సాక్షి, హైదరాబాద్ : టీఎస్‌పీఎస్‌సీ పేరుతో నకిలీ ఈమెయిల్ సృష్టించారు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు. ఈ మేరకు తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ విభాగానికి నకిలీ ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో పౌరసరఫరాలు, పోలీస్‌శాఖ సహా పలు శాఖల్లో ఖాళీలున్నాయని ఉంది. దీంతో టీఎస్‌పీఎస్‌సీ ముఖ్యకార్యదర్శి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment