సాక్షి, హైదరాబాద్ : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ‘భరోసా సేవింగ్స్ అకౌంట్’ పేరుతో కొత్త సేవను నేడు (మంగళవారం) ప్రారంభించింది. ఇది అండర్ బ్యాంక్ , అన్‌బ్యాంక్ కస్టమర్ల ప్రత్యేకమైన అవసరాలను తీర్చనుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేవలం నెలవారీ బాలెన్స్ 500 రూపాయలతో ఈ ఖాతాను నిర్వహిండచడంతోపాటు, ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఖాతా ద్వారా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, నెలకు ఒక లావాదేవీ ఉచితం. అలాగే భరోసా ఖాతా ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందే లేదా, నగదు డిపాజిట్లు చేసే వినియోగదారులు క్యాష్‌బ్యాక్ కూడా సదుపాయాన్ని కూడా పొందవచ్చు.
భరోసా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనీ, ఈ వినూత్న ఖాతాతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగం, లావాదేవీల అధికారిక బ్యాంకింగ్ విధానాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ అనుబ్రాతా బిస్వాస్ తెలిపారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వినూత్నమైన, విభిన్నమైన పథకమని పేర్కొన్నారు. భరోసా సేవింగ్స్ ఖాతా కస్టమర్లు భారతదేశం అంతటా 6,50,000 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం అవులెట్లలో నగదు ఉపసంహరించుకోవచ్చు, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకోవచ్చు
ఎయిర్టెల్ ‘భరోసా’: ఐదు లక్షల ఉచిత బీమా
Published Tue, Sep 17 2019 2:51 PM | Last Updated on Tue, Sep 17 2019 3:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment