంకకు తెలియజేశారు. దీంతో పాటు కుటుంబంతో కలిసి డిన్నర్‌కు రావాలని ప్రియాంకను ఆయన ఆహ్వానించారు. ప్రత్యేకమైన ఉత్తరఖండ్ మీల్స్‌ను ఆయన ప్రియంక గాంధీ వాద్రా కుటుంబం కోసం తయారు చేయించనున్నారు. ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలలో నివసిస్తున్నారు. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే. లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు ప్రియాంక తాత్కాలికంగా మకాం మార్చనున్నారు. ప్రస్తుతం అనిల్ బలూని గురుద్వారాలోని గవర్నమెంట్ బంగ్లాలో నివసిస్తున్నారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ప్రియాంక తేనీటి ఆహ్వానం -
బీజేపీ ఎంపీకి ప్రియాంక ఆహ్వానం
న్యూఢిల్లీ : తను నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసే ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీజేపీ ఎంపీ అనిల్ బలూనీని టీ కోసం ఆహ్వానించారు. ఈ మేరకు ఎంపీకి ఫోన్ చేయడంతోపాటు, ఆయన కార్యాలయానికి లేఖ కూడా పంపించారు. అయితే ప్రియాంక ఆహ్వానంపై అనిల్ బలూనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. నిర్ణీత సమయంలోపు ఇంటిని ఖాళీ చేసేందుకు ప్రియాంక సిద్ధంగా ఉన్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు ప్రియాంక తాత్కాలికంగా మకాం మార్చనున్నారు. (గురుగ్రాంకు ప్రియాంకా గాంధీ మకాం) ఇక ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలో నివసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని అనిల్ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే.. దీంతో ఎంపీని ఆయన భార్యతో సహా టీ కోసం ప్రియాంక గాంధీ ఆహ్వానించారు. (31 నుంచి అసెంబ్లీ పెట్టండి) -
గురుగ్రాంకు ప్రియాంకా గాంధీ మకాం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు తాత్కాలికంగా మకాం మార్చనున్నారు. కొద్దినెలల పాటు ఆమె గురుగ్రాంలోని డీఎల్ఎఫ్ అరాలియా నివాసంలో ఉంటారని ప్రియాంక సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. ఢిల్లీలోని రెండుమూడు ప్రాంతాల్లో వసతి గృహం కోసం పరిశీలిస్తున్న ప్రియాంక త్వరలోనే అద్దె ఇంటిని ఖరారు చేస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్ ప్రాంతంలో ఓ ఇంటిని ఆమె ఎంచుకున్నారని మరమ్మతు పనులు పూర్తయినే వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లవచ్చని పేర్కొన్నాయి. అప్పటివరకూ గురుగ్రాంలో ప్రియాంక నివసిస్తారని తెలిపాయి. ఇప్పటికే పలు గృహోపకరణాలు, వస్తువులను గురుగ్రాంకు తరలించారని, భద్రతా తనిఖీల ప్రక్రియ కూడా ముగిసిందని వెల్లడించాయి. ప్రియాంక నివాసం వద్ద సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చెక్‌ను చేపట్టినట్టు తెలిసింది. కాగా ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించడంతో ఢిల్లీలోని 35 లోధీ ఎస్టేట్ నుంచి ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆమెకు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నోటీసులపై ప్రియాంక స్పందిస్తూ జులై 31లోగా లోధీ ఎస్టేట్ నివాసాన్ని ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. చదవండి : పైలట్‌తో మంతనాలు.. రంగంలోకి ప్రియాంక -
శుభ్రా ముఖర్జీకి అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీకి బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. ఆమె అంత్యక్రియలు లోధీ రోడ్డులోని విద్యుత్ దహనవాటికలో జరిగాయి. 13, తల్కటోరా రోడ్డులోని కుమారుడు అభిజిత్ నివాసం నుంచి భౌతికకాయాన్ని దహనవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తదితరులు హాజరయ్యారు. చితాభస్మాన్ని ఆమె కుటుంబసభ్యులు హరిద్వార్‌కు తీసుకెళ్లి గంగానదిలో కలిపారు. శుభ్రా శ్వాససంబంధ వ్యాధితో మంగళవారం మృతిచెందడం తెలిసిందే. బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం ఢాకా నుంచి వచ్చి ప్రణబ్‌ను పరామర్శించారు. శుభ్రాముఖర్జీ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. 1975లో బంగ్లా స్వతంత్ర పోరాట సమయంలో దేశ బహిష్కారానికి గురైనప్పుడు భారత్‌లో తలదాచుకున్న హసీనాకు ప్రణబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. శుభ్రా అంత్యక్రియలు పూర్తయిన కాసేపటి తర్వాత ప్రణబ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని తిరిగి అధికార విధులు ప్రారంభించారు. -
లోధీ రోడ్డు శ్మశానవాటికలో కుష్వంత్ సింగ్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ అంత్యక్రియలు లోధీరోడ్డు శ్మశానవాటికలో జరిగాయి. 99 సంవత్సరాల వయసులో గురువారం కన్నుమూసిన కుష్వంత్ సింగ్‌కు ఢిల్లీతో ఎనలేని అనుబంధముంది. కుష్వంత్ సింగ్ తండ్రి సర్ శోభాసింగ్ లూట్యెన్స్ ఢిల్లీ కాలనీని నిర్మించిన బిల్డర్లలో ఒకరు. ఢిల్లీతో తనకున్న అనుబంధాన్ని సింగ్ తన రచనల్లో నిక్షిప్తం చేశారు. ఆయన రాసిన ఢిల్లీ నవల ఇందుకో ఉదాహరణ. ట్రైన్ టు పాకిస్థాన్ వంటి రచనలు ఆయనకు సాహితీరంగంలో విశిష్టస్థానాన్ని సంపాదించి పెట్టాయి వ్యంగ్య రచనలకు పేరొందిన సింగ్, సాంటా బంటా జోడీపై రాసిన జోక్‌లు ఆదరణ పొందాయి. సింగ్ ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలు, పుస్తకాలు చదివేవారని ఆయన కుమారుడు రాహుల్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం కూడా దినపత్రిక చదివారని, 10 రోజు కిందట ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ గురించి అడిగారని ఆయన వివరించారు.