థానే: ముస్లిం డెలివరీ బాయ్ నుంచి సరుకులు తీసుకునేందుకు నిరాకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. కశిమీరా ప్రాంతానికి చెందిన ఘనశ్యామ్ చతుర్వేది ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్ చేశాడు. వీటిని డెలివరీ చేసేందుకు ఓ ముస్లిం వ్యక్తి మంగళవారం చతుర్వేది ఇంటికి వచ్చాడు. అతను ముఖానికి మాస్కులతోపాటు చేతులకు గ్లవ్స్ కూడా ధరించి ముందుజాగ్రత్త చర్యలను పాటించాడు. ఇంతలో చతుర్వేది, తన భార్యతో కలిసి గేటు దగ్గరకు వచ్చి ముందు అతడి పేరు అడిగాడు. అతను సమాధానం చెప్పగానే ముస్లిం అని అర్థమై సరుకులు తీసుకోడానికి నిరాకరించాడు. ముస్లిం తెచ్చిన వస్తువులను ముట్టుకునేది లేదని కరాఖండిగా చెప్పాడు. దీంతో ఖంగుతిన్న డెలివరీ బాయ్ అక్కడ సంభాషణ అంతటినీ ఫోన్‌లో రికార్డు చేసి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చతుర్వేదిని అరెస్టు చేశారు. నేడు అతడిని జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. (రోడ్లపైకి భారీగా జనం.. గుంజీలు తీయించిన పోలీసులు)
Comments
Please login to add a commentAdd a comment