![Women killing Her Newborn Daughter - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/23/baby--mother.jpg.webp?itok=3EigOWNv)
థానే: మూడో సంతానం కూడా ఆడ్డపిల్లే పుట్టిందని ఓ తల్లి చేతిగోళ్లతో గొంతు కోసి శిశువును దారుణంగా చంపేసింది. మహారాష్ట్రలోని థానే సమీపంలో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వైశాలి ప్రధాన్ (27) అనే మహిళకి ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానం కూడా ఆడ శిశువు కావడంతో వారంరోజుల వయస్సు గల నవజాత శిశువును గొంతుకోసి హత్య చేసింది.
తనకేమి తేలియనట్టు పాపను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. శిశువు గొంతుపై రక్తపు మరకలు, గాయలు ఉండటంతో వైద్యులు ఆమెను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకొచ్చింది. తన భర్త తాగుడికి బానిసగా మారడం.. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో వైశాలి తన బిడ్డను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదివరకే ఇద్దరు బిడ్డలు ఉన్నారని, మూడో బిడ్డ వద్దని అబార్షన్ కోసం అప్పు చేస్తే ఆ డబ్బును తన భర్త తాగుడు కోసం వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వైశాలిని ఆదివారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్ల పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment