Farest
-
అడవిలో శవం: పీక్కుతిన్న జంతువులు
న్యూఢిల్లీ : హత్యకు గురైన ఓ బాలుడి శవాన్ని అడవి జంతువులు పీక్కుతిన్న ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ ఢిల్లీలోని ప్రజాపతి మోహల్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ అతడి మిత్రుడికి 2500 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అయితే స్నేహితుడు ఎంతకీ అప్పు తీర్చకపోవటంతో మైనర్‌కు విపరీతమైన కోపం వచ్చింది. నవంబర్ నెలలో అప్పు విషయమై ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మైనర్ అతడి మిత్రుడ్ని బండరాయితో కొట్టి చంపాడు. ( నరక కూపం.. వేశ్యావాటికల్లో యువతులు ) అనంతరం శవాన్ని దగ్గరలోని మైదాన్‌గర్హి అడవిలో పడేశాడు. నిందితుడు హత్య విషయాన్ని తండ్రికి చెప్పటంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అడవిలోకి వెళ్లి చూడగా మృతుడి శవం కనిపించింది. శవం అరచేతులు, తల భాగాల్ని కొద్దిగా అడవి జంతువులు పీక్కుతిన్నాయి. మృతుడి తల్లిదండ్రులు బట్టలు, శరీరంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా కుమారుడ్ని గుర్తించారు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. -
అరుదైన సర్పం
జయపురం : జయపురం పట్టణానికి స్నేక్ పారడైజ్ అని పేరు ఉంది. ఈ ప్రాంత ప్రజలంతా జయపురాన్ని పాముల స్వర్గం అంటారు. ఈ ప్రాంతంలో అనేక రకాల పాములు సంచరించడమే ఇందుకు కారణం. జయపురం వన్యప్రాణి పరిరక్షణ కమిటీ జయపురం పరిసర ప్రాంతాలలో అనేక రకాల పాములను పట్టుకుంటూ వాటిని సమీప అడవులలో విడిచిపెడుతోంది. ముఖ్యంగా వన్యప్రాణి çపరిరæక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కృష్ణ కేశవ షడంగి జయపురంలోను, గ్రామీణ ప్రాంతాలలో, ఇళ్లలోను కనిపించే పాములను సునాయాసంగా బంధించి వాటిని అడవిలో విడిచిపెడుతుంటారు. ఏప్రాంతంలో పాము కనిపించినా ఆయనకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి పట్టుకుని సురక్షిత ప్రాంతాలలో విడిచి పెడతారు. గురువారం ఆయన జిల్లా కోర్టు ఆవరణలో సంచరిస్తున్న అపూర్వమైన పామును పట్టుకున్నారు. ఆ పామును పట్టుకున్న షడంగి అటువంటి పాములు కేవలం ఒడిశాలోనే కనిపిస్తాయని వెల్లడించారు. దానిని ట్రింకెట్ స్నేక్ అని అంటారని చెప్పారు. ఒడిశాలో దీనిని కౌడియ చిట్టి అని పిలుస్తారన్నారు. -
ఆర్లపెంట అడవిలో మృతదేహం
దమ్మపేట : మండలంలోని అంకంపాలెం శివారు ఆర్లపెంట అడవిలో ఓ వ్యక్తి మృతదేహం గురువారం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు గాంధీనగరం గ్రామానికి చెందిన బైట శివ(28) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం, అదే మండలం రుద్రాక్షపల్లికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం బైక్(ఏపీ 37–ఏఎల్ 4520)పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శివ తండ్రి సురేష్(లారీ డ్రైవర్)కు కుటుంబీకులు తెలిపారు. డ్యూటీలో ఉన్న సురేష్, వెంటనే తన సోదరుడు బైట కృష్ణ, మేనల్లుడు పద్దం ప్రసాద్‌కు సమాచారమిచ్చాడు. వారు శివ కోసం గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు. గురువారం ఉదయం దమ్మపేట మండలం ఆర్లపెంట సమీపంలో వినాయకపురం రోడ్డు సమీపంలోగల జామాయిల్ తోటలో శివ తీసుకెళ్లిన బైక్ ఉందని తండ్రికి సమాచారం అందింది. శివ కుటుంబీకులు అక్కడికెళ్లారు. వినాయకపురం రోడ్డు పక్కనున్న ఇందిరాసాగర్ కాలువ కోసం గతంలో తీసుకొచ్చి పడేసిన పైపులో శివ మృతదేహం కనిపించింది. తల భాగంలో, ముక్కు నుంచి రక్తం కారింది. తన కుమారుడిని ఎవరో కొట్టి చంపి, మృతదేహాన్ని ఇక్కడ పెట్టారని పోలీసులకు సురేష్ ఫిర్యాదు చేశాడు. ఈ స్థలాన్ని గురువారం అశ్వారావుపేట సీఐ ఎం.అబ్బయ్య, దమ్మపేట ఎస్ఐ జలకం ప్రవీణ్ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా ఏఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు. -
ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్!
బెంగళూరు: అడవుల్లో చిక్కుకుపోయిన 14 మంది సాప్ట్వేర్ ఇంజనీర్లు ఈ-మెయిల్ ద్వారా సురక్షితంగా బయటపడగలిగారు. చెన్నైకి చెందిన ఈ ఇంజనీర్లు కర్ణాటక హాసన్ జిల్లాలోని అడవుల్లోకి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దట్టమై ఆ అడవుల్లో వారు దారి తప్పారు. తాము దారి తప్పిన విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా వారు తమ మిత్రులకు తెలియజేశారు. ఆ మిత్రులు ఈ విషయం అటవీ శాఖ సిబ్బందికి తెలిపారు. అటవీ సిబ్బంది వెంటనే స్పందించి అడవిలో వెతికి వారిని పట్టుకున్నారు. అటవీ సిబ్బంది కనిపించగానే ఆ ఇంజనీర్లకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినంత పనైంది.