Delhi-Lucknow sector
-
తేజస్ రైలులో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ–లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రూ.25 లక్షల ఉచిత ప్రయాణ బీమా అందించనున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ రైలులో ప్రయాణించే వారికి పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ రైలుకు సంబంధించిన పలు వివరాలను గురువారం విడుదల చేసింది. ► ప్రయాణీకుల లగేజీ తరలింపునకు ‘పిక్ అండ్ డ్రాప్’ సర్వీసును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రయాణీకుల లగేజీని వారి ఇంటి నుంచి రైలు సీటు వరకు, రైలు దగ్గర నుంచి వారి ఇంటి వరకు తరలించే వెసులుబాటు కల్పించనుంది. ► తేజస్‌లో రాయితీలు, తత్కాల్ కోటా వర్తించవు. ఐదేళ్ల వయసు దాటిన చిన్నారులకు పూర్తి చార్జీలు వర్తిస్తాయి. ► ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏసీ చైర్ కార్లలో విదేశీ పర్యాటకుల కోసం ఐదు సీట్లను కేటాయించనుంది. ► ప్రయాణానికి 60 రోజుల ముందే బుకింగ్స్ ఉంటాయి. ► విమానాల్లో మాదిరిగా భోజనాన్ని ట్రాలీలలో అందిస్తారు. టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఆర్వో మెషీన్ల ద్వారా నీటిని అందిస్తారు. ► ప్రయాణికుల రద్దీ, పండుగల సీజన్, డిమాండ్ వంటి వాటి ఆధారంగా టికెట్ ధరలు మారుతూ ఉంటాయని తెలిపింది. డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తామని పేర్కొంది. ► ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ సర్వీస్ ఆధారంగా టికెట్ బుకింగ్ ఉంది. -
విమాన చార్జీల్లో భారీ డిస్కౌంట్లు...
న్యూఢిల్లీ: ఈ చలికాలంలో విమానయాన రంగంలో ధరల పోరు వేడెక్కుతోంది. తాజాగా బరిలోకి జెట్ ఎయిర్వేస్, ఇండిగోలు ప్రవేశించాయి. ఇప్పటికే కొత్త విమానయాన సంస్థ విస్తార, ఎయిర్ ఇండియాలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. చార్జీలు అధికంగా, లేదా మరీ తక్కువ స్థాయిలో ఉన్నాయని గరిష్ట, కనిష్ట చార్జీలపై పరిమితులు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం విశేషం. ఇండిగో ఆఫర్ రూ.1,647 నుంచి ప్రారంభం ఇండిగో సంస్థ 90 రోజుల ముందస్తు కొనుగోళ్ల స్కీమ్‌లో రూ.1,647 నుంచి చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఢిల్లీ-లక్నో సెక్టార్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ రూ.1,832(పన్నులు అదనం)కే ఢిల్లీ-ముంబై సెక్టార్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 18 వరకూ బుక్ చేసుకున్న టికెట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వివరించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకూ ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా ఎయిరిండియా ఇప్పటికే దేశీయ రూట్లలో 50% డిస్కౌంట్‌కే టికెట్లను అందిస్తోంది. రానున్న వేసవి సీజన్, రానున్న నెలల్లో వీకెండ్ల బుకింగ్‌ల కోసం ఎయిర్‌లైన్స్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయని నిపుణులంటున్నారు.