Hassan district
-
నిశ్చితార్థమైన యువకునితో బయటకెళ్లి.. ఇద్దరూ విషం తాగి..
సాక్షి, బెంగళూరు: నిశ్చితార్థమైన యువకునితో వెళ్లిన బాలిక అనుమానాస్పదరీతిలో చనిపోగా, యువకుడు కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా కోణనూరు హొబళిలో జరిగింది. కొడ్లూరు గ్రామానికి చెందిన దినేశ్‌కు కోణనూరుకు చెందిన 16 ఏళ్ల బాలికతో నిశ్చితార్థం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు రామనాథపురలో జరిగిన షష్ఠి జాతరకు బైకుపై దినేశ్‌తో కలిసి వెళ్లింది. సాయంత్రం 4 గంటలకు మీ కూతురు విషం తాగిందంటూ దినేశ్ కుటుంబసభ్యులు ఫోన్ చేసి, హాసన్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. దినేశ్ కూడా విషం తాగినట్లు గుర్తించారు. ఇతడు చికిత్స పొందుతున్నాడు. కూతురి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశు సంక్షేమ సమితి కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కామాంధునికి 20 ఏళ్ల జైలు శిక్ష బాలునిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఉత్తరకన్నడ జిల్లా కారవార జిల్లా సత్ర న్యాయస్థానం మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను విధించింది. కారవార వన్నహళ్లికి చెందిన అన్సారి ఖాసిం జింగ్రో ఈ ఏడాది మార్చి 15న ఆరేళ్ల బాలునికి చాక్లెట్ ఇప్పిస్తానని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. చదవండి: (పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్ బ్యూటీ) -
పీటల మీద పెళ్లి నిలిపేసిన భార్య.. పాపం హనీమూన్ ట్రిప్..
పెళ్లి మండపంలో ఎటుచూసినా సందడి. మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. మూడుముళ్లకు సమయం సమీపిస్తోంది. వరుడు కూడా ఆతృతగా ఉన్నాడు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. వధువు తల్లిదండ్రులను కలిసి ఏదో చెప్పింది. అంతే పెళ్లి వేడుక బంద్ అయ్యింది. పోలీసులు వచ్చి వరున్ని తీసుకెళ్లారు. పూల కారుపై ఊరేగాల్సిన వరుడు జీపు ఎక్కాడు. సాక్షి, బెంగళూరు(యశవంతపుర): పెళ్లయిన సంగతిని దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధమైన మోసగాన్ని హాసన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బెంగళూరులో ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న మధుసూదన్‌కు నాలుగేళ్ల క్రితం వసుధ అనే యువతితో వివాహమైంది. గొడవలు రావడంతో ఇద్దరు బెంగళూరులో విడివిడిగా ఉంటున్నారు, కానీ విడాకులు ఇంకా తీసుకోలేదు. హాసన్‌లో రెండో పెళ్లి తతంగం ఆ కేసు పరిష్కారం కాకుండానే అక్క సాయంతో హాసన్‌కు చెందిన అమ్మాయితో గుట్టుగా పెళ్లికి సిద్ధమయ్యాడు. హాసన పట్టణంలోని కళ్యాణ మండపంలో పెళ్లికి ఇరువైపులవారు చేరుకున్నారు. వసుధకు చూచాయగా విషయం తెలిసి గూగుల్‌లో హాసన్ పట్టణంలోని కళ్యాణ మండపాల వివరాలను సేకరించింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మధుసూదన్ వధువుకు తాళికట్టే సమయానికి వసుధ అక్కడకు వచ్చి వధువు తల్లిదండ్రులను కలిసింది. అతని వల్ల నా జీవితం నాశనమైంది. మీ అమ్మాయి జీవితం కూడా పాడు కాకుండా చూసుకోండని గట్టిగా చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులు మోసగాడు మధుసూదన్‌ను గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అరెస్ట్ చేశారు. పాపం హనీమూన్ ట్రిప్ పెళ్లి అయిన మరుసటి రోజున మాల్దీవులకు హనీమూన్‌కు వెళ్లాలని మధుసూదన్ ప్లాన్ వేశాడు. శనివారం విమానం ఎక్కడానికి పాస్‌పోర్ట్, వీసా, టికెట్లను రెడీ చేశాడు. పెళ్లి తరువాత మొదటి భార్య బంధువులు ఏమి చేయలేయరనే ధీమాతో ఉన్నాడు గానీ పథకం మొత్తం నీరు గారడంతో పాటు కటకటాల వెనక్కు చేరాడు. కాగా పీటల మీద పెళ్లి నిలిచిపోవడంతో వధువు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అతని గురించి ముందే తెలిసి ఉంటే ఇంతవరకూ రానిచ్చేవారం కాదని వాపోయారు. -
బాప్రే.. రేవ్ పార్టీలో మహిళా పోలీసు
యశవంతపుర: చట్టాన్ని కాపాడాల్సినవారే అతిక్రమించారు. కర్ణాటకలో హాసన్ జిల్లాలో జరిగిన రేవ్ పార్టీలో కొందరు పోలీసులు కూడా మజా చేసినట్లు సమాచారం. ఇటీవల ఆలూరు తాలూకాలో ఒక రిసార్టులో పెద్దఎత్తున రేవ్ పార్టీ జరిగింది. ఇది తెలిసి పోలీసులు దాడి చేసి 130 మందిని అదుపులోకి తీసుకుని పదుల సంఖ్యలో కార్లను సీజ్ చేశారు. ఇందులో శ్రీలత అనే మహిళా పోలీసు కూడా ఉన్నారు. ఆమె మంగళూరు జిల్లాలో క్రైం విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రేవ్ పార్టీలో పాల్గొనడానికి సెలవు పెట్టి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలతను సస్పెండ్ చేసినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. మరికొందరు పోలీసులపై వేటు పడే అవకాశముంది. ‘తన కుమారుడితో కలిసి ఆమె రేవ్ పార్టీకి వెళ్లారు. పోలీసులు సోదాలు జరిపినప్పుడు ఆమె తన అధికారాలను దుర్వినియోగం చేశారు. నగర క్రైం విభాగంలో పనిచేస్తున్నానని కూడా స్వయంగా చెప్పార’ని మీడియాకు కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. కాగా, కరోనా భయంతో రాష్ట్రం అల్లాడుతుంటే కొంతమంది బాధ్యతారహితంగా జల్సాలు చేయడం పట్ల జనం మండిపడుతున్నారు. ఈనెల 10న ఆలూరు తాలూకా పరిధిలోని రిసార్ట్‌లో ఈ రేవ్ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారికిలో బెంగళూరు, మంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మద్యం, నిషేధిత మత్తు పదారార్థాలతో పాటు 50 టూవీలర్లు, 20 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వాహనాలపై అత్యవసర సర్వీసుల సిక్టర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా యువకులను రేవ్ పార్టీకి ఆహ్వానించారని, లోకేషన్‌ను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారని వెల్లడించారు. రిస్టార్ యజమాని గగన్‌ను అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించామని, ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఇక్కడ చదవండి: కరోనా ఉగ్రరూపం; లాక్డౌన్ ఉండదన్నా సొంతూళ్లకు.. విజృంభిస్తున్న కరోనా: కర్ణాటకలో నిమిషానికి 10 కొత్త కేసులు -
బడిని దత్తత తీసుకున్న నటి ప్రణీత
బెంగళూరు: నటి ప్రణీత తన పెద్ద మనసును చాటుకుంది. అందరూ ఊర్లను, పిల్లల్ని దత్తత తీసుకుంటే ప్రణీత ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. స్నేహితులు కోరడంతో... గతేడాది బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి సిద్ధమైంది. ఆ సమయంలో బడి వాతావరణాన్ని, పిల్లలు చదివే విధానాన్ని గమనించింది. అక్కడ ఏడో తరగతి చదివే విద్యార్థికి కూడా ఆంగ్లభాషలో కనీస పరిజ్ఞానం లేదని గుర్తించింది. అదే కాదు ఆ బడిలో ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. అది చూసి అలాంటి పాఠశాలల రూపురేఖల్ని మార్చాలని అనుకుంది. అందులో భాగంగా మొదట హసన్ జిల్లా, ఆలూరులోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది. ఈ విషయమై ప్రణీత మాట్లాడుతూ.. ‘మా నాన్న పుట్టిన ఊరు హసన్‌లోని ఆలూరు గ్రామం. తరువాత బెంగళూరుకు వచ్చేశారు. నేను పుట్టి, పెరిగింది బెంగళూరులోనే అయినా మా సొంతూరుని మర్చిపోలేనుగా. అందుకే ఆలూరును ఎంచుకున్నా. అక్కడి పాఠశాల అభివృద్ధికోసం రూ.5లక్షలను అందించా. విద్యార్థినులకు మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించడానికి, తరగతి గదుల రూపురేఖల్ని మార్చడానికి ఈ సొమ్మును వినియోగిస్తున్నాం. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలల్ని దత్తత తీసుకునే ఆలోచన కూడా ఉంది. కేవలం బడికి సౌకర్యాలు అందించడమే కాదు... వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నాం. ఇందుకు అవసరమైన ప్రణాళికల్ని మా స్నేహితులమంతా ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటున్నామ’ని చెప్పింది. -
ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్!
బెంగళూరు: అడవుల్లో చిక్కుకుపోయిన 14 మంది సాప్ట్వేర్ ఇంజనీర్లు ఈ-మెయిల్ ద్వారా సురక్షితంగా బయటపడగలిగారు. చెన్నైకి చెందిన ఈ ఇంజనీర్లు కర్ణాటక హాసన్ జిల్లాలోని అడవుల్లోకి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దట్టమై ఆ అడవుల్లో వారు దారి తప్పారు. తాము దారి తప్పిన విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా వారు తమ మిత్రులకు తెలియజేశారు. ఆ మిత్రులు ఈ విషయం అటవీ శాఖ సిబ్బందికి తెలిపారు. అటవీ సిబ్బంది వెంటనే స్పందించి అడవిలో వెతికి వారిని పట్టుకున్నారు. అటవీ సిబ్బంది కనిపించగానే ఆ ఇంజనీర్లకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినంత పనైంది. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం