
శాపమైన సోషల్ మీడియా సంబంధం
సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయం ఆ యువతి పాలిట శాపంగా మారింది.
పుణె: సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయం ఆ యువతి పాలిట శాపంగా మారింది. తొలుత మిత్రుడిలా పరిచయమైన ఆ యువకుడు అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత మొహం చాటేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఇంకా అతడిని అరెస్టు చేయాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
థానేలో 17 ఏళ్ల యువతి ఉంది. ఆమెకు పుణెలోని ధయారి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువకుడితో ఈ ఏడాది జనవరిలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తొలుత స్నేహంగా అనంతరం చనువుగా మారింది. అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అనంతరం ఆమెను పుణె రమ్మన్నాడు. అతడి మాటలు నమ్మి ఆ యువతి వెళ్లడంతో అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం మొహం చాటేశాడు. బాధిత యువతి అతడి తల్లిదండ్రులను బంధులను కలిసినప్పటికీ ఆమను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి మంగళవారం కేసు నమోదు చేసింది.