అరగంటలో మూడు చైన్‌ స్నాచింగ్‌లు | Three chain snatching incidents in half an hour in Thane | Sakshi
Sakshi News home page

అరగంటలో మూడు చైన్‌ స్నాచింగ్‌లు

Published Mon, Aug 14 2017 4:02 PM | Last Updated on Tue, Sep 12 2017 12:04 AM

Three chain snatching incidents in half an hour in Thane

థానే: చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. కేవలం అరగంట వ్యవధిలోనే మూడు చోట్ల మహిళ మెడల్లో గొలుసులు లాక్కుపోయారు. థానే జిల్లా అంబర్‌నాథ్‌ టౌన్‌ షిప్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి ఏడు నుంచి ఏడున్నర గంటల మధ్య ఈ దోపిడీ ఘటనలు జరిగాయి. ఓ మహిళ(65) భర్తతో కలిసి రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రూ.1.10 లక్షల విలువైన గొలుసును లాక్కుపోయారు.
 
అదే ప్రాంతంలో ఓ గృహిణి(35) రోడ్డుపై వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఆగంతకులు ఆమె మెడలోని రూ.40 వేల విలువైన పుస్తెలతాడను తెంపుకుని పోయారు. అదేవిధంగా మరో మహిళ మెడలోని రూ. లక్ష విలువైన బంగారు గొలుసు ఎత్తుకుపోయారు. ఈ మూడు ఘటనల్లోనూ ఒక్కరే పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అంబర్‌నాథ్‌ డివిజన్‌ శివాజీనగర్‌ పోలీసులు ఈ మేరకు వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజీల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement