ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్! | 14 engineers Safe via email! | Sakshi
Sakshi News home page

ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్!

Published Tue, Jul 29 2014 8:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్!

ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్!

బెంగళూరు: అడవుల్లో చిక్కుకుపోయిన 14 మంది సాప్ట్వేర్ ఇంజనీర్లు ఈ-మెయిల్ ద్వారా సురక్షితంగా బయటపడగలిగారు. చెన్నైకి చెందిన ఈ ఇంజనీర్లు  కర్ణాటక హాసన్ జిల్లాలోని అడవుల్లోకి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దట్టమై ఆ అడవుల్లో వారు దారి తప్పారు.

తాము దారి తప్పిన విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా వారు తమ మిత్రులకు  తెలియజేశారు. ఆ మిత్రులు ఈ విషయం అటవీ శాఖ సిబ్బందికి తెలిపారు. అటవీ సిబ్బంది వెంటనే స్పందించి అడవిలో వెతికి వారిని పట్టుకున్నారు. అటవీ సిబ్బంది కనిపించగానే ఆ ఇంజనీర్లకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినంత పనైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement