
సాక్షి, కామారెడ్డి: పట్టణ పరిధిలోని లింగాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మామ లైంగిక వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కలకలం రేపుతోంది. భర్త బతుకు దెరువు నిమిత్తం దుబాయ్ వెళ్లగా, కన్నకూతురితో సమానంగా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేశాడో ప్రబుద్ధుడు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ మామ మల్లేశం కోడలిని వేధించసాగాడు. ఆ వేధింపులు తట్టుకోలేక కోడలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారం తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆ మహిళ తన బంధువులతో కలిసి మామకు దేహశుద్ధి చేసింది. అనంతరం అతగాడిని పోలీసులకు అప్పగించారు. (కూరగాయల సంచిలో మహిళ శవం)
Comments
Please login to add a commentAdd a comment