రూపాయి కోసం హత్య | 54-Year-Old Man Killed Over Re 1 In Thane | Sakshi
Sakshi News home page

రూపాయి కోసం హత్య

Published Sat, Feb 3 2018 7:07 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

54-Year-Old Man Killed Over Re 1 In Thane - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,  ముంబై: మనుషుల్లో పెరిగిపోతున్న అసహనానికి,  నశిస్తున్న మానవీయతకు  నిదర్శనం ముంబై లో జరిగిన హత్య.  కేవలం  ఒక రూపాయి ఒక సీనియర్‌ సిటిజన్‌ ప్రాణాలను బలితీసుకుంది.  ముంబైలోని థానేలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..థానే కళ్యాణ్ పట్టణానికి చెందిన మనోహర్ గమ్నే (54)  కోడిగుడ్లుకొనడానికని  సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అక్కడ  దుకాణదారుడికి చెల్లించాల్సిన డబ్బులో  ఒక రూపాయి తక్కువైంది. షాపు ఓనర్‌ గమ్నేని దుర్భాషలాడాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.    విషయాన్ని తెలుసుకున్న  బాధితుని కుమారుడు దీనిపై  దుకాణదారుడిని ప్రశ్నించాడు.  అంతే...వివాదం మరింత ముదిరింది. విచక్షణ  మరిచిన షాపు  యజమాని కొడుకు  గమ్నే పై  పిడిగుద్దులు కురిపించాడు.  దీంతో  ఆయన అక్కడిక్కడకే ప్రాణాలువిడిచాడు. ఈ ఘటనపై  నిందితుడు సుధాకర్‌ ప్రభు  (45)  అరెస్ట్‌ చేశామని, హత్య కేసు నమోదు చేసినట్టు థానే పోలీసు అధికారి   సుఖదా నర్కార్‌ చెప్పారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement