free insurance
-
ఈపీఎఫ్‌లో ఉన్న ఈ అదనపు బెనిఫిట్ గురించి తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు భవిష్యత్తు కోసం తమ కొంత మొత్తాన్ని ఇందులో జమ చేస్తుంటారు. దీనికి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. అయితే దీంతోపాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అందించే అద్భుతమైన అదనపు ప్రయోజనం ఒకటుంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకాన్ని ఈపీఎఫ్ఓ 1976లో ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ సభ్యుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ ఇన్సూరెన్స్ కవరేజీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌కు కంపెనీ కంట్రిబ్యూషన్ ఇస్తుంది.బీమా మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారంటే..బీమా మొత్తం గత 12 నెలల బేసిక్ జీతం, డీఏపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజీ క్లెయిమ్ చివరి మూల వేతనం + డీఏకు 35 రెట్లు ఉంటుంది. ఇది కాకుండా, రూ .1,75,000 వరకు బోనస్ మొత్తాన్ని కూడా చెల్లిస్తారు.ఈపీఎఫ్ఓ సభ్యుడు ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే ఈడీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి వస్తారు. ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తరువాత, అతని కుటుంబం, వారసులు, నామినీలు దానిని క్లెయిమ్ చేయలేరు. ఈపీఎఫ్ఓ సభ్యుడు 12 నెలలు నిరంతరాయంగా పనిచేస్తుంటే, ఉద్యోగి మరణించిన తర్వాత, నామినీకి కనీసం రూ .2.5 లక్షల ప్రయోజనం లభిస్తుంది.ఉద్యోగి పనిచేసేటప్పుడు అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం సంభవిస్తే ఈడీఎల్ఐ క్లెయిమ్ చేయవచ్చు. ఈడీఎల్ఐ పథకం కింద నామినీలుగా ఎవరినీ పేర్కొనకపోతే మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి, అవివాహిత కుమార్తెలు, మైనర్ కొడుకులు, కుమారులను కవరేజీని లబ్ధిదారులుగా పరిగణిస్తారు.ఎలా క్లెయిమ్ చేయాలంటే..ఈపీఎఫ్ చందాదారు అకాల మరణం చెందితే, వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు బీమా కవరేజీ కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకోసం నామినీ వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు వారి తరఫున క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసేటప్పుడు డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మైనర్ సంరక్షకుడి తరఫున క్లెయిమ్ చేస్తుంటే గార్డియన్ షిప్ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. -
పంటకు పూచీ మాది.. రైతులకు అండగా ఏపీ సర్కార్
ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు అనునిత్యం ఆందోళనే. విత్తనం వేశాక మొలక రాకపోతే.. పూత, కాయ దశలో తెగుళ్లు ఆశిస్తే.. తీరా పంట చేతికందే దశలో ఏ వర్షానికో తడిసిపోతే.. ఇలా దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఉండటంతో అన్నదాతల్లో ఆ దిగులు పోయింది. ప్రతి పంటకూ రైతుకు రూపాయి ఖర్చు లేకుండా బీమా చేయిస్తోంది. సగటు దిగుబడి కంటే తక్కువగా వచ్చినప్పుడు అండగా నిలిచి ఆదుకుంటోంది. ఇందుకోసం ఏకంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. 2021 ఖరీఫ్‌కు సంబంధించి కనీవినీ ఎరుగని రీతిలో రైతులకు భారీగా బీమా సొమ్ము అందజేస్తోంది. సాక్షి, అమరావతి: వరదలు, తుపాన్లు, అకాల వర్షాలతో పాటు చీడపీడలతో ఖరీఫ్–2021 సీజన్లో నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రికార్డు స్థాయిలో 15.61 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.2,977.82 కోట్ల పంటల బీమా పరిహారం అందిస్తోంది. లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే ఆర్బీకేల్లో ప్రదర్శించింది. అనంతపురం జిల్లా సీకే పల్లిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బీమా సొమ్ము పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పంటల బీమా గతంలో సన్న, చిన్నకారు రైతులకు అందని ద్రాక్షగా ఉండేది. కొద్దిపాటి అవగాహన ఉన్న బడా రైతులకు మాత్రమే దాని గురించి అవగాహన ఉండేది. దీంతో ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది చిన్న రైతులు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేక విపత్తుల బారినపడి ప్రతిసారి ఆర్థికంగా నష్టపోయే వారు. బీమా చేయించుకున్న వారు సైతం బీమా సొమ్ము ఎప్పుడొస్తుందో.. ఎంతొస్తుందో తెలియక ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతి పంటకు ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. సీజన్ ముగియ కుండానే బీమా పరిహారం చెల్లిస్తూ అండగా నిలుస్తోంది. ఈ పంటే ప్రామాణికంగా పంటల బీమా గతంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద ఆహార, నూనెగింజల పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, సీజన్‌తో సంబంధం లేకుండా ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని మారుస్తూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పైసా భారం పడకుండా రైతులకు పరిహారం అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, ప్రతీ ఎకరాకు ఉచిత బీమా కల్పిస్తోంది. క్లైయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా తన భుజాన వేసుకుంది. గత ప్రభుత్వంలో కంటే మిన్నగా.. ► టీడీపీ హయాంలో ఏటా సగటున 20 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వస్తే, గత మూడేళ్లలో సగటున 60.35 లక్షల మంది రైతులు, 53.86 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2019–20 సీజన్లో పైసా భారం పడకుండా 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు బీమా చేయించగలిగారు. ► 2020–21లో 71.30 లక్షల మంది రైతులకు సంబంధించి 61.75 లక్షల హెక్టార్లలో పంటలు బీమా పరిధిలోకి వచ్చాయంటే ఏ స్థాయిలో పెరుగుదల నమోదైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంతో పోల్చుకుంటే రైతుల పరంగా 198.57 శాతం, విస్తీర్ణ పరంగా 128.51 శాతం పెరిగింది. ► చెల్లించిన క్లైమ్ల విషయానికి వస్తే టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్ల బీమా చెల్లిస్తే, గత ప్రభుత్వ బకాయిలతో కలిపి గడిచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 29.05 లక్షల మంది రైతులకు రూ.3,707.02 కోట్ల మేర బీమా అందించింది. ► 6.19 లక్షల మంది రైతుల రూ.715.84 కోట్ల గత ప్రభుత్వ బకాయిలను సైతం చెల్లించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. తాజాగా ఖరీఫ్ –2021కు సంబంధించి 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► మొత్తంగా గత మూడేళ్లలో 44.61 లక్షల మంది రైతులకు రూ.6,684.84 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లయింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా, 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. చరిత్రలో ఇదే తొలిసారి ఒక సీజన్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పంటల బీమా పరిహారం అందించిన చరిత్ర గతంలో లేదు. 2021 ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా.. అకాల వర్షాలు, తుపాన్లు వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలన్న సంకల్పంతో ప్రత్యేక బృందాల ద్వారా గ్రామ స్థాయిలో అంచనా వేసిన పంట నష్టం ఆదారంగా పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – చేవూరు హరి కిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఖరీఫ్ పంటలకూ ఉచిత బీమా
సాక్షి, అమరావతి: ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు కూడా ఉచిత పంటల బీమాను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ–పంటలో నమోదు చేసుకున్న పంటలకే ఉచిత బీమాను పరిమితం చేయాలని నిర్ణయించింది. వ్యవసాయరంగ బీమా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.101 కోట్ల వాటా ధనంతో ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) ఏర్పాటుకు గతంలోనే ఉత్తర్వులు విడుదల చేసింది. కొన్ని నిబంధనలు పూర్తికావాల్సి ఉన్నందున ఆ సంస్థ పెండింగ్‌లో ఉన్నప్పటికీ గత ఏడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు బీమాను అమలు చేసింది. రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఏయే పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలో జాబితాలను విడుదల చేసింది. జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (జీసీఈఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే నిర్దేశిత పంట కోత ప్రయోగాల ఆధారంగా దిగుబడి ఆధారిత పంటల బీమా క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద క్లెయిమ్స్‌ను ఏపీఎస్‌డీపీఎస్‌గానీ, గుర్తించిన ఐఎండీ వాతావరణ కేంద్రాలుగానీ, రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్ గేజ్ స్టేషన్లుగానీ ఇచ్చే సమాచారం ఆధారంగా పరిష్కరిస్తారు. -
ఉబెర్ రైడర్లకు ఉచిత ప్రమాద బీమా
న్యూఢిల్లీ: ప్రముఖ ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ రైడర్లకు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని తీసుకొచ్చింది. ట్యాక్సీలు, ఆటోలు, మోటారు సైకిళ్లపై ప్రయాణించే సమయంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం బారిన పడితే ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని అందించనున్నట్టు బుధవారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన లేక వైకల్యం పాలైతే రూ.5లక్షల పరిహారం, ఆస్పత్రి పాలైతే రూ.2లక్షల వరకు పరిహారం (ఇందులో రూ.50,000 వరకు అవుట్ పేషెంట్ ప్రయోజనం కూడా ఉంటుంది) లభిస్తుందని తెలిపింది. ఇందుకోసం భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రమాదాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, రైడర్లకు రక్షణ ఉంటుందన్న భరోసానివ్వడమే ఈ ఆఫర్ ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. ఓలా సైతం బీమా ఆఫర్‌ను తన రైడర్లకు రూ.2కు ఆఫర్ చేస్తోంది. ఓలా.. ‘రెలిగేర్’ వైద్యబీమా... రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నట్టు ఓలా ప్రకటించింది. రిజిస్టర్ యూజర్లు అందరూ ఈ పాలసీకి అర్హులేనని, యాప్ నుంచి దీన్ని తీసుకోవచ్చని తెలిపింది. ప్రీమియం రోజుకు కనీసం రూ.3 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. వ్యక్తులు విడిగా, తమ కుటుంబం మొత్తానికి కలిపి పాలసీని తీసుకోవచ్చని, నెలకు, సంత్సరం కాల వ్యవధికి తీసుకునే సదుపాయం కూడా ఉన్నట్టు తెలిపింది. -
ఎయిర్టెల్ ‘భరోసా’: 5 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ‘భరోసా సేవింగ్స్ అకౌంట్’ పేరుతో కొత్త సేవను నేడు (మంగళవారం) ప్రారంభించింది. ఇది అండర్ బ్యాంక్ , అన్‌బ్యాంక్ కస్టమర్ల ప్రత్యేకమైన అవసరాలను తీర్చనుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేవలం నెలవారీ బాలెన్స్ 500 రూపాయలతో ఈ ఖాతాను నిర్వహిండచడంతోపాటు, ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఖాతా ద్వారా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, నెలకు ఒక లావాదేవీ ఉచితం. అలాగే భరోసా ఖాతా ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందే లేదా, నగదు డిపాజిట్లు చేసే వినియోగదారులు క్యాష్‌బ్యాక్ కూడా సదుపాయాన్ని కూడా పొందవచ్చు. భరోసా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనీ, ఈ వినూత్న ఖాతాతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగం, లావాదేవీల అధికారిక బ్యాంకింగ్ విధానాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ అనుబ్రాతా బిస్వాస్ తెలిపారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వినూత్నమైన, విభిన్నమైన పథకమని పేర్కొన్నారు. భరోసా సేవింగ్స్ ఖాతా కస్టమర్లు భారతదేశం అంతటా 6,50,000 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం అవులెట్లలో నగదు ఉపసంహరించుకోవచ్చు, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. మినీ స్టేట్మెంట్ను కూడా తీసుకోవచ్చు -
తేజస్ రైలులో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ–లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రూ.25 లక్షల ఉచిత ప్రయాణ బీమా అందించనున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ రైలులో ప్రయాణించే వారికి పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ రైలుకు సంబంధించిన పలు వివరాలను గురువారం విడుదల చేసింది. ► ప్రయాణీకుల లగేజీ తరలింపునకు ‘పిక్ అండ్ డ్రాప్’ సర్వీసును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రయాణీకుల లగేజీని వారి ఇంటి నుంచి రైలు సీటు వరకు, రైలు దగ్గర నుంచి వారి ఇంటి వరకు తరలించే వెసులుబాటు కల్పించనుంది. ► తేజస్‌లో రాయితీలు, తత్కాల్ కోటా వర్తించవు. ఐదేళ్ల వయసు దాటిన చిన్నారులకు పూర్తి చార్జీలు వర్తిస్తాయి. ► ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏసీ చైర్ కార్లలో విదేశీ పర్యాటకుల కోసం ఐదు సీట్లను కేటాయించనుంది. ► ప్రయాణానికి 60 రోజుల ముందే బుకింగ్స్ ఉంటాయి. ► విమానాల్లో మాదిరిగా భోజనాన్ని ట్రాలీలలో అందిస్తారు. టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఆర్వో మెషీన్ల ద్వారా నీటిని అందిస్తారు. ► ప్రయాణికుల రద్దీ, పండుగల సీజన్, డిమాండ్ వంటి వాటి ఆధారంగా టికెట్ ధరలు మారుతూ ఉంటాయని తెలిపింది. డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తామని పేర్కొంది. ► ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ సర్వీస్ ఆధారంగా టికెట్ బుకింగ్ ఉంది. -
సెప్టెంబర్ నుంచి రైళ్లలో ఉచిత బీమా రద్దు
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి రైలు ప్రయాణికులకు ఉచిత బీమా సౌకర్యం రద్దు చేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా సౌకర్యాన్ని నిలిపివేయాలని భారతీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) నిర్ణయించిందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కావాలనుకున్న వారే ఇకపై బీమా సౌకర్యం పొందే వీలుంటుంది. ప్రయాణ బీమా ఫీజు ఎంతనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రయాణికులను డిజిటల్ కార్యకలాపాల వైపు ప్రోత్సహించేందుకు గాను ఐఆర్సీటీసీ 2017లో ఉచిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అప్పుడు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వారికి టికెట్ బుకింగ్ రుసుమును తొలగించింది. బీమా పథకం కింద ప్రయాణ సమయంలో వ్యక్తి మరణిస్తే రూ.10లక్షలు పరిహారం పొందే వీలుంది. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం : ప్రయాణీకులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రయాణీకులకు భారీ షాక్ ఇచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు అందించే ఉచిత బీమా సౌకర్యాన్ని రద్దు చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉచిత బీమాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం చేపట్టిన ఉచిత బీమా సౌకర్యాన్ని త్వరలో నిలిపివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. రైల్వేలు సెప్టెంబర్ 1నుంచి ప్రయాణీకులకు ఉచితంగా ప్రయాణ బీమాను నిలిపివేయనుందనీ, "బీమా ఐచ్ఛికం" అని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రైల్వే ప్రయాణికులు వెబ్ సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కావాలా వద్దా అనే రెండు ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అయితే ఇన్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా 2017,డిసెంబరు నుంచి ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సాహించేందుకు ఐఆర్సిటిసిద్వారా రైల్వేశాఖ ఈ ఉచిత బీమాను తీసుకొచ్చింది. రైలు ప్రమాదాలు లేదా ఇతర సంఘటనల్లో గాయపడినవారు లేదా చనిపోయినవారి కుటుంబీకులకు పరిహారం అందిస్తారు. రైలు ప్రయాణం సమయంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు గరిష్టంగా 10 లక్షల రూపాయలు, వికలాంగుడయితే 7.5 లక్షల రూపాయలు, గాయపడినట్లయితే రూ. 2 లక్షలు అందిస్తోంది. అలాగే మృతదేహాలను తరలించేందుకు రూ. 10వేలు కూడా అందిస్తుంది. కాగా ఉచిత బీమా సౌకర్యం వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీమా కంపెనీల నుంచి రూ. 3.5 కోట్లు పంపిణీ చేసినట్టు ఇటీవల రైల్వే శాఖ వెల్లడించింది. -
ఉబర్ డ్రైవర్లకు ఉచిత ఇన్సూరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ రైడ్-హైలింగ్ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ తన డ్రైవర్లకు ఉచిత ఇన్సూరెన్స్ ప్రొగ్రామ్‌ను ఆవిష్కరించింది. మరింత మంది డ్రైవర్లను ఆకట్టుకోవడానికి భారత్‌లో తమ 4,50,000 మంది డ్రైవర్లకు ఈ ఇన్సూరెన్స్ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. ప్రమాద సమయంలో సంభవించే మరణం, వైకల్యం లేదా ఆసుపత్రి పాలవడం వంటి వాటికి ఈ ఉచిత ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్టు ఉబర్ చెప్పింది. దక్షిణాసియాలో అతిపెద్ద ప్రైవేట్ నాన్-లైఫ్ ఇన్సూరర్ ఐసీఐసీఐ లంబార్డు జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఈ ఇన్సూరెన్స్‌ను సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తేనుంది. ఉబర్ యాప్‌ను వాడుతున్న సందర్భంలోనూ, ఈ రూట్లోనూ లేదా ఉబర్ ట్రిపులో ఉన్న సమయంలో ప్రమాదం సంభవిస్తే ఈ ఇన్సూరెన్స్‌ను ఉబర్ అందించనుంది. డ్రైవర్ మరణిస్తే 5 లక్షల రూపాయల నుంచి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కు 50వేల రూపాయల వరకు కవరేజ్ లభించనుంది. ఉబర్‌కు భారత్‌లో ఓలా క్యాబ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో తమ డ్రైవర్ల నుంచి ఉబర్ పలు సమస్యలను ఎదుర్కొంది. ఉబర్ క్యాబ్ డ్రైవర్లు తమకు ప్రోత్సహాకాలు తగ్గిపోతున్నాయంటూ బంద్‌లు చేశారు. ఉబర్‌కున్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. -
ఇంటిని అద్దెకిస్తే రూ. కోటి బీమా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఇంటికి బీమా తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, అద్దెకిచ్చే ఇంటికీ ఉచిత బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది నెస్ట్అవే. ఆన్లైన్ కేంద్రంగా ఇంటి అద్దెల విభాగంలో ఉన్న నెస్ట్అవే ఇంటి యజమానులకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం నెస్ట్అవేలో 11 వేల ఇళ్లు నమోదుకాగా.. ఇందులో 25 వేల మంది అద్దెకుంటున్నారని, వీటిల్లో హైదరాబాద్‌లో 1,200 ఇళ్లు, 3,300 మంది అద్దెకుంటున్నారని శుక్రవారమిక్కడ జరిగిన సమావేశంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిశోర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, పుణె, హైదరాబాద్, ఘజియాబాద్, ముంబై నగరాల్లో సేవలందిస్తున్నామని.. ఏడాదిలో విజయవాడతో పాటూ చెన్నై నగరాల్లో సేవలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐడీజీ, టైగర్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల నుంచి 43.2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.