విమాన చార్జీల్లో భారీ డిస్కౌంట్లు... | Indigo offer to start from Rs .1,647 | Sakshi
Sakshi News home page

విమాన చార్జీల్లో భారీ డిస్కౌంట్లు...

Published Wed, Jan 14 2015 4:27 AM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

విమాన చార్జీల్లో భారీ డిస్కౌంట్లు... - Sakshi

విమాన చార్జీల్లో భారీ డిస్కౌంట్లు...

న్యూఢిల్లీ: ఈ చలికాలంలో విమానయాన రంగంలో ధరల పోరు వేడెక్కుతోంది. తాజాగా బరిలోకి జెట్ ఎయిర్‌వేస్, ఇండిగోలు ప్రవేశించాయి. ఇప్పటికే కొత్త విమానయాన  సంస్థ విస్తార, ఎయిర్ ఇండియాలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. చార్జీలు అధికంగా, లేదా మరీ తక్కువ స్థాయిలో ఉన్నాయని గరిష్ట, కనిష్ట చార్జీలపై పరిమితులు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం విశేషం.
 
 ఇండిగో ఆఫర్ రూ.1,647 నుంచి ప్రారంభం
 ఇండిగో సంస్థ 90 రోజుల ముందస్తు కొనుగోళ్ల స్కీమ్‌లో రూ.1,647 నుంచి చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఢిల్లీ-లక్నో సెక్టార్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ రూ.1,832(పన్నులు అదనం)కే ఢిల్లీ-ముంబై సెక్టార్‌లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 18 వరకూ బుక్ చేసుకున్న టికెట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వివరించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకూ ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా ఎయిరిండియా ఇప్పటికే దేశీయ రూట్లలో 50% డిస్కౌంట్‌కే టికెట్లను అందిస్తోంది. రానున్న వేసవి సీజన్, రానున్న నెలల్లో వీకెండ్‌ల బుకింగ్‌ల కోసం ఎయిర్‌లైన్స్ భారీ  డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయని నిపుణులంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement