పాత నోట్లు రద్దయి ఆరు నెలలకు పైగా గడుస్తున్నా.. ఇంకా భారీ మొత్తంలో రద్దైన నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి.
కోటి రూపాయల పాతనోట్లు పట్టుబడ్డాయ్!
Published Thu, May 18 2017 1:45 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
థానె : పాత నోట్లు రద్దయి ఆరు నెలలకు పైగా గడుస్తున్నా.. ఇంకా భారీ మొత్తంలో రద్దైన నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. మంగళవారం రద్దయిన కోటిరూపాయల నోట్లను పోలీసులు సీజ్ చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మే 16వ తేదీన ముమ్ ద్రా టౌన్ షిప్ లోని పార్సిక్ సర్కిల్ వద్ద కారును అడ్డగించి పోలీసులు ఈ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
2016నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రద్దు చేసిన 500, 1000 నోట్లను కారులో వీరు కలిగిఉన్నారని, వీటి విలువ మొత్తం కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ ప్రైవేట్ బ్యాంకు మహిళా ఉద్యోగి కూడా ఉన్న థానె పోలీసులు తెలిపారు. కొత్త బిల్స్ రూపంలో ఈ పాతనోట్లను మార్చడానికి నిందితులు వెళ్తున్నారని, వారిని పట్టుకుని వారిపై కేసు నమోదుచేశామని థానె పోలీసు పీఆర్ఓ సుఖడ నర్కార్ చెప్పారు.
Advertisement
Advertisement