
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి రైలు ప్రయాణికులకు ఉచిత బీమా సౌకర్యం రద్దు చేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా సౌకర్యాన్ని నిలిపివేయాలని భారతీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) నిర్ణయించిందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కావాలనుకున్న వారే ఇకపై బీమా సౌకర్యం పొందే వీలుంటుంది. ప్రయాణ బీమా ఫీజు ఎంతనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రయాణికులను డిజిటల్ కార్యకలాపాల వైపు ప్రోత్సహించేందుకు గాను ఐఆర్‌సీటీసీ 2017లో ఉచిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అప్పుడు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వారికి టికెట్ బుకింగ్ రుసుమును తొలగించింది. బీమా పథకం కింద ప్రయాణ సమయంలో వ్యక్తి మరణిస్తే రూ.10లక్షలు పరిహారం పొందే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment