Rs .1
-
రూపాయి కోసం హత్య
సాక్షి, ముంబై: మనుషుల్లో పెరిగిపోతున్న అసహనానికి, నశిస్తున్న మానవీయతకు నిదర్శనం ముంబై లో జరిగిన హత్య. కేవలం ఒక రూపాయి ఒక సీనియర్ సిటిజన్ ప్రాణాలను బలితీసుకుంది. ముంబైలోని థానేలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..థానే కళ్యాణ్ పట్టణానికి చెందిన మనోహర్ గమ్నే (54) కోడిగుడ్లుకొనడానికని సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అక్కడ దుకాణదారుడికి చెల్లించాల్సిన డబ్బులో ఒక రూపాయి తక్కువైంది. షాపు ఓనర్ గమ్నేని దుర్భాషలాడాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న బాధితుని కుమారుడు దీనిపై దుకాణదారుడిని ప్రశ్నించాడు. అంతే...వివాదం మరింత ముదిరింది. విచక్షణ మరిచిన షాపు యజమాని కొడుకు గమ్నే పై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆయన అక్కడిక్కడకే ప్రాణాలువిడిచాడు. ఈ ఘటనపై నిందితుడు సుధాకర్ ప్రభు (45) అరెస్ట్ చేశామని, హత్య కేసు నమోదు చేసినట్టు థానే పోలీసు అధికారి సుఖదా నర్కార్ చెప్పారు. -
మూడు రోజుల్లో తెలంగాణకు 1,550 కోట్లు
-
మూడు రోజుల్లో 1,550 కోట్లు
రాష్ట్రానికి మొత్తంగా వచ్చిన నగదు 22 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: రిజర్వు బ్యాంకు గత మూడు రోజుల్లో మన రాష్ట్రానికి రూ.1,550 కోట్ల విలువైన నగదును సరఫరా చేసింది. అందులో ఎక్కువగా రూ.500, రూ.100 నోట్లే ఉండటంతో చిల్లర కష్టాలకు ఉపశమనం లభించనుంది. ఇకపై మూడు రోజులకోసారి రాష్ట్రాలకు నగదు కేటాయించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అంటే వారంలో రెండుసార్లు నగదు రాష్ట్రానికి పంపిణీ కానుందని, దాంతో కరెన్సీ కొరత తీరుతుందని అధికారులు చెబుతున్నారు.ఇప్పటిదాకా పెద్దనోట్లే! : ఈ నెల 20, 21 తేదీల్లో తెలంగాణకు రూ.1,550 కోట్ల నగదు పంపిణీ జరిగిందని.. గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు ఆ నగదును సరఫరా చేశారని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. దీంతో నోట్ల రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన కరెన్సీ రూ.22 వేల కోట్లకు చేరింది. అయితే అందులో రూ.3 వేల కోట్లే చిన్న నోట్లు.. మిగతా సొమ్ము రూ.2 వేల నోట్లు కావడం గమనార్హం. -
రూ.1,130 కోట్ల ‘సైబర్ స్కామ్’!
బ్రిటన్ కేంద్రంగా పాక్‌కు చెందిన ఫిజాన్ నేతృత్వంలో దందా కీలకపాత్ర పోషించిన పలువురు ‘తెలుగువారు’ శిక్షపడ్డాక తప్పించుకువచ్చిన కరీంనగర్ జిల్లా వాసి దర్యాప్తు దశలోనే పారిపోయిన ఖమ్మం జిల్లా వ్యక్తి ఇంటర్‌పోల్ సాయంతో భారత్‌కు లండన్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి లండన్ కేంద్రంగా భారీ ‘సైబర్ స్కామ్’కు పాల్పడ్డాడు. పదుల సంఖ్యలో ముఠా సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని వివిధ బ్యాంకులకు చెందిన కస్టమర్ల నుంచి రూ.1,130 కోట్లు(113 మిలియన్ పౌండ్లు) కాజేశాడు. ఈ ఘరానా మోసానికి పాల్పడ్డ అంతర్జాతీయ ముఠాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. కరీంనగర్ వాసి ముఠా నాయకుడికి కుడి భుజంగా వ్యవహరిస్తే.. ఖమ్మం, రాజమండ్రి యువకులు ‘మనీ మ్యూల్స్’ను ఏర్పాటు చేసే పని చేశారు. సొలిసిటరీ ఖాతాలే టార్గెట్... పాక్‌కు చెందిన ఫిజాన్ హమీద్ చౌదరి బ్రిటన్‌లో 20 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. వివిధ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు ఎరవేసి ఏజెంట్లుగా మార్చుకున్నాడు. వీరి ద్వారానే ఆయా బ్యాంకు కస్టమర్లుగా ఉన్న సొలిసిటర్ కంపెనీ(న్యాయవాదులు)ల లావాదేవీలు, కాంటాక్ట్ నంబర్లు తెలుసుకునే వాడు. లండన్‌లో స్థిరాస్తి కొనుగోళ్లన్నీ సొలిసిటరీ కంపెనీల ద్వారానే జరుగుతాయి. ఓ ఆస్తిని విక్రయిస్తున్న వ్యక్తి, ఖరీదు చేస్తున్న వ్యక్తి.. తరఫునా ఈ సొలిసిటర్లు ఉంటారు. వారు ఆస్తి పూర్వాపరాలు పరిశీలించి ఖరీదు ఖరారు చేస్తారు. ఆపై ఆస్తిని ఖరీదు చేస్తున్న వ్యక్తి ఆ మొత్తాన్ని తన సొలిసిటర్ కంపెనీ ఖాతాలో జమ చేస్తారు. ఈ నగదు కంపెనీ ద్వారానే ఆస్తిని విక్రయించే వ్యక్తి సొలిసిటరీ కంపెనీ ఖాతాలోకి వెళ్తుంది. బ్రిటన్‌లో బ్యాంకు రుణంపై వడ్డీ రేట్లు తక్కువ కావడంతో ప్రతి ఒక్కరూ రుణంపైనే ఆస్తులు కొంటారు. బ్యాంకు రుణాలు సైతం సొలిసిటరీ కంపెనీ ఖాతాల్లోకే వెళ్తాయి. ఈ నేపథ్యంలోనే ఫిజాన్ గ్యాంగ్ ఈ ఖాతాలను టార్గెట్ చేసుకుంది. బ్యాంకు డేటాతో... సొలిసిటరీ కంపెనీల ఖాతాల వివరాలు, కాంటాక్ట్ నంబర్లు సేకరించే ఫిజాన్.. గ్యాంగ్ మెంబర్ల ద్వారా ఆయా కంపెనీలకు ఫోన్లు చేయించేవాడు. ఇంటర్నెట్ ఆధారంగా స్ఫూఫింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కాల్స్ చేయడంతో రిసీవ్ చేసుకునే వ్యక్తికి సదరు బ్యాంకు నంబరే డిస్ప్లే అయ్యేది. సదరు కంపెనీ చేసిన రెండు లావాదేవీలను చెప్పి వారికి నమ్మకం కలిగించే వారు. ఆపై వారు చేయని లావాదేవీ ఒకటి చెప్పి, పేమెంట్ ప్రాసెసింగ్‌లో ఉందని సదరు లావాదేవీ మీరే చేశారా? అని అడిగే వారు. దీంతో కంపెనీ వారు ఆ లావాదేవీతో తమకు సంబంధం లేదని చెప్పగా.. దాన్ని రద్దు చేయడానికని ఓ కోడ్ నంబర్ చెప్పేవారు. బ్యాంక్ ఫ్రాడ్స వింగ్‌కు కాల్ చేసి ఈ నంబర్ చెప్పాలని, ఆపై వారు చెప్పిన విధంగా చేస్తే సదరు లావాదేవీ క్యాన్సిల్ అవుతుందని నమ్మబలికేవారు. పరారీలో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు ఈ పంథాలో ఫిజాన్ ముఠా కొన్ని నెలల్లోనే 750 కంపెనీల నుంచి రూ.1,130 కోట్ల వరకు స్వాహా చేసింది. లండన్ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ స్కామ్‌గా రికార్డుకెక్కిన ఈ కేసును స్కాట్‌ల్యాండ్ యార్డ్, యూకే మెట్రోపాలిటన్ పోలీసులు గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఛేదించారు. ఫిజాన్తో పాటు లండన్‌లోని అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారిని పట్టుకున్నారు. గత నెల్లో అక్కడి న్యాయస్థానం నిందితులను దోషులుగా నిర్థారించింది. అయితే దర్యాప్తు నుంచి దోషిగా తేలే వరకు వివిధ దశల్లో ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు పారిపోయి వచ్చారు. వీరి కోసం గాలిస్తున్న అక్కడి పోలీసులు ఇంటర్‌పోల్ సాయంతో ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. రద్దు చేస్తామంటూ అన్నీ తెలుసుకుని... సైబర్ నేరగాళ్లు వినియోగించే ప్రత్యేక పరిజ్ఞానం కారణంగా వాళ్లు ఫోన్ పెట్టేసినా.. కాల్ కనెక్టయ్యే ఉండేది. దీంతో సొలిసిటరీ కంపెనీ వాళ్లు బ్యాంక్ ఫ్రాడ్ వింగ్‌తో పాటు ఎవరికి కాల్ చేసినా.. అది నేరగాళ్లకే చేరేది. అలా కాల్‌ను రిసీవ్ చేసుకునే సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారుల మాదిరిగా మాట్లాడేవారు. లావాదేవీ క్యాన్సిల్ చేయడానికి అవసరమంటూ వినియోగదారుడి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో పాటు కస్టమర్ నుంచే కార్డ్ రీడర్ జనరేటెడ్ కోడ్ సైతం తీసుకుని నిమిషాల్లో వారి ఖాతాలు ఖాళీ చేసేవారు. ఈ నిధుల్ని ‘మనీ మ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్లించి తక్షణం డ్రా చేయించేవారు. కమీషన్ తీసుకుని తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించే వారిని మనీ మ్యూల్స్ అంటారు. మనీ మ్యూల్స్‌ను ఏర్పాటు చేసిన వారిలో కరీంనగర్, ఖమ్మంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారూ ఉన్నారు. వీరిని ఏర్పాటు చేసే బాధ్యతల్ని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తే ఎక్కువగా నెరిపేవాడు. -
రూ.1,527 కోట్ల విద్యుత్ ‘చార్జీ’!
7.5 శాతం కరెంట్ చార్జీల పెంపు.. జూలై ఒకటి నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సగటున 7.5 శాతం చొప్పున చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. మొత్తంగా రూ.1,527 కోట్ల మేర చార్జీల పెంపునకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) అనుమతిచ్చింది. కొత్త టారీఫ్ వివరాలను టీఎస్ఈఆర్సీ కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డి గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 100 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులకు చార్జీల పెంపు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన60 లక్షల వినియోగదారులకు ఊరట లభించింది. 100 యూనిట్లు దాటితే మాత్రం ప్రతి యూనిట్‌పై అదనంగా 70 పైసల నుంచి ఒక రూపాయి వరకు బిల్లు పెరగనుంది. దీంతో మధ్య తరగతి, సంపన్నులపై రూ.510 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం గృహ వినియోగ కేటగిరీలో ఉన్న 11 స్లాబులను ఈఆర్సీ 8 స్లాబులకు కుదించింది. స్లాబుల కుదింపుతో గృహ వినియోగదారులపై మరికొంత భారం పడనుంది. హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమల చార్జీలు రూ.6 నుంచి రూ.6.65కు, ఎల్టీ కేటగిరీలోని పరిశ్రమల చార్జీలు రూ.6.40 నుంచి రూ.6.70కు పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించిన టారీఫ్ పట్టికను ఈఆర్సీ స్వల్ప మార్పులతో ఆమోదించింది. రూ.1,958 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు ఈఆర్సీ అనుమతి కోరాయి. విద్యుత్ సరఫరా ఖర్చు సగటున యూనిట్‌కు రూ.6.44 అవుతోందని లెక్కగట్టాయి. అయితే ఈఆర్సీ యూనిట్‌కు రూ.5.9 చొప్పున అంచనా వేసింది. దీంతోపాటు వార్షిక విద్యుత్ అవసరాలను 52,063 మిలియన్ యూనిట్లకు తగ్గించడంతో చార్జీల పెంపు భారం రూ.1,527 కోట్లకు తగ్గింది. విద్యుత్ రాయితీలకు రూ.4,584 కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు గృహ వినియోగదారులకు రాయితీల కోసం ఈ ఏడాది రూ.4584.50 కోట్ల విద్యుత్ సబ్సిడీని డిస్కంలకు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి రూ.4,470.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 0-50 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు రాయితీల కోసం అదనంగా రూ.114 కోట్ల రాయితీని ఇచ్చేందుకు ఒప్పుకుంది. పరిశ్రమలకు ‘పెనాల్టీ’ పరిశ్రమలకు టైమ్ ఆఫ్ డే(టీఓడీ) పెనాల్టీ సమయాన్ని సైతం డిస్కంలు మార్చాయి. ప్రస్తుతం సాయంత్రం 6-10 గంటల వరకు విద్యుత్ వినియోగంపై టీఓడీ పెనాల్టీ విధిస్తుండగా.. ఇకపై ఉదయం 6-10 గంటల వరకు వినియోగంపై యూనిట్‌కు రూపాయి చొప్పున విధించనున్నారు. దీంతో పరిశ్రమలపై అదనంగా మరో 3 శాతం వరకు చార్జీలు పెరగనున్నాయి. ప్రధానంగా నిరంతరం విద్యుత్ వినియోగించుకునే స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్, ఫోర్జ్ తదితర పరిశ్రమలపై ప్రభావం ఉండనుంది. సగటున పరిశ్రమలపై మొత్తంగా 10-13 శాతం పెంపు ఉండనుంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో చాలా తక్కువ ధరకు విద్యుత్ లభిస్తుండడంతో అనేక పరిశ్రమలు డిస్కంల నుంచి కాకుండా ఓపెన్ యాక్సెస్ నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. టీఓడీ వేళల మార్పుతో మరిన్ని పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ బాట పట్టనున్నాయి. అయితే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పరిశ్రమలు విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూపాయి రాయితీని డిస్కంలు ఇవ్వనున్నాయి. ఇతర ముఖ్యాంశాలు.. * హెయిర్ సెలూన్లకు ఇచ్చిన హామీ మేరకు 200 యూ నిట్ల లోపు వినియోగానికి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త కేటగిరీ సృష్టించి రాయితీలను వర్తింపజేసింది. * ఆదాయ పన్ను చెల్లింపుదారులైన రైతులు సైతం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను వినియోగించుకోడానికి అనుమతిచింది. అలాగే పట్టణ ప్రాంతాల్లోని ఉద్యాన నర్సరీలను సైతం ఎల్టీ-5 కేటగిరీలో చేర్చింది. * పార్థన స్థలాలపై 2కేడబ్ల్యూ లోడ్ పరిమితిని ఎత్తివేసింది. అంతకు మించిన లోడ్ కోసం కొత్త స్లాబ్‌ను ఏర్పాటు చేసింది. -
మైనారిటీల సం‘క్షామం’!
నిధుల కేటాయింపులు ఘనం.. విడుదల నామమాత్రం సాక్షి, హైదరాబాద్: మైనారిటీల సంక్షేమం కొడిగట్టింది. బడ్జెట్లో మైనారిటీలకు రూ.1,104 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం .. గడిచిన ఐదు నెలల్లో కేవలం రూ.199 కోట్లను మాత్రమే విదిల్చింది. అందులో ఖర్చు చేసింది రూ.81 కోట్లు మాత్రమే. మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫీజులు, స్కాలర్‌షిప్పుల రియింబర్స్‌మెంట్, షాదీ ముబారక్, బ్యాంకు లింకేజీ రుణాల సబ్సిడీల కోసం లబ్ధిదారులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అరకొరగా విడుదల చేస్తున్న నిధులను సైతం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు వడ్డీల కోసం బ్యాం కుల్లో నిల్వ ఉంచుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతేడాది బడ్జెట్లో రూ.1,030 కోట్లను కేటాయిస్తే, అందులో రూ.453 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా రూ. 271 కోట్లే ఖర్చయ్యాయి. ఈ నేపథ్యంలో 2015-16లో సంక్షేమ రంగానికి కేటాయింపులకు అనుగుణంగా పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో సైతం ప్రకటన చేసింది. గతేడాది తరహాలోనే నిధుల కేటాయింపులు, వ్యయం ఉండటంతో మైనారిటీల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారమంతా వట్టిదేనని విమర్శలు వస్తున్నాయి. రంజాన్ పర్వదినా న్ని అధికారికంగా నిర్వహించి మైనారిటీలను ఆకర్షించేం దుకు ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి, మైనారిటీల పథకాల అమలులో కనిపించడం లేదని మైనారిటీ మేధావులు పేర్కొంటున్నారు. ప్రచార ఆర్భాటమే..: రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో పాలకులు చూపుతున్న చిత్తశుద్ధి నిధులవిడుదలపై మాత్రం కనబర్చుతున్న దాఖలాలు కానరావడం లేదు. గత నాలుగేళ్లలో నిధుల కేటాయింపులు, విడుదల, వినియోగం పాలకుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది. -
విమాన చార్జీల్లో భారీ డిస్కౌంట్లు...
న్యూఢిల్లీ: ఈ చలికాలంలో విమానయాన రంగంలో ధరల పోరు వేడెక్కుతోంది. తాజాగా బరిలోకి జెట్ ఎయిర్వేస్, ఇండిగోలు ప్రవేశించాయి. ఇప్పటికే కొత్త విమానయాన సంస్థ విస్తార, ఎయిర్ ఇండియాలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. చార్జీలు అధికంగా, లేదా మరీ తక్కువ స్థాయిలో ఉన్నాయని గరిష్ట, కనిష్ట చార్జీలపై పరిమితులు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం విశేషం. ఇండిగో ఆఫర్ రూ.1,647 నుంచి ప్రారంభం ఇండిగో సంస్థ 90 రోజుల ముందస్తు కొనుగోళ్ల స్కీమ్‌లో రూ.1,647 నుంచి చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఢిల్లీ-లక్నో సెక్టార్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ రూ.1,832(పన్నులు అదనం)కే ఢిల్లీ-ముంబై సెక్టార్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 18 వరకూ బుక్ చేసుకున్న టికెట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వివరించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకూ ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా ఎయిరిండియా ఇప్పటికే దేశీయ రూట్లలో 50% డిస్కౌంట్‌కే టికెట్లను అందిస్తోంది. రానున్న వేసవి సీజన్, రానున్న నెలల్లో వీకెండ్ల బుకింగ్‌ల కోసం ఎయిర్‌లైన్స్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయని నిపుణులంటున్నారు. -
18% తగ్గిన ఎన్ఎండీసీ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి నికరలాభం 17.51 శాతం క్షీణించి రూ.1,572 కోట్లుగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.1,906 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మంచి పనితీరు కనపర్చినప్పటికీ ముడి ఇనుము ధరలు తగ్గడం వల్ల ఆ మేరకు లాభాలు తగ్గినట్లు ఎన్ఎండీసీ చైర్మన్ సి.ఎస్.వర్మ తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ.2,838 కోట్ల నుంచి రూ.2,869 కోట్లకు చేరినట్లు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీ ఉక్కు పరిశ్రమకు తోడ్పాటును అందించడంపైనే అధికంగా దృష్టిసారిస్తున్నట్లు వర్మ తెలిపారు. సెవర్‌స్టల్ ఔట్!: ఛత్తీస్‌గఢ్‌లోని 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు ఫ్యాక్టరీని సొంతంగానే చేపడుతున్నామని, ఈ ప్రాజెక్టు నుంచి రష్యా కంపెనీ సెవర్‌స్టల్ వైదొలిగినట్లేనని వర్మ ప్రకటించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి 2010లో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ సెవర్‌స్టల్ అంతగా ఆసక్తి చూపించడం లేదని, దీంతో ప్రస్తుతానికి సొంతంగానే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో సెవర్స్టల్కి ఎన్ఎండీసీ మెజార్టీ వాటా ఇవ్వనందుకే వెనకడుగువేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఇండియాలో అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌ను ఆపేసినట్లు సెవర్‌స్టల్ ప్రతినిధులు పేర్కొన్నారు.