ఆర్లపెంట అడవిలో మృతదేహం | Man Found Dead In Forest With Injuries | Sakshi
Sakshi News home page

ఆర్లపెంట అడవిలో మృతదేహం

Published Fri, Mar 30 2018 6:45 AM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

Man Found Dead In Forest With Injuries - Sakshi

శివ మృతదేహం

దమ్మపేట : మండలంలోని అంకంపాలెం శివారు ఆర్లపెంట అడవిలో ఓ వ్యక్తి మృతదేహం గురువారం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు గాంధీనగరం గ్రామానికి చెందిన బైట శివ(28) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం, అదే మండలం రుద్రాక్షపల్లికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం బైక్‌(ఏపీ 37–ఏఎల్‌ 4520)పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శివ తండ్రి సురేష్‌(లారీ డ్రైవర్‌)కు కుటుంబీకులు తెలిపారు.

డ్యూటీలో ఉన్న సురేష్, వెంటనే తన సోదరుడు బైట కృష్ణ, మేనల్లుడు పద్దం ప్రసాద్‌కు సమాచారమిచ్చాడు. వారు శివ కోసం గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు. గురువారం ఉదయం దమ్మపేట మండలం ఆర్లపెంట సమీపంలో వినాయకపురం రోడ్డు సమీపంలోగల జామాయిల్‌ తోటలో శివ తీసుకెళ్లిన బైక్‌ ఉందని తండ్రికి సమాచారం అందింది. శివ కుటుంబీకులు అక్కడికెళ్లారు. వినాయకపురం రోడ్డు పక్కనున్న ఇందిరాసాగర్‌ కాలువ కోసం గతంలో తీసుకొచ్చి పడేసిన పైపులో శివ మృతదేహం కనిపించింది.

తల భాగంలో, ముక్కు నుంచి రక్తం కారింది. తన కుమారుడిని ఎవరో కొట్టి చంపి, మృతదేహాన్ని ఇక్కడ పెట్టారని పోలీసులకు సురేష్‌ ఫిర్యాదు చేశాడు. ఈ స్థలాన్ని గురువారం అశ్వారావుపేట సీఐ ఎం.అబ్బయ్య, దమ్మపేట ఎస్‌ఐ జలకం ప్రవీణ్‌ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా ఏఎస్‌ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement