kidnap a girl
-
కాకినాడ జిల్లా పెద్దాపురంలో మైనర్ బాలిక కిడ్నాప్
-
14 ఏళ్ల బాలిక కిడ్నాప్ డ్రామా.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముంబై: చదువుకోమని తల్లి మందలించటంతో ఓ 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నాగ్‌పూర్ నుంచి పక్క జిల్లా చంద్రాపూర్‌కు వెళ్లిన బాలిక తాను కిడ్నాప్‌కు గురయ్యానని ఓ కట్టుకథ అల్లింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. కేసు వివరాలను ఆదివారం వెల్లడించారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ జిల్లాలోని నందన్వన్ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. బస్సులో 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్‌కు సాయంత్రానికి చేరుకుంది. తమ కూతురు కనిపించకపోవటంతో ఆమె కోసం వెతకటం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. ఆచూకీ లభించకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు.. చంద్రాపూర్ చేరుకున్న బాలిక నేరుగా రామ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి కారులో చంద్రాపూర్‌కు తీసుకొచ్చినట్లు చెప్పింది. వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు కట్టుకథ అల్లింది. బాలిక తెలిపిన వివరాలతో నాగ్‌పూర్‌లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు చంద్రాపూర్ పోలీసులు. ఆ తర్వాత వారికి అప్పగించారు. నాగ్‌పూర్‌లోని నందన్వన్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. బాలిక తానే బస్సు ఎక్కి చంద్రాపూర్ వెళ్లినట్లు తేలింది. ఈ వీడియోను చూపించి ప్రశ్నించగా.. తన తల్లి చదువుకోవాలని మందలించటం వల్లే ఇలా చేశానని అంగీకరించింది. ఇదీ చదవండి: ‘సూపర్ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్ -
కిడ్నాప్ కోసం వచ్చి ముక్కు కోసి..
గురుగ్రామ్: ఓ కిడ్నాపర్ల ముఠా దారుణానికి తెగపడింది. వారు కిడ్నాప్ చేద్దాం అనుకున్న అమ్మాయి ప్రతిఘటించడంతో ఆమె ముక్కు కోసి పారిపోయారు. ఈ ఘటన గురుగ్రామ్‌కి సమీపంలో ఉన్న చక్కర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చక్కర్‌పూర్ గ్రామంలోని ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని అదే గ్రామనికి చెందిన గౌరవ్ యాదవ్, ఆకాష్ యాదవ్, సతీష్ యాదవ్, మోను యాదవ్, లీలు యాదవ్ ముఠా పథకం వేసింది. పథకం ప్రకారం ఆదివారం వారు ఆ అమ్మాయి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి, ఆమె సోదరుడు దివీన్ దయాల్ ప్రతిఘటించడంతో.. ఆ ముఠాలోని ఇద్దరు వ్యక్తులు అమ్మాయి ముక్కుకోసి పారిపోయారని పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కి పాల్పడ్డవారు ‘తరచు జనాలతో గోడవలు పెట్టుకుంటారు. వారిపై కేసుపెడితే బలవంతపెట్టి మరీ కేసులు ఉపసంహరించుకునేలా చేస్తారు. ఈ ఘటనతో మాకు చాలా భయంగా ఉంది. కిడ్నాప్ చేస్తున్న సమయంలో మా ఇంటి ముందు మరో 20 మంది ఆ ముఠాకి సహకరించారు. కిడ్నాప్‌కి తెగపడిన వారిపై గురుగ్రామ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాన’ని బాధితురాలి సోదరుడు దివీన్ దయాల్ తెలిపాడు. కిడ్నాప్‌కి పాల్పడిన ఆ ముఠాపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి అరవింద్ కుమార్ తెలిపారు. అదే విధంగా వారిని అరెస్ట్ చేయడానికి గాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురిపై నిర్భయ కేసు
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: ఓ విద్యార్థిని వెంటపడి కిడ్నాప్ చేసి వేధించిన ముగ్గురిపై రామచంద్రాపురం పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. ఎస్ఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జీవనోపాధికోసం మరో రాష్ట్రం నుంచి వచ్చిన ఓ కుటుంబం రామచంద్రాపురంలో స్థిరపడింది. ఈ కుటుంబంలోని 15 సంవత్సరాల బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలిక చదువుతున్న పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించగా, బెల్ విద్యుత్‌నగర్‌కు చెందిన మతిన్ డెకరేషన్ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలోనే బాలికపై కన్నేసి అతను మాటల్లో దింపి తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. తరచూ బాలికతో ఫోన్లో మాట్లాడుతూ అప్పుడప్పుడూ కలిసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే తన మిత్రులైన రామచంద్రాపురానికి చెందిన ఆటోడ్రైవర్ సుల్తాన్, జవహర్‌నగర్‌కు చెందిన టెన్నీస్ కోచ్ మహేశ్‌లను బాలికకు పరిచయం చేశాడు. వీరంతా బాలికను అప్పుడప్పుడూ పాఠశాల నుంచి ఆటోలో తీసుకెళ్లి ఇంటివద్ద దింపేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న మతిన్, సుల్తాన్, మహేశ్‌లు హైదరాబాద్ చూపిస్తామంటూ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకువెళ్లారు. అనంతరం హైదరాబాద్ నుండి ఆ బాలిక ను బీదర్‌కు తీసుకెళ్లారు. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేయగా బాలిక బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు శనివారం బీదర్‌కు వెళ్లి బాలికతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం నిందింతులను తమదైనశైలిలో విచారించిన పోలీసులు వారు తెలిపిన వివరాల మేరకు వారిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.