Bank executive
-
ఐఏఎస్ ఆఫీసర్‌నంటూ.... బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌కి టోకరా
గురుగ్రామ్: ఇటీవలకాలంలో రకరకాల నేరాలను చూస్తునే ఉన్నాం. పైగా ఈ కేటుగాళ్ల మోసాలకు అంతేలేకుండా పోయింది. ఆఖరికి పోలీస్ననో లేక ఐఏఎస్ ఆఫీసర్ అనో నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలే ఎక్కువ. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఒక ప్రైవేట్ ఉద్యోగిని కేంద్రప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ బురిడి కొట్టించాడు. (చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు) అసలు విషయంలోకెళ్లితే... బిహార్‌కు చెందిన పాండే తాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానంటూ నగరానికి చెందిన బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వికేష్ కుమార్ గుప్తాను మోసం చేశాడు. పైగా తన ఐఏఎస్ అధికారంతో తనకు భారత రక్షణ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ మేరకు గుప్తా ఆ నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ పాండేకి లక్ష రూపాయాలు కూడా ఇచ్చాడు. అంతేకాదు ఎటువంటి అనుమానం రాకుండా తన వాట్సాప్ ఖాతాలో మంత్రిత్వ శాఖ సర్టిఫికేట్‌తో ఉన్న ఫోటోను ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు. అయితే కొద్ది నెలలు తర్వాత గుప్తా ఆ వాట్సాప్ ఖాతాలోని ఫోటోని నకిలీ ఫోటోగా గుర్తించి తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. పైగా ఆ వ్యక్తి తన సహోద్యోగి ప్రేమ్ ప్రశాద్ ద్వారా పరిచయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమే కాక పాండేని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!) -
విమాన ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?
కరాచీ: తీవ్ర విషాదాన్ని నింపిన పాకిస్తాన్ విమాన ప్రమాదంలో బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ అనేది పాకిస్తాక్‌కు చెందిన బ్యాంక్. ఇది లాహోర్‌లో ఉంది. అటు ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ మోదీ ట్వీట్ చేశారు. (పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం) Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured. — Narendra Modi (@narendramodi) May 22, 2020 పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలు వెంటనే రంగంలోకి సహాయక చర్యల్ని చేపట్టాయి. మరోవైపు ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన విమాన ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సిబ్బందితోపాటు 99 మంది ప్రయాణికులు మొత్తం 106 మంది బతికి వుండే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్లో లాక్డౌన్ ఆంక్షలతో ఈద్ కారణంగా ప్రత్యేక పీఏఐ ఎయిర్‌బస్ ఎ 320 విమానం లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరింది. ల్యాండిగ్‌కు ఒక నిమిషం ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో శుక్రవారం మధ్యాహ్నం కరాచీ విమానాశ్రయానికి అర కిలోమీటర్ దూరంలో జనసాంద్రత గల జిన్నా గార్డెన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. కాగా, 2016 డిసెంబరు 7 తరవాత పాకిస్తాన్లో చోటు చేసుకున్న అతిపెద్ద విమాన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ (ఫైల్ ఫోటో) Shocked & saddened by the PIA crash. Am in touch with PIA CEO Arshad Malik, who has left for Karachi & with the rescue & relief teams on ground as this is the priority right now. Immediate inquiry will be instituted. Prayers & condolences go to families of the deceased. — Imran Khan (@ImranKhanPTI) May 22, 2020 -
బ్యాంకు ఉద్యోగిని బలిగొన్న బైక్ రైడింగ్!
గురుగ్రామ్ : బైక్ రైడింగ్ సరదా ఓ బ్యాంకు ఉద్యోగి ప్రాణాలు బలిగొంది. స్నేహితులతో కలిసి లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లిన అతడు అతి వేగం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుండ్లీ-మనేసర్- సల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ ఢిల్లీకి చెందిన సంచిత్ ఒబెరాయ్(25) ఓ మల్టీనేషనల్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. బైక్ రైడింగ్ అంటే సరదా ఉన్న సంచిత్.. ఇటీవలే సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌ను కొనుగోలు చేశాడు. స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం లాంగ్‌డ్రైవ్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో స్నేహితులంతా పోటాపోటీగా బైక్‌లు నడుపుతూ వేగంగా వెళ్తున్న సమయంలో.. సంచిత్ వేగాన్ని పెంచాడు. దీంతో తన ముందు ప్రయాణిస్తున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంచిత్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగం కారణంగానే.. ప్రమాదం జరిగిన సమయంలో సంచిత్ బైక్ 200 కిలో మీటర్ల స్పీడుతో ప్రయాణిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. సంచిత్ స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కిలాడీ లేడీ ఆట కట్టు
న్యూఢిల్లీ: కోట్ల రూపాయలు దండుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కిలాడీ లేడీ ఆట కట్టించారు పోలీసులు. దక్షిణ బెంగళూరు కు చెందిన విశాలాక్షిభట్(42)ను బెంగళూరు పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. జెపినగర్లో నివసిస్తున్న విశాలాక్షి బెంగళూరు సహా కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులను మోసం చేసింది. హెచ్ డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్సూరెన్స విభాగం మేనేజర్‌గా పరిచయం చేసుకుని ఏకంగా సినీ ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలనే బురిడీ కొట్టించింది. తన ఖాతాలో సొమ్ము డిపాజిట్ చేస్తే 5 శాతం ఇన్సూరెన్స్ వడ్డీ వస్తుందని, షేర్ల ద్వారా లాభాలు చెల్లిస్తామని ఈ అవకాశం తన కంపెనీకి మాత్రమే ఉందని వారిని నమ్మించింది. ఇలా 60 మందికి సుమారు రూ.30 కోట్ల మేరకు కుచ్చు టోపీ పెట్టింది. నవంబర్ మొదటి వారంలో తన భార్య కనిపించడంలేదంటూ విశాలాక్షి భర్త శ్రీకాంత హెగ్డే ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 60మంది బాధితులు, తమను చీట్ చేసిందంటూ జెపినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆమె బండారం బయటపడింది. మూడుకోట్లకు పై మోసపోయామని ఐదుగురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ పిఎ శ్రీనివాస్, సుమలత సోదరి, రూ. 72 లక్షలకు పైగా ముట్టచెప్పిన రేణుకాదేవి కూడా ఉన్నారు. విశాలాక్షి అరెస్టును పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. తమ కళ్లుగప్పి తప్పించుకుతిరుగుతున్న ఆమెను ఆరెస్టు చేశామని త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఆమెను ఢిల్లీనుంచి తీసుకువచ్చి విచారణ జరుపుతామని సౌత్ డీసీపీ లోకేశ్‌కుమార్ తెలిపారు. -
స్పష్టత లేని రుణమాఫీపై సంబరాలు ఎందుకు?
సాలూరు : రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మం త్రులు, బ్యాంకు అధికారులు తలో విధంగా మాట్లాడి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర విమర్శించారు. స్పష్టత లేని రుణమాఫీపై టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. సీఎం రుణమాఫీ చేసేశామని, వ్యవసాయ శాఖా మంత్రి రైతులు ముందు డబ్బులు కట్టేస్తే ఆ తరువాత ఇచ్చేస్తామని.. అలా అయితేనే కొత్త రుణాలు ఇస్తామని చె బుతున్నారన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మాత్రం రుణమాఫీ సాధ్యం కాదని, అవసరమైతే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారన్నారు. ఇలా తలో విధంగా మాట్లాడుతుండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. రీషెడ్యూల్ అర్థం తెలి స్తే సంబరాలకు బదులు ప్రభుత్వంపై సమరం చేస్తారన్నా రు. రైతులతో పాటు మహిళా సంఘాలను కూడా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతులు, మహిళలకు న్యాయం జరి గే వరకూ వారి తరుఫున పోరాటం చేస్తామని చెప్పారు.