కిడ్నాప్‌ కోసం వచ్చి ముక్కు కోసి.. | Group Of Men Chopped Off Girl Nose In Gurgaon | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కోసం వచ్చి ముక్కు కోసి..

Published Mon, Dec 30 2019 12:05 PM | Last Updated on Mon, Dec 30 2019 12:05 PM

Group Of Men Chopped Off Girl Nose In Gurgaon - Sakshi

గురుగ్రామ్‌: ఓ కిడ్నాపర్ల ముఠా దారుణానికి తెగపడింది. వారు కిడ్నాప్‌ చేద్దాం అనుకున్న అమ్మాయి ప్రతిఘటించడంతో ఆమె ముక్కు కోసి పారిపోయారు. ఈ ఘటన గురుగ్రామ్‌కి సమీపంలో ఉన్న చక్కర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చక్కర్‌పూర్‌ గ్రామంలోని ఓ అమ్మాయిని కిడ్నాప్‌ చేయాలని అదే గ్రామనికి చెందిన గౌరవ్ యాదవ్, ఆకాష్ యాదవ్, సతీష్ యాదవ్, మోను యాదవ్‌, లీలు యాదవ్‌ ముఠా పథకం వేసింది. పథకం ప్రకారం ఆదివారం వారు ఆ అమ్మాయి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి, ఆమె సోదరుడు దివీన్ దయాల్ ప్రతిఘటించడంతో.. ఆ ముఠాలోని ఇద్దరు వ్యక్తులు అమ్మాయి ముక్కుకోసి పారిపోయారని పోలీసులు తెలిపారు.

కిడ్నాప్‌కి పాల్పడ్డవారు ‘తరచు జనాలతో గోడవలు పెట్టుకుంటారు. వారిపై కేసుపెడితే బలవంతపెట్టి మరీ కేసులు ఉపసంహరించుకునేలా చేస్తారు. ఈ ఘటనతో మాకు చాలా భయంగా ఉంది. కిడ్నాప్‌ చేస్తున్న సమయంలో మా ఇంటి ముందు మరో 20 మంది ఆ ముఠాకి సహకరించారు. కిడ్నాప్‌కి తెగపడిన వారిపై గురుగ్రామ్‌ పోలీసు స్టేషన్‌లో  కేసు నమోదు చేశాన’ని బాధితురాలి సోదరుడు దివీన్ దయాల్ తెలిపాడు. కిడ్నాప్‌కి పాల్పడిన ఆ ముఠాపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి అరవింద్‌ కుమార్‌ తెలిపారు. అదే విధంగా వారిని అరెస్ట్‌ చేయడానికి గాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement