ఆర్బీఐ గవర్నర్కు బెదిరింపు ఈ-మెయిల్ | threat email to RBI Governor | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ గవర్నర్కు బెదిరింపు ఈ-మెయిల్

Published Thu, Apr 16 2015 10:51 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

ఆర్బీఐ గవర్నర్కు  బెదిరింపు ఈ-మెయిల్ - Sakshi

ఆర్బీఐ గవర్నర్కు బెదిరింపు ఈ-మెయిల్


హైదరాబాద్:  రిజర్వ్  బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్  రఘురామ్ రాజన్కు  బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది.  దీనికి సంబంధించి ఆయనకు ఒక ఈ- మెయిల్ వచ్చినట్టుగా సమాచారం.  దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

బెదిరింపులు రావడంతో రాజన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఈ విషయాన్ని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఈమెయిల్లో రాజన్కు బెదిరింపు లేఖ వచ్చిందని మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) కేపీ బక్షి తెలిపారు. అయితే ఈమెయిల్ వివరాలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ఈమెయిల్ అందిన తర్వాత ఆర్బీఐ అధికారులు క్రైంబ్రాంచి పోలీసులకు విషయం తెలిపారు. సైబర్ క్రైం విభాగం ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తోంది. ఈమెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement