పాట్నా/కొల్హాపూర్: కుటుంబ సభ్యుల కన్నీళ్లు.. బంధువులు, సన్నిహితుల భావోద్వేగాలు.. పాకిస్థాన్ వ్యతిరేక నినాదాల మధ్య ఐదుగురు వీర జవాన్ల అంత్యక్రియలు పూర్తయ్యాయి. గురువారం సైనిక లాంఛనాలతో జవాన్లకు బీహార్, మహారాష్ట్రల్లో శాస్త్రోక్తంగా అంతిమ సమస్కారాలు నిర్వహించారు. మంగళవారం భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన పాకిస్థాన్ సైనికులు పూంచ్ సెక్టార్‌లో జరిపిన కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.
జవాన్లపై బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పాక్ జవాన్ల కాల్పుల్లో మరణించిన వీర జవాన్లపై బీహార్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బుధవారం రాత్రి నలుగురు జవాన్ల మృతదేహాలు ప్రత్యేక విమానంలో పాట్నా విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో బీహార్ మంత్రులెవరూ లేరు. దీనిపై విలేకరులు బీహార్ పంచాయతీ రాజ్ మంత్రి బీమ్‌సింగ్‌ను ప్రశ్నించగా.. వీర మరణం పొందేందుకే ప్రజలు సైన్యం లేదా పోలీసు శాఖల్లో చేరుతున్నారన్నారు. విలేకరులు పదేపదే ప్రశ్నించగడంతో వారిపై అసహనం వ్యక్తం చేస్తూ ‘మీరు అక్కడికి వెళ్లింది వృత్తిలో భాగంగానే. దానికి మీరు డబ్బులు తీసుకుంటార’ని చెప్పారు. బీమ్‌సింగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. కాగా, తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో బీమ్‌సింగ్ మాట మార్చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు.
వీర జవాన్లకు తుది వీడ్కోలు
Published Fri, Aug 9 2013 5:57 AM | Last Updated on Mon, Oct 22 2018 8:44 PM
Advertisement