లోధీ రోడ్డు శ్మశానవాటికలో కుష్వంత్ సింగ్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ అంత్యక్రియలు లోధీరోడ్డు శ్మశానవాటికలో జరిగాయి. 99 సంవత్సరాల వయసులో గురువారం కన్నుమూసిన కుష్వంత్ సింగ్‌కు ఢిల్లీతో ఎనలేని అనుబంధముంది.
కుష్వంత్ సింగ్ తండ్రి సర్ శోభాసింగ్ లూట్యెన్స్ ఢిల్లీ కాలనీని నిర్మించిన బిల్డర్లలో ఒకరు. ఢిల్లీతో తనకున్న అనుబంధాన్ని సింగ్ తన రచనల్లో నిక్షిప్తం చేశారు. ఆయన రాసిన ఢిల్లీ నవల ఇందుకో ఉదాహరణ. ట్రైన్ టు పాకిస్థాన్ వంటి రచనలు ఆయనకు సాహితీరంగంలో విశిష్టస్థానాన్ని సంపాదించి పెట్టాయి వ్యంగ్య రచనలకు పేరొందిన సింగ్, సాంటా బంటా జోడీపై రాసిన జోక్‌లు ఆదరణ పొందాయి.
సింగ్ ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలు, పుస్తకాలు చదివేవారని ఆయన కుమారుడు రాహుల్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం కూడా దినపత్రిక చదివారని, 10 రోజు కిందట ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ గురించి అడిగారని ఆయన వివరించారు.