పోకల వారి ఉమ్మడి కుటుంబం
ఆ ఇళ్లు నందనవనాలు.. ఆదర్శనీయమైన ఉమ్మడి కుటుంబాలు.. విభేదాలు మర్చిపోతాయి.. అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఉంటాయి.. మారుతున్న సామాజిక ధోరణులకు తలొగ్గకుండా.. పెద్దల మాటలు జవదాటకుండా ముందుకు సాగుతున్నాయి.. ఇందుకు ప్రధాన కారణం తోడికోడళ్లు.. అత్తామామల ఆలనాపాలన చూసుకుంటూ.. ఆడబిడ్డలకు మంచిగౌరవమిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని ఇలాంటి కొన్ని కుటుంబాలపై ప్రత్యేక కథనం..
కుర్చీలో కూర్చున్న అత్త పేరు రాధ. ఆమె వెనకాల నిల్చున్నవారు ముగ్గురు ఆమె కోడళ్లు జ్యోతి, రజని, స్వరూప. వీళ్లు పేరుకే అత్తాకోడళ్లు. ఇంట్లో అందరూ తల్లీకూతుళ్లలానే ఉంటారు. కుటుంబ పెద్ద అత్త. ఆమె సూచనలు, సలహాలు పాటిస్తూ ఉంటారు ముగ్గురు కోడళ్లు. తర్వాతి స్థానం పెద్దకోడలు జ్యోతిది. మిగతా ఇద్దరు తోడికోడళ్లను చెల్లెళ్లులుగా చూసుకుంటారు జ్యోతి. ఈమెను కూడా అక్కకన్నా ఎక్కువగా గౌరవిస్తారు తోడికోడళ్లు. ఈఇంట్లో నలుగురు తోడికోడళ్లు ఉన్నారు. సొంత అక్కాచెల్లెళ్లలా కలిసి ఉంటున్నారు. అత్తామామలు, ఆడబిడ్డలు, చుట్టాలు వస్తే.. వారికి చేసే మర్యాదల్లో ఏమాత్రం లోటు రానివ్వరు. ఎలాంటి అరమరికలు లేకుండా సాగుతున్న వీళ్లు ప్రస్తుత సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాక్షి, సిరిసిల్ల : అన్యోన్యత చాటుతున్న తోడికోడళ్లు. అత్తమ్మ సారథ్యంలో కుటుంబ నిర్వహణ, బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. వేరే ఇంటి అమ్మాయి అయినా.. మెట్టినింట్లో కాలుపెట్టాక తమ జీవితం అత్తవారిల్లే అంటూ అందరినీ కలుపుకుని భవిష్యత్‌కు మంచిబాటలు వేసుకుంటున్నారు. అత్తమామలు, ఆడబిడ్డలకు గౌరవం ఇస్తూ.. భర్త కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటున్నారు. వివాహమయ్యాక కొద్దిరోజుల్లోనే వేరు కాపురాలు పెడుతున్న ఈరోజుల్లో ఎలాంటి వైషమ్యాలకు తావులేకుండా పండంటి కాపురాలుగా తీర్చిదిద్దుతున్నారు తోడికోడళ్లు. ఇలాంటివారిలో కొన్ని కుటుంబాలపై కథనం..
ఈ చిత్రంలోనివాళ్లు తోడికోడళ్లు లక్ష్మి, మల్లేశ్వరి, రేణుక. లక్ష్మి భర్త మల్లేశం, మల్లేశ్వరి భర్త రమేశ్, రేణుక భర్త రాజు, భూదేవి – కృష్ణ దంపతులు కూడా వీరి కుటుంబంలోనివారే. పురుషులందరూ పూలవ్యాపారం చేస్తున్నారు. తోడికోడళ్లు ఇంట్లో పనులు పూర్తయ్యాక పూలదండలు అల్లుతూ ఉంటారు. వీళ్ల కుటుంబంలో తొమ్మిదిమంది పిల్లలు శ్వేత, బబిత, శివ, శరత్, సోమేశ్, చందు, రాజశ్రీ, అఖిలేశ్వర్, అఖిలేశ్వరి. ఆడబిడ్డ సబితకు వివాహమైంది. పుల్లూరులో కుటుంబంతో కలిసి ఉంటోంది. సబిత వస్తే ఆ ఇంట్లో పండుగే. నలుగురు తోడికోడళ్లను చూసి ‘మంచిఫ్యామిలీ’ కితాబిస్తారు. ఇది వారిలో ఎంతో సంతోషాన్నిస్తోంది
అత్తామామలంటే గౌరవం
మాది ఉమ్మడి కుటుంబం. మా అత్తామామలు అబ్దుల్ గఫూర్–ఫాత్మోలి. మా వారు గఫార్‌కి ఐదుగురు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు. తోడికోడళ్లు సత్తార్–నూర్‌ఉన్నీసా, జబ్బార్–అజ్‌గిరి, ఖదీర్–మున్నీ, రావూఫ్–హమేరా. మా వివాహం జరిగి 36 ఏండ్లు. ఆడబిడ్డలు ము గ్గురు. జాలనాలో బుగ్నా, పర్బనిలో షబానా, సిరిసిల్లలో సాజిం ఉంటారు. మా ఇంట్లో అత్తామామలే అన్నీ. పురుషులు చిరువ్యాపారాలు చేస్తరు. మేం బీడీలు చుడుతం. మా కు టుంబంలో ఘర్షణలకు తావులేదు. అత్తామామ ల సూచనలతోనే శుభకార్యాలు చేసుకుంటం.
– అబ్దుల్ రెహనబీ, పెద్దకోడలు
కలిసే ఉంటాం
మాది ఉమ్మడి కుటుంబం. అత్తమ్మ గూడూరి భారతి, బావ, అక్క శ్రీధర్–సుమ, మావారు డాక్టర్ రవీందర్, మరిది, చెల్లి అనిల్–లలిత, పిల్లలు తన్మయి, సిద్ధూ, రిత్విక, గౌతం. ఇంట్లో అత్తమ్మే యజమాని. నేను ఇక్కడే ప్రైవేటుగా డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్త. పేషెంట్లతో నిత్యం బిజీ. అయినా ఆదివారం, పండుగ రోజుల్లో అత్మమ్మ వద్దకే వెళ్తం. అక్కయ్య, చెల్లెలు, పిల్లలతో ఆనందం షేర్ చేసుకుంటం. అందరం కలిసే ఉంటం.. కలిసే భోజనం చేస్తం. వీకెండ్స్, తీర్థయాత్రలు కూడా చేస్తం.
– డాక్టర్ గీతావాణి, రెండో కోడలు
అత్తామామల ఆశీర్వాదం
మాది ఉమ్మడి కుటుంబం. అత్తామామల ఆశీర్వాద మే ముఖ్యం. మామయ్య ప్రోత్సాహంతో మావారు అనిల్, ఆయన తమ్ముళ్లు అజయ్, అరుణ్Š స్వర్ణకారులుగా స్థిరపడ్డరు. తోడికోడళ్లు లావణ్య, లాస్య కలిసి ఇంటి పనులు షేర్ చేసుకుంటం. అత్తమ్మ అరుణ ఏ ది చెబితే అది చేస్తం. ఏనాడూ ఆమె మాట జవదాటలే. మా ఆడబిడ్డ అనిత. ఆమెతో విడదీ యరాని బం ధం. వృత్తిపరంగా మా ఆయన, ఆయన తమ్ముళ్లు ఎప్పుడూ బిజీనే. మా మామయ్య ప్రభాకర్ చనిపోయాక ఏడాదికి ప్రణయ్ పుట్టిండు. మళ్లీ మామయ్య వచ్చిండని సంబురపడ్డం. ఇవి జీవితంలో మర్చి పోలేని క్షణాలు.
– కనపర్తి రాధిక, పెద్దకోడలు
Comments
Please login to add a commentAdd a comment