గురుగ్రామ్: ఇటీవలకాలంలో రకరకాల నేరాలను చూస్తునే ఉన్నాం. పైగా ఈ కేటుగాళ్ల మోసాలకు అంతేలేకుండా పోయింది. ఆఖరికి పోలీస్‌ననో లేక ఐఏఎస్ ఆఫీసర్ అనో నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలే ఎక్కువ. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఒక ప్రైవేట్ ఉద్యోగిని కేంద్రప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ బురిడి కొట్టించాడు.
(చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు)
అసలు విషయంలోకెళ్లితే... బిహార్‌కు చెందిన పాండే తాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానంటూ నగరానికి చెందిన బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వికేష్ కుమార్ గుప్తాను మోసం చేశాడు. పైగా తన ఐఏఎస్ అధికారంతో తనకు భారత రక్షణ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ మేరకు గుప్తా ఆ నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ పాండేకి లక్ష రూపాయాలు కూడా ఇచ్చాడు.
అంతేకాదు ఎటువంటి అనుమానం రాకుండా తన వాట్సాప్ ఖాతాలో మంత్రిత్వ శాఖ సర్టిఫికేట్‌తో ఉన్న ఫోటోను ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు. అయితే కొద్ది నెలలు తర్వాత గుప్తా ఆ వాట్సాప్ ఖాతాలోని ఫోటోని నకిలీ ఫోటోగా గుర్తించి తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. పైగా ఆ వ్యక్తి తన సహోద్యోగి ప్రేమ్ ప్రశాద్ ద్వారా పరిచయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమే కాక పాండేని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
(చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!)
Comments
Please login to add a commentAdd a comment