ఉబర్ డ్రైవర్లకు ఉచిత ఇన్సూరెన్స్
Published Tue, Aug 29 2017 7:01 PM | Last Updated on Thu, Aug 30 2018 9:05 PM
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ రైడ్-హైలింగ్ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ తన డ్రైవర్లకు ఉచిత ఇన్సూరెన్స్ ప్రొగ్రామ్‌ను ఆవిష్కరించింది. మరింత మంది డ్రైవర్లను ఆకట్టుకోవడానికి భారత్‌లో తమ 4,50,000 మంది డ్రైవర్లకు ఈ ఇన్సూరెన్స్ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. ప్రమాద సమయంలో సంభవించే మరణం, వైకల్యం లేదా ఆసుపత్రి పాలవడం వంటి వాటికి ఈ ఉచిత ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్టు ఉబర్ చెప్పింది. దక్షిణాసియాలో అతిపెద్ద ప్రైవేట్ నాన్-లైఫ్ ఇన్సూరర్ ఐసీఐసీఐ లంబార్డు జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఈ ఇన్సూరెన్స్‌ను సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తేనుంది.
ఉబర్ యాప్‌ను వాడుతున్న సందర్భంలోనూ, ఈ రూట్‌లోనూ లేదా ఉబర్ ట్రిపులో ఉన్న సమయంలో ప్రమాదం సంభవిస్తే ఈ ఇన్సూరెన్స్‌ను ఉబర్ అందించనుంది. డ్రైవర్ మరణిస్తే 5 లక్షల రూపాయల నుంచి అవుట్ పేషెంట్ ట్రీట్‌మెంట్‌కు 50వేల రూపాయల వరకు కవరేజ్ లభించనుంది. ఉబర్‌కు భారత్‌లో ఓలా క్యాబ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో తమ డ్రైవర్ల నుంచి ఉబర్ పలు సమస్యలను ఎదుర్కొంది. ఉబర్ క్యాబ్ డ్రైవర్లు తమకు ప్రోత్సహాకాలు తగ్గిపోతున్నాయంటూ బంద్‌లు చేశారు. ఉబర్‌కున్న అతిపెద్ద మార్కెట్‌లలో భారత్ ఒకటి.
Advertisement
Advertisement