Travel Insurance
-
విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?
విహార యాత్రల కోసం విదేశాలకు వెళుతున్నారా..? ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా..? మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. అందుకు సంబంధించిన ప్రీమియం చెల్లించి విదేశీ ప్రయాణాన్ని మరింత ధీమాగా పూర్తి చేయవచ్చు. అయితే ఈ ప్రయాణ బీమాకు సంబంధించిన కొన్ని అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.విహారయాత్రలు, ఇతర పనుల నిమిత్తం కొంతకాలంపాటు విదేశాలకు వెళ్లేవారు ప్రయాణానికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఊహించని ఖర్చులు ఎదురైతే మొత్తం ప్రయాణంపై ప్రభావం పడుతుంది. అందుకోసం వారు సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రయాణ బీమా భరోసానిస్తుంది. ఇందుకు సంబంధించి కంపెనీలు ఎలాంటి పాలసీలను అందిస్తున్నాయో తెలుసుకుందాం.ఆరోగ్య అవసరాల కోసం..నిత్యం మనదేశం నుంచి వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తుంటారు. వారికి ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.ఒకటికి మించి దేశాలకు ఒకే పాలసీ..ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ వర్తించేలా ఒకే పాలసీని తీసుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.700-రూ.800 వరకూ ఉంటుంది.సామగ్రి అందకపోయినా..ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది.ఈ ప్రయాణ బీమా పాలసీలను ఆన్లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. బీమా సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి, కావాల్సిన విధంగా పాలసీని ఎంచుకోవచ్చు. ప్రయాణ వ్యవధి, ఎంత మొత్తానికి బీమా కావాలి, ప్రయాణం రద్దు, ఆరోగ్య అవసరాల్లాంటివన్నీ పాలసీలో ఉండేలా చూసుకోవాలి. బీమా కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఉంటాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలించాలి.ఇదీ చదవండి: మొబైల్లో ఆర్డర్‌చేసి కిచెన్‌లోకి వెళితే వంట రెడీ!పాలసీ తీసుకునేపుడు గుర్తుంచుకోవాల్సినవి..పాలసీ తీసుకునేటప్పుడు మీ పర్యటన జరిగే అన్ని రోజులకు వర్తించేలా చూసుకోవాలి. పాలసీలోని మినహాయింపులు, పరిమితులు ముందే తెలుసుకోవాలి. ముందస్తు వ్యాధుల చికిత్సకు వర్తిస్తుందా లేదా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక అవసరాలు ఉండొచ్చు. వాటికీ పాలసీ వర్తించేలా చూసుకోవాలి. ఏ క్షణమైనా మీకు సేవలను అందించేలా సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయా.? మీరు వెళ్లే ప్రాంతాల్లో ఎన్ని ఆసుపత్రులతో ఒప్పందాలున్నాయి అనే విషయాన్ని పరిశీలించాలి. -
రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే..
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరినీ కలిచివేసింది. శుక్రవారం (జూన్ 2) జరిగిన ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణ బీమా ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 ప్రకటించారు. అయితే ఐఆర్సీటీసీలో టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు కనిపించే ప్రయాణ బీమా ఆప్షన్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 35 పైసలతో రూ.10 లక్షలు రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అయితే కొంత మంది ఈ ఆప్షన్ పట్టించుకోరు. కేవలం ప్రమాదాలు జరిగిప్పుడే కాకుండా ఈ బీమా ద్వారా ఇంకా ఇతర ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే తీసుకుంటుంది. రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభిస్తుంది. అలాగే ప్రమాదం జరిగినప్పుడు చికిత్సకు అయ్యే ఖర్చులు, ఒకవేళ మరణం సంభవించినప్పుడు వారి కుటుంబానికి పరిహారం అందిస్తారు. ఏదైనా రైలు ప్రమాదం జరిగినప్పుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లిస్తారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ.10,000 వరకు అందజేస్తారు. క్లెయిమ్ చేయడమెలా? ఐఆర్సీటీసీ లేదా ఇతర అధీకృత యాప్‌ల ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్‌చేస్తున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకోవాలన్న సూచన మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని ఎంచుకోవాలా వద్దా అన్నది పూర్తిగా ప్రయాణికుల ఇష్టం. దీన్ని ఎంచుకున్న ప్రయాణికులు లేదా వారి కుటుంబ సభ్యులు వారు ప్రయాణించిన రైలు ప్రమాదానికి గురైన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి బీమా కోసం క్లెయిమ్‌ను దాఖలు చేయవచ్చు. అయితే బీమాను ఎంచుకునే సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు. ఇదీ చదవండి ➤ Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్!
బెంగళూరు: కోవిడ్–19 విజృంభించిన సమయంలో ప్రయాణాలు దాదాపు నిల్చిపోయాయి. ప్రస్తుతం ట్రావెల్ విభాగం క్రమంగా పుంజుకుంటోంది. దీంతో ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్ పూర్వం 2019–20లో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ పాలసీల విక్రయం పుంజుకున్నట్లు డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ వెల్లడించింది. తమ అంతర్గత డేటా ప్రకారం ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తాము గతేడాది మొత్తం మీద అమ్మిన ట్రావెల్ పాలసీల్లో సుమారు 75 శాతం పాలసీలను ఈ ఏడాది నాలుగు నెలల్లోనే విక్రయించగలిగినట్లు పేర్కొంది. 2021–22లో 12.8 లక్షల ట్రావెల్ పాలసీలను విక్రయించినట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ చతుర్వేది తెలిపారు. సాధారణంగా ట్రిప్ రద్దు కావడం, ఫ్లయిట్లు రద్దు కావడం లేదా జాప్యం జరగడం వంటి అంశాలే ట్రావెల్ క్లెయిమ్‌లకు కారణాలుగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19కు పూర్వం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను దేశీయ ప్రయాణికులు ఎక్కువగా పట్టించుకునే వారు కాదని, కాని ప్రస్తుతం అనూహ్య పరిస్థితులతో ప్రయాణాలకు అంతరాయం కలిగినా నష్టపోకుండా ఉండేందుకు చాలా మంది ఇప్పుడు ప్రయాణ బీమా పాలసీలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. -
ట్రావెల్ ఇన్సూరెన్స్.. టేకాఫ్!
న్యూఢిల్లీ: ప్రయాణ బీమా (ట్రావెల్ ఇన్సూరెన్స్)కు పూర్వపు వైభవం సంతరించుకుంది. దేశీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోవడానికి తోడు, అంతర్జాతీయ విమాన సర్వీసులను తెరవడం ఇందుకు అనుకూలించే అంశం. కరోనా వైరస్ సమసిపోవడంతో మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఎక్కువ మంది అంతర్జాతీయ ప్రయాణికులు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే కరోనా ముందు నాటితో పోలిస్తే ఇప్పుడు మరింత మంది ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు మొగ్గుచూపిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని వారి వైఖరిలో మార్పువచ్చినట్టు భావించొచ్చు. కరోనా వల్ల రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం గమనార్హం. దీంతో విదేశీ పర్యటనలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం ట్రావెల్ ఇన్సూరెన్స్ విభాగాన్ని గట్టిగానే తాకింది. 25% అధికం: ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ పాలసీబజార్ మార్చి 27తో మొదలైన వారంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోళ్లు 25% పెరిగినట్టు (అంతకుముందు వారంతో పోలిస్తే) తెలిపింది. విక్రయాలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ఈ సంస్థ అంటోంది. విమాన టికెట్ ధరల స్థిరీకరణకు తోడు, సెలవులు పరిశ్రమకు కలిసొస్తాయని పేర్కొంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ 35 శాతానికి చేరుకుంటాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అంచనా వేస్తోంది. కరోనా మహమ్మారి రావడానికి ముందు ఇది 18%గా ఉండేది. విహార యాత్రలు, వ్యాపార యాత్రలకు వెళ్లే వారి నుంచి ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అంటోంది. చాలా కాలంగా విమాన సర్వీసులు నిలిచిపోయినందున విహార యాత్రలకు డిమాండ్ ఏర్పడినట్టు తెలిపింది. విదేశీ పర్యటనలకు సంబంధించి ట్రావెల్ ఇన్సూరెన్స్ బుకింగ్‌లు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో 40 శాతం పెరిగినట్టు పాలసీబజార్ వెల్లడించింది. డిమాండ్ మరింత పెరుగుతుంది.. ‘‘ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ 1.5 రెట్లు వృద్ధిని చూస్తుంది’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సేల్స్ హెడ్ సౌరభ్ చటర్జీ చెప్పారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. విమాన సర్వీసు రద్దయినా, ఆలస్యం అయినా, ఆరోగ్య సమస్యలు ఏర్పడినా కవరేజీ లభిస్తుందని పాలసీబజార్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అమిత్ చాబ్రా తెలిపారు. ‘‘విదేశాలు ఇప్పుడే పర్యాటకులను అనుమతిస్తున్నాయి. ప్రయాణానికి ముందే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. అప్పుడు రిస్క్‌ను ఎదుర్కోవడం సులభంగా ఉంటుంది’’ అని అన్నారు. -
బీమా చిన్నదే..కానీ ఎంతో ఆదా
నేటి పరిస్థితుల్లో ఎన్నో రూపాల్లో మనకు రక్షణ కల్పించే సాధనం బీమా. అందుకే ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో బీమా తప్పనిసరిగా ఉండాలి. ఎన్నో కారణాలతో మనపై పడే ఆర్థిక భారాన్ని కేవలం కొంచెం ప్రీమియం భరించడం ద్వారా తొలగించుకోవచ్చు. జీవిత బీమా ఒక్కటే కాకుండా, ఆరోగ్య బీమా, ఇంటికి, ఇంట్లోని వస్తువులకు, వాహనాలకు, చివరికి మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ వరకు ఎన్నో రూపాల్లో బీమా రక్షణ లభిస్తోంది. చాలా మంది ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమా, గృహ బీమా తప్పించి ఇతరత్రా దేనికీ బీమా ఉండదు. కాకపోతే ఇతర బీమా రక్షణ కూడా తీసుకోవాలా..? లేదా అనేదానిని వ్యక్తుల వ్యక్తిగత ఆర్థిక సామర్థ్యమే నిర్ణయిస్తుంది. కానీ, నిజం ఏమిటంటే కేవలం రూపాయి ప్రీమియానికే వచ్చే బీమా పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నా యి. వీటిని సాచెట్ లేదా బైట్సైజు బీమా కవరేజీలుగా పిలుస్తారు. వీటి ప్రయోజనాలను వివరంగా తెలియజేసే ప్రాఫిట్ కథనం. దేశంలో బైట్ సైజు (చిన్న ఉత్పత్తులు)/మైక్రో ఇన్సూరెన్స్ (సూక్ష్మ బీమా) బీమా పాలసీలు అన్నవి ఇప్పటికీ ఆరంభ దశలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. కాకపోతే వీటిల్లో ఉండే సౌకర్యం, సరళతరం కారణంగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంతరించుకుంటున్నాయి. ఈ పాలసీల కాల వ్యవధి ఒక్క రోజుతో మొదలుకొని, ఏడాది వరకు కొనసాగుతాయి. ఈ మైక్రో ఇన్సూరెన్స్ ఉత్పత్తులను కంపెనీలు ప్రధానంగా మొదటి సారి బీమా పాలసీలు తీసుకునే వారిని లక్ష్యం చేసుకుని తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించినవారు) కోసం. అప్పటి వరకు పాలసీలు తీసుకోని వారు ముందు ఈ పాలసీలను తీసుకోవడంతో తమ ప్రయాణాన్ని ఆరంభించొచ్చు. ఆ తర్వాత అయినా సమగ్ర బీమా పథకాలను తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయి రక్షణ ఉండేలా చూసుకోవాలి. ఆయా అంశాలపై సంబంధిత నిపుణుల సలహాలు తీçసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. పర్యటన రద్దయితే పరిహారం.. డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేస్తున్న పర్యాటక బీమా పాలసీలో.. పర్యటన ఆలస్యం, విమాన సర్వీసు రద్దు అయితే పరిహారం చెల్లించే ఆప్షన్లు ఉన్నాయి. దేశీయ విమాన సర్వీసులు అయితే 75 నిమిషాల కంటే ఆలస్యం అయినప్పుడు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఇతర బీమా సంస్థలు అయితే కనీసం ఆరు గంటల పాటు విమానం ఆలస్యమైనప్పుడే పరిహారం చెల్లిస్తున్నాయి. ఇక విమాన ప్రయాణాన్ని నిర్ణీత సమయానికి 24 గంటలు ముందుగా రద్దు చేసుకున్నట్టయితే, డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.20,000కు గరిష్టంగా చెల్లిస్తుంది. టికెట్లో నాన్ రిఫండబుల్ రూపంలో కోల్పోయే మొత్తంపై ఈ పరిమితికి లోబడి పరిహారం చెల్లిస్తుంది. ఉదాహరణకు చెన్నై–జైపూర్ మధ్య మూడు రోజుల ట్రిప్‌నకు డిజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ.329 వసూలు చేస్తోంది. ఇదే పాలసీలో బ్యాగేజీని నష్టపోయినా, వ్యక్తిగత ప్రమాదం, అత్యవసరంగా వైద్య చికిత్సలకు సైతం రక్షణ కల్పిస్తోంది. ఫ్లయిట్ ఆలస్యం అయితే దానిని డిజిట్ సంస్థ తనంతట తానే గుర్తించి క్లెయిమ్ చేసుకోవాలంటూ పాలసీదారులకు మెస్సేజ్ పంపిస్తుంది. క్లెయిమ్ పరిష్కారం కూడా ఆన్లైన్లోనే సులభంగా చేసుకోవచ్చు. మొబైల్ కవరేజీ.. ఖరీదైన మొబైల్స్‌కు ప్రొటెక్షన్ ప్లాన్ ఎంతో మేలు. అకో జనరల్ ఇన్సూరెన్స్ రూ.7,500–10,000 మధ్య ధర ఉండే నూతన మొబైల్ ఫోన్లకు ప్రొటెక్షన్ ప్లాన్‌ను అమెజాన్ వేదికగా ఆఫర్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, ధర ఆధారంగా ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు శామ్సంగ్ గెలాక్సీ ఎం30 ధర రూ.9,999. ఇందుకోసం అకో జనరల్ రూ.299ను ఏడాది ప్రీమియంగా వసూలు చేస్తోంది. చేజారి కింద పడిపోయినా, నీళ్లలో పడి దెబ్బతిన్నా పరిహారానికి క్లెయిమ్ చేయవచ్చు. కాకపోతే దొంగ తనం వల్ల కోల్పోతే పరిహారం రాదు. నేరుగా కస్టమర్ ఇంటికే వచ్చి ఫోన్‌ను తీసుకెళ్లి రిపేర్ చేయించి తిరిగి అందించడం చేస్తుంది. ఒకవేళ ఫోన్ అసలుకే పనిచేయకుండా పోయి పూర్తి పరిహారం కోసం క్లెయిమ్ చేసుకుంటే, అప్పుడు ఫోన్ విలువలో తరుగుదలను మినహాయించి మిగిలిన మేర చెల్లిస్తుంది. డిజిట్ ఇన్సూరెన్స్ కూడా మొబైల్ ఫోన్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. కాకపోతే ప్రమాదవశాత్తూ ఫోన్ స్క్రీన్ దెబ్బతిన్న సందర్భాల్లోనే ఈ పాలసీ పరిహారం చెల్లిస్తుంది. కొత్త ఫోన్లకు, అప్పటికే కొంత కాలం వినియోగించిన ఫోన్లకు సైతం ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంది. పాలసీ తీసుకున్న వారు తమ ఫోన్ స్క్రీన్ దెబ్బతింటే, స్థానికంగా ఉన్న ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో రిపేర్ చేయించుకుని, అందుకు సంబంధించి వీడియో, బిల్లును అప్లోడ్ చేయడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఫిట్నెస్ బీమా సింబో ఇన్సూరెన్స్ సంస్థ ఫుట్‌బాల్, పరుగు పందేల్లో పాల్గొనే వారికి ఫిట్నెస్ కవర్‌ను ఆఫర్ చేస్తోంది. ఒక సెషన్ నుంచి ఏడాది వరకు పాలసీని తీసుకోవచ్చు. ఆట సమయంలో గాయపడి చికిత్స అవసరం అయినా, ప్రాక్టీసు చేస్తూ గాయపడినా, ఫిజియో థెరపీ కావాల్సి వచ్చినా, ఇతరత్రా పరిహారాన్ని పాలసీ కింద అందిస్తోంది. రూ.5,000 వరకు ఎముక గాయాలకు, రూ.25,000 వరకు లిగమెంట్ టియర్, రూ.10,000 వరకు పంటి గాయాలకు కవరేజీని కేవలం రూ.9 ప్రీమియానికే ఒక మ్యాచ్‌కు ఆఫర్ చేస్తోంది. సింబో మొబైల్ యాప్ ద్వారా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టర్ సర్టిఫికెట్, వ్యాధి నిర్ధారణ పరీక్షల కాపీలను యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే, వేగంగా పరిహారం లభిస్తుంది. కీటకాలతో వచ్చే వ్యాధులకు.. వెక్టార్ బోర్న్ డిసీజ్ కవర్ అన్నది, ముఖ్యంగా దోమలు, పురుగులు కుట్టడం వల్ల అనారోగ్యం పాలైనప్పుడు.. చికిత్సలు, ఇతర వ్యయాలకు రక్షణ కల్పించేది. డెంగ్యూ, మలేరియా, కాలా అజార్, చికున్‌గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్, జికా వైరస్, ఫైలేరియాలకు ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. ఏడాదికి ప్రీమియం రూ.49 నుంచి ఆరంభమవుతుంది. తమ ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పాలసీని తీసుకునేందుకు వీలుంది. అయితే, ఇతర ఆరోగ్య బీమా ఉత్పత్తుల్లో ఉండే విధంగానే.. వీటిల్లోనూ వేచి ఉండే కాలం, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచి కనీసం 15 రోజుల తర్వాతే క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా కీటకాల కారణంగా అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స అవసరమైన వారికే పరిహారం లభిస్తుంది. నగదు రహితం లేదా రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ జనరల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో తదితర కంపెనీల పోర్టళ్ల నుంచి నేరుగా ఈ పాలసీని పొందవచ్చు. మొబిక్విక్ లేదా టాఫీ ఇన్సూరెన్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా కూడా ఈ తరహా పాలసీ తీసుకోవచ్చు. మొబిక్విక్ సంస్థ మ్యాక్స్బూపాకు చెందిన మస్కిటో ఇన్సూరెన్స్ కవర్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.10,000 సమ్ ఇన్సూర్డ్‌కు రూ.49ను ఏడాదికి చార్జ్ చేస్తోంది. అదే బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి మీరు ఇంతే మొత్తానికి ఏడాది కోసం రూ.160 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సమ్ ఇన్సూర్డ్ ఇంకా అధికంగా ఉండాలని కోరుకుంటే ఆ మేరకు అదనపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. డెంగ్యూ వ్యాధుల నుంచి ఆర్థిక రక్షణ దిశలో ఈ తరహా పాలసీలు ఎంతో మంచివనడంలో సందేహం లేదు. ఇంటికి సైతం కొన్ని రోజులకే కవరేజీ..? సంప్రదాయ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ 30 రోజులు, ఏడాది, 20 ఏళ్ల కాలానికి లభిస్తోంది. ఇంత కంటే ఇంకా తక్కువ వ్యవధికే పాలసీ తీసుకునే వీలు కూడా ఉండడం సానుకూలం. ఉదాహరణకు ఐదు రోజుల పాటు ఊరెళుతూ, అన్ని రోజులకే మీ ఇంటికి బీమా రక్షణ తీసుకోవాలనుకుంటే అది సాధ్యమే. కనీసం రూ.2లక్షల బీమా కవరేజీకి కనీస ప్రీమియం రూ.200గా ఉంది. ఎన్ని రోజుల పాటు పర్యటనకు వెళుతున్నారు, నివసించే ఇల్లు రకం (భవనమా లేక అపార్ట్మెంట్లో ఫ్లాటా), ఏ అంతస్తులో ఉంటున్నారనే అంశాల ఆధారంగా తీసుకునే బీమా మొత్తం, ప్రీమియం మారిపోవచ్చు. ఇంట్లోని వస్తువులకు ఒక్క రోజుకు కూడా బీమా కవరేజీ తీసుకోవచ్చు. దొంగతనాలు, దోపిడీలు, ప్రకృతి విపత్తుల కారణంగా కలిగే నష్టానికి ఈ పాలసీ రక్షణనిస్తుంది. బీమా మొత్తంలో గరిష్టంగా 20 శాతం వరకు ఇంట్లో ఉంచిన ఆభరణాలకూ కవరేజీ పొందొచ్చు. అలాగే, రూ.50,000 వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీకి కూడా అవకాశం ఉంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు, పరిమితులు ఉంటాయి. -
తేజస్ రైలులో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ–లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రూ.25 లక్షల ఉచిత ప్రయాణ బీమా అందించనున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ రైలులో ప్రయాణించే వారికి పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ రైలుకు సంబంధించిన పలు వివరాలను గురువారం విడుదల చేసింది. ► ప్రయాణీకుల లగేజీ తరలింపునకు ‘పిక్ అండ్ డ్రాప్’ సర్వీసును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రయాణీకుల లగేజీని వారి ఇంటి నుంచి రైలు సీటు వరకు, రైలు దగ్గర నుంచి వారి ఇంటి వరకు తరలించే వెసులుబాటు కల్పించనుంది. ► తేజస్‌లో రాయితీలు, తత్కాల్ కోటా వర్తించవు. ఐదేళ్ల వయసు దాటిన చిన్నారులకు పూర్తి చార్జీలు వర్తిస్తాయి. ► ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏసీ చైర్ కార్లలో విదేశీ పర్యాటకుల కోసం ఐదు సీట్లను కేటాయించనుంది. ► ప్రయాణానికి 60 రోజుల ముందే బుకింగ్స్ ఉంటాయి. ► విమానాల్లో మాదిరిగా భోజనాన్ని ట్రాలీలలో అందిస్తారు. టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఆర్వో మెషీన్ల ద్వారా నీటిని అందిస్తారు. ► ప్రయాణికుల రద్దీ, పండుగల సీజన్, డిమాండ్ వంటి వాటి ఆధారంగా టికెట్ ధరలు మారుతూ ఉంటాయని తెలిపింది. డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తామని పేర్కొంది. ► ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ సర్వీస్ ఆధారంగా టికెట్ బుకింగ్ ఉంది. -
ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలు
పర్యాటకులు సెలవుల్లో ఏఏ ప్రాంతాలు చుట్టి రావాలన్న ప్రణాళికకే ఎంతో సమయం, కష్టాన్ని వెచ్చిస్తుంటారు. అయితే, ఎక్కువ మంది ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను మాత్రం పట్టించుకోరు. ప్రయాణ సమయాల్లో ప్రమాదాలు, అనారోగ్యం పాలయ్యే రిస్క్ ఉంటుంది. ఊహించని, దురదృష్టకర ఘటనలు జరగకుండా తప్పించుకునే మార్గం లేదు. పర్యాటక బీమా అన్నది ఈ తరహా ప్రమాదాలు జరగకుండా నిరోధించలేదు. కానీ, ఈ తరహా సందర్భాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ పర్యాటకులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రమాదాలు లేదా ప్రయాణ సమయాల్లో అనారోగ్యం పాలైతే, ఎదురయ్యే వైద్య ఖర్చులను ఈ బీమా భరిస్తుంది. కొన్ని దేశాల్లో వైద్య చికిత్సల వ్యయాలు భారీగా ఉంటాయని తెలుసుకోవాలి. దీంతో తీవ్రమైన గాయాల పాలయితే పర్యాటకులు వేలాది డాలర్లను వైద్య బిల్లుల రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే పర్యాటక ఇన్సూరెన్స్ ఉంటే తమ వైద్యం కోసం చేసిన ఖర్చులను రీయింబర్స్మెంట్ రూపంలో తిరిగి పొందొచ్చు. పైగా వైద్య పరంగా అత్యవసర తరలింపునకు అయ్యే ఖర్చులను కూడా పాలసీదారులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరో ముఖ్యమైన ప్రయోజనం... ట్రిప్‌ను రద్దు చేసుకుంటే, లేదా అవాంతరాలు ఎదురైనా కవరేజీ లభిస్తుంది. పర్యటనకు ముందుకానీ, పర్యటన సమయంలో కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, పర్యాటకులు తమ పర్యటనలను కుదించుకోవడం లేదా రద్దు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల భారీ మొత్తంలో నష్టపోతుంటారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ తరహా పర్యటనల రద్దు, కుదింపు సమయాల్లో ఎదురయ్యే నష్టాలకు పరిహారాన్ని చెల్లిస్తుంది. ఈ పాలసీ ఉండడం వల్ల బ్యాగేజీ లేదా వ్యక్తిగత వస్తువులు కోల్పోయినా, పరిహారం పొందొచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవరేజీ లభించే వాటిల్లో వ్యక్తిగత బాధ్యత, పర్యటన ఆలస్యం, ప్రమాద మరణం, భౌతిక కాయాన్ని తరలించడం, దంత వైద్య వ్యయాలకూ కవరేజీ ఉంటుంది. కేవలం పర్యటనల సమయాల్లో కవరేజీకే పరిమితం కాకుండా, ఊహించని ఘటనలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి, ముఖ్యమైన సౌకర్యాలు ఇతర సమాచారాన్ని పాలసీదారులు రోజులో 24 గంటల పాటు పొందే అవకాశం కూడా ఉంది. ప్రయాణ సమయంలో డాక్యుమెంట్లు పోయినా పాలసీ ఆదుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలసి చేసే పర్యటనలు ఎంతో అనందాన్నిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, బయటకు వెళ్లినప్పుడు ముప్పు లేదా ప్రమాదాలు ఎదురుకాకుండా బయటపడే ఎటువంటి మార్గం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా కానీ ఏదైనా ట్రిప్‌కు వెళ్లి రావాలనుకుంటే, అది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో అయినా కానీ, ముందుగా ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు కూడా ప్లాన్ చేసుకోవాలి. -
రైలు ప్రయాణికులకు ప్రమాద బీమా సౌకర్యం
-
రైలు బీమా షురూ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం రైలు ప్రయాణికులకు ఐచ్ఛిక ప్రమాద బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. కొత్త పథకాన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ ప్రారంభించారు. టికెట్ బుకింగ్ సమయంలో బీమా సదుపాయం ఎంపిక చేసుకోవడం ప్రయాణికుడి ఇష్టం. ఏడాదిపాటు పెలైట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రీమియంగా రూ.92పైసలు మాత్రమే వసూలుచేస్తారు. రైలు ప్రమాదాల్లో ప్రయాణికుడు మరణిస్తే రూ. 10 లక్షల ప్రమాద బీమా అందిస్తారు. -
ట్రావెల్ బీమా లేకుంటే కష్టం!
మొన్నటికి మొన్న... బెల్జియంలో పర్యాటకులు బాంబు దాడికి గురయ్యారు. నిజానికి ఈ సంఘటన ఎవ్వరి ఊహలకు కూడా అందలేదు. దీంతో కొందరికి విదేశంలో డబ్బుల్లేక చిక్కుకుపోయే పరిస్థితి తలెత్తింది. నిజానికి సరైన ప్రయాణ బీమా ఉంటే ఈ పరిస్థితి రాదు. స్నేహితులు, బంధువులు మన భావోద్వేగాలనైతే పంచుకుంటారు. కాకపోతే ఆర్థిక మద్దతు అందించాలంటే సరైన ప్రయాణ బీమాతోనే సాధ్యం. ఇపుడు చాలా కంపెనీలు ఉగ్రవాదుల దాడులకు కూడా కవరేజీ ఇస్తున్నాయి. కానీ అంతర్యుద్ధం వంటి వాటి విషయంలో మాత్రం కవరేజీ ఇవ్వటం లేదు. ట్రావెల్ బీమాతో ఎమర్జెన్సీ సమయాల్లో లభించే ప్రయోజనాలేంటో చూద్దాం... * హైజాక్ నుంచి వైద్య ఖర్చుల వరకూ కవరేజీ * ఆఖరి క్షణం అవస్థలకూ బీమాతో చెల్లుచీటీ హైజాక్ అలవెన్సు: బీమా ఉన్న వ్యక్తి విదేశీ ప్రయాణం చేస్తుండగా విమానం హైజాక్‌కు గురైందని అనుకుందాం. అలాంటి సమయాల్లో హైజాక్‌లో ఉన్న ప్రతి రోజుకూ అలవెన్స్ చెల్లిస్తారు. కాకపోతే ఈ మొత్తం బీమా పరిధికి లోబడి ఉండాలి. రాజకీయ నష్టం- తరలింపు: బీమా ఉన్న వ్యక్తి ఒక దేశాన్ని సందర్శించినపుడు... రాజకీయ అంశాల కారణంగా కొన్ని వర్గాలవారు తక్షణం దేశాన్ని విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించినపుడు పాలసీ వర్తిస్తుంది. పాలసీ దారుడిని సదరు దేశం నుంచి బహిష్కరించినా, అక్కడకు వచ్చే అర్హత లేదని ప్రకటించినా కవరేజీ ఉంటుంది. * భూకంపం, వరదలు, అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వాటి నుంచి తప్పించుకోవటానికి పాలసీ దారుడు ఆ దేశం విడిచి వెళ్లాల్సి వస్తే దానికి కవరేజీ ఉంటుంది. * ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుడు తన స్వదేశానికి తిరిగి రావటానికి అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. లేనిపక్షంలో పాలసీదారుడిని వేరొక సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అయ్యే ఖర్చుకూ కవరేజీ ఉంటుంది. * ఒకవేళ పాలసీదారుడు తన దేశానికి రాలేని పక్షంలో విదేశంలో గరిష్ఠంగా 7 రోజుల పాటు వసతి ఖర్చుల్ని కూడా బీమా కంపెనీ భరిస్తుంది. ట్రిప్ ఆలస్యమైతే..: ప్రకృతి వైపరీత్యాలు, టైస్టుల దాడులు, మెడికల్ ఎమర్జెన్సీల వల్ల ట్రిప్ ఆలస్యమైతే వసతి, ఆహారం తదితరాలకు అయ్యే ఖర్చుల్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. యాత్రలకు వె ళ్లేవారెవ్వరూ అక్కడి పరిస్థితులనో, పరిణామాలనో ముందుగా ఊహించలేరు. కానీ బీమా కవరేజీని మాత్రం ముందే తీసుకోగలరు. అందుకే తగిన బీమా కవరేజీతో ఏ ప్రయాణాన్నయినా హాయిగా సాగించవచ్చనేది నా సలహా. అత్యవసర వైద్య పరిస్థితులు: విదేశాల్లో ఉన్నపుడు అస్వస్థతతోనో, ప్రమాదం వల్లో ఆసుపత్రిలో చేరితే వెంటనే క్లెయిమును నమోదు చేసి, బీమా కంపెనీ అనుమతి పొందాల్సి ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యం పాలైతేనే. స్వదేశానికి తిరిగి వచ్చేదాకా చికిత్స చేయించుకోకుండా ఉండటం కష్టమని, అప్పటికప్పుడే చేయించుకోవాలనే పరిస్థితి ఉన్నపుడే క్లెయిమును ఆమోదిస్తారు. అప్పటికే ఉన్న వ్యాధుల వల్ల కాకుండా ఏదైనా ప్రమాదం వల్ల గాయం తగలడం,అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం వంటి సందర్భాల్లోనూ ఈ ప్రయోజనం పొందవచ్చు. ఎమర్జ్జెన్సీ క్యాష్ అడ్వాన్సు: పాలసీదారుడి లగేజీ లేదా డబ్బు చోరీకో లేక దోపిడీకో గురైన పక్షంలో... దేశంలో ఉండే పాలసీదారు బంధువులతో సమన్వయం జరిపి... తక్షణ సాయంగా అత్యవసర నగదు అందజేస్తారు. అయితే ఈ మొత్తం పాలసీ పరిమితులకు లోబడి ఉంటుంది. యాత్ర రద్దు, అంతరాయం, విమానం మిస్ అయినా...: అనివార్య కారణాల వల్ల పాలసీదారు యాత్రను రద్దు చేసుకున్నా, యాత్రకు అంతరాయం కలిగినా లేదా విమానం మిస్ అయినా కవరేజీ ఉంటుంది. ట్రిప్ ఖర్చులు, క్యాన్సిలేషన్ చార్జీలు కవర్ అవుతాయి. అయితే దీనికి కారణాలు పాలసీలో పేర్కొన్నవి అయి ఉండాలి. - అమిత్ భండారి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ -
టూర్‌కి ట్రా‘వెల్’ బీమా భరోసా
మనం ఎక్కడికైనా టూర్ వెళ్లాలంటే చాలా ప్రణాళికలను రచిస్తాం. ఏ ఏ ప్రదేశాలను చూడాలి, ఎక్కడ ఉండాలి, ఏ వస్తువులను కొనాలి, ఎక్కడ తినాలి ఇలా ఎన్నో అంశాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతనే టూర్‌కు కదలుతాం. కానీ వీటన్నింటికన్నా ముఖ్యమైన అంశాన్ని మాత్రం వదిలేస్తాం. అదేనండి ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయం. టూర్ ప్లాన్ చేసుకొని బయలుదేరామే అనుకోండి. అలా వెళ్లిన తర్వాత టూర్ మధ్యలో అక్కడి కొత్త వాతావరణం వల్ల మనకు అనారోగ్యం చేస్తే.. అప్పుడేంటి పరిస్థితి. మనం పట్టుకెళ్లిన డబ్బులను ఆరోగ్యం బాగుచేసుకోవడానికి వెచ్చించాల్సి వస్తుంది. అనారోగ్యం కారణంగా టూర్‌కు వెళ్లినా ఎంజాయ్ మాత్రం చేయలేం. ఇక్కడ డబ్బుతో సహా కాలం కూడా వృథా అయినట్టే లెక్క. కాలాన్ని ఎలాగూ ఆపలేం కాబట్టి ఇక మిగిలింది డబ్బు. టూర్‌కు వెళ్లే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ జేబులో డబ్బైనా మిగులుతుంది. ప్రస్తుతం ప్రతి కంపెనీ కూడా ట్రావెలర్స్ కోసం పలు రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకాలు లగేజ్ నుంచి మెడికల్ వరకు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ వేటికి వర్తిస్తుంది? లగేజ్ డ్యామేజ్ అయ్యింది. ఫ్లైట్ ఆలస్యమైంది. అనివార్య కారణాల వల్ల విమానం మిస్ అయ్యింది. వీటన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే ఈ పరిస్థితుల్లో సదరు బీమా కంపెనీ మీకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. మనకు అనారోగ్యం తలెత్తినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మన అనారోగ్యానికి అయ్యే ఖర్చునంతటినీ భరిస్తుంది. ఎక్కడ మంచి వైద్యం లభిస్తుందో, దానికి ఎంత ఖర్చవుతుందో వంటి అంశాలు మనకు తెలియవు కదా. అప్పుడు అన్ని బాధ్యతలను బీమా కంపెనీయే తీసుకుంటుంది.ఇవే కాదండి.. ఎమర్జెన్సీ వసతి సదుపాయం, పాస్‌పోర్ట్ పోయినా, లీగల్ ఖర్చులు, ఓవర్ బుక్డ్ ఫ్లైట్, అనారోగ్య పరిస్థితుల్లో రోజూవారీ ఖర్చులు, పర్సనల్ యాక్సిడెంట్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలకు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇటీవల కాలంలో కొన్ని దేశాలు వెళ్లాలంటే వీసాతోపాటే బీమా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 85 ఏళ్లు ఉన్న వారికి కూడా అందుబాటులో పథకాలు ఉన్నాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాలు ►వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ ►కుటుంబ ట్రావెల్ ఇన్సూరెన్స్ ►స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ►సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ►బిజినెస్ మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ►కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ►దేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ►అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ►ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు బజాజ్ అలియాంజ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, టాటా ఏ ఐజీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఫ్యూచర్ జనరా లీ ఇండియా, ఐసీఐసీఐ లంబార్డ్, నేషనల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ జెనరల్, రెలిగేర్ హెల్త్, చోళమండలం ఎంఎస్ జనరల్, ఎస్బీఐ జనరల్, యునెటైడ్ ఇండియా, స్టార్హెల్త్, అపోలో మ్యూనిచ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌తో సహా పలు కంపెనీలు ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్నాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు జాగ్రత్తలు దఇన్సూరెన్స్ పథకాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థ దేశీ, అంతర్జాతీయంగా ఏ ఏ కంపెనీలతో భాగస్వామ్యమై ఉందో తెలుసుకోండి. ఎందుకంటే టూర్‌కు వెళ్లినప్పుడు అక్కడ ట్రిప్‌లో ఏదైనా ఆలస్యం జరిగినా, ట్రిప్ రద్దైనా ఇతర కంపెనీలతో భాగస్వామ్యమై ఉంటే మళ్లీ కొత్త ట్రిప్ ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయి. దఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చరిత్రకు సంబంధించిన విషయాలను తెలుసుకోండి. దసదరు బీమా కంపెనీ ఏదైనా టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచిందో.. లేదో.. గమనించండి. దటోల్-ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటే.. మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కాల్ చేసి తగిన సహాయాన్ని పొందొచ్చు. దఏ కంపెనీలు ఆఫర్ అందిస్తున్నాయో ఆన్లైన్లో వెతకండి. అలాగే ఒక కంపెనీ ప్రీమియంకు మరో కంపెనీ ప్రీమియాన్ని సరిపోల్చండి. మీకు ఏ కంపెనీ పాలసీ నచ్చుతుందో దాన్నే తీసుకోండి. టూర్ ట్రిప్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ వ్యయం దాదాపుగా 1 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. -
విదేశీ పర్యటనలో బీమా ధీమా..!
రాము చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రితో కలిసి స్విట్జర్లాండ్‌కి వెళ్తుండడమే కారణం. తల్లి బట్టలు సర్దే పనిలో బిజీగా ఉంది. ప్రత్యేకించి స్విట్జర్లాండ్ చలి వాతావరణాన్ని తట్టుకుని ఉండడానికి కావాల్సిన మందపాటి ఉన్ని స్వెటర్ల ప్యాకింగ్‌పై ఆమె నిమగ్నమైంది. తండ్రి ఇప్పటికే టిక్కెట్లు సైతం బుక్‌చేసి, వీసాకోసం దరఖాస్తు పెట్టుకున్నారు. రేపోమాపో వీసా కూడా వచ్చే తరుణమది. అయితే అప్పుడే రాము తండ్రికి కలవరపెట్టే విషయమొకటి తెలిసింది. స్విట్జర్లాండ్సహా, షెంజన్ ఒప్పందం కింద సంతకాలు చేసిన 26 దేశాల యూరోపియన్ గ్రూప్‌లో ఏ ఒక్కదేశంలో పర్యటించాలన్నా... పర్యాటక బీమా తప్పదన్నదే దీని సారాంశం. ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు సమర్పించనిదే.. వీసా ఆమోద ప్రక్రియ ముందుకు జరగదని తెలుసుకున్న రాము తండ్రి ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. ఇందుకు కావాల్సిన పర్యాటక బీమా వివరాలను తెలుసుకోడానికి హుటాహుటిన తాను వీసా దరఖాస్తు చేసిన కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లాడు. స్విట్జర్లాండ్ అధికారులు నిర్దేశిస్తున్న పర్యటన బీమా అవసరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా లభ్యమవుతున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయడానికి వెంటనే నెట్ సర్ఫింగ్ ప్రారంభించాడు. షెంజెన్ దేశాల్లో పర్యటనకు వీసా దరఖాస్తుకు ముందస్తుగానే పర్యటన బీమా తప్పనిసరన్న అంశం... మొత్తంగా రాము కుటుంబం విదేశీ పర్యటన షెడ్యూల్‌ను గందరగోళంలో, అనిశ్చితిలో పడేసింది. ఆ 26 దేశాల పర్యటనకు... షెంజన్ దేశాల్లో పర్యటనకు వీసాకు దరఖాస్తు చేసే ముందు కనీసం 30,000 యూరోలు లేదా సరిసమానమైన కరెన్సీని వైద్య వ్యయాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. షెంజన్ ఏరియాలో పర్యటన సమయంలో పర్యాటకుడు ఏదైనా జబ్బు పడితే, తీసుకున్న పాలసీ మొత్తం పరిధికి లోబడి సంబంధిత పర్యాటకుడు ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని పొందగలుగుతాడు. ఏ దేశమేగినా... నిజానికి అమెరికా, కెనడాలాంటి కొన్ని దేశాల్లో పర్యటనకు ముందు పర్యటన బీమా చేయించుకోవడం తప్పనిసరి కాదు. అయితే ఆయా దేశాల్లో పర్యటన సందర్భంగా ఏదైనా జబ్బు పడితే వైద్య ఖర్చులు తడిచిమోపెడవుతాయి. ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యయం భారత్‌కన్నా అత్యధికం కావడం ఇక్కడ మరో కీలకాంశం. ఇలాంటి పరిస్థితి దేశం కాని దేశంలో ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. ఈ అనుకోని ఇబ్బందులను ఎదుర్కొనాలంటే ఏ దేశంలో పర్యటనకైనా ముందు పర్యటన బీమా తప్పనిసరిగా చేయించుకోవడం ఎంతో ప్రయోజనం. పలు ప్రొడక్టులు... భారత్‌లోని పలు బీమా కంపెనీలు ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా పలు రకాలు పర్యటన బీమా పథకాలను విక్రయిస్తున్నాయి. పర్యటనకు సంబంధించి ఆయా దేశాల్లో పరిస్థితుల అవసరాలకు అనుగుణమైన అంశాలు పొందుపరచిన బీమా పథకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఒక్క వైద్యమే కాకుండా, ఇతర అవసరాలకు తగిన బీమా పథకాలను సైతం కంపెనీలు విక్రయిస్తున్నాయి. విదేశీ పర్యటనలో ‘ముందు జాగ్రత్త’ అపరిమిత ప్రయోజనాలను చేకూర్చుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. మీ విదేశీయానంలో దురదృష్టవశాత్తూ... అనుకోకుండా వచ్చే వ్యయ ప్రయాసలకు కొండత ధీమా... పర్యటన బీమా... బెస్ట్ ఆఫ్ లక్..!