న్యూఢిల్లీ : తను నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసే ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీజేపీ ఎంపీ అనిల్ బలూనీని టీ కోసం ఆహ్వానించారు. ఈ మేరకు ఎంపీకి ఫోన్ చేయడంతోపాటు, ఆయన కార్యాలయానికి లేఖ కూడా పంపించారు. అయితే ప్రియాంక ఆహ్వానంపై అనిల్ బలూనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. నిర్ణీత సమయంలోపు ఇంటిని ఖాళీ చేసేందుకు ప్రియాంక సిద్ధంగా ఉన్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు ప్రియాంక తాత్కాలికంగా మకాం మార్చనున్నారు. (గురుగ్రాంకు ప్రియాంకా గాంధీ మకాం)
ఇక ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలో నివసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని అనిల్ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే.. దీంతో ఎంపీని ఆయన భార్యతో సహా టీ కోసం ప్రియాంక గాంధీ ఆహ్వానించారు. (31 నుంచి అసెంబ్లీ పెట్టండి)
Comments
Please login to add a commentAdd a comment