తేజస్‌ రైలులో ప్రయాణించే వారికి బంపర్‌ ఆఫర్లు | Free travel insurance of Rs 25 lakh each for passengers on board Express | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షల ఉచిత బీమా

Published Fri, Sep 13 2019 3:36 AM | Last Updated on Fri, Sep 13 2019 8:07 AM

Free travel insurance of Rs 25 lakh each for passengers on board Express - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ–లక్నో మధ్య నడిచే తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రూ.25 లక్షల ఉచిత ప్రయాణ బీమా అందించనున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఈ రైలులో ప్రయాణించే వారికి పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ రైలుకు సంబంధించిన పలు వివరాలను గురువారం విడుదల చేసింది.  

ప్రయాణీకుల లగేజీ తరలింపునకు ‘పిక్‌ అండ్‌ డ్రాప్‌’ సర్వీసును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రయాణీకుల లగేజీని వారి ఇంటి నుంచి రైలు సీటు వరకు, రైలు దగ్గర నుంచి వారి ఇంటి వరకు తరలించే వెసులుబాటు కల్పించనుంది.  

తేజస్‌లో రాయితీలు, తత్కాల్‌ కోటా వర్తించవు. ఐదేళ్ల వయసు దాటిన చిన్నారులకు పూర్తి చార్జీలు వర్తిస్తాయి.  

ఎగ్జిక్యూటివ్‌ క్లాస్, ఏసీ చైర్‌ కార్‌లలో విదేశీ పర్యాటకుల కోసం ఐదు సీట్లను కేటాయించనుంది.  

►  ప్రయాణానికి 60 రోజుల ముందే బుకింగ్స్‌ ఉంటాయి.  

విమానాల్లో మాదిరిగా భోజనాన్ని ట్రాలీలలో అందిస్తారు. టీ, కాఫీ వెండింగ్‌ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకుల డిమాండ్‌ మేరకు ఆర్‌వో మెషీన్ల ద్వారా నీటిని అందిస్తారు.  
 

ప్రయాణికుల రద్దీ, పండుగల సీజన్, డిమాండ్‌ వంటి వాటి ఆధారంగా టికెట్‌ ధరలు మారుతూ ఉంటాయని తెలిపింది. డిమాండ్‌ ఆధారంగా ధరలు నిర్ణయిస్తామని పేర్కొంది.  

‘ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌’ సర్వీస్‌ ఆధారంగా టికెట్‌ బుకింగ్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement