దావూద్ సోదరుడు అరెస్టు
ఠాణె: డబ్బులివ్వాలంటూ ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను ఠాణె ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ వ్యాపారవేత్తను డబ్బులివ్వాలంటూ ఇక్బాల్, అతని గ్యాంగ్ బెదిరించారు. దీంతో ఆ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఠాణె క్రైమ్ బ్రాంచ్ చీఫ్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ.. ఠాణెలోని నివాసం నుంచి సోమవారం రాత్రి ఇక్బాల్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. 2003లో యూఏఈ నుంచి భారత్‌కు వచ్చిన ఇక్బాల్.. ఓ హత్యకేసు, అక్రమ నిర్మాణం కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు. అయితే 2007లో అతన్ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. 2015 ఫిబ్రవరిలో ఓ వ్యాపారిని డబ్బులివ్వాలంటూ బెదిరించి, అతనిపై దాడికి పాల్పడిన కేసులో ఇక్బాల్‌తోపాటు మరో ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇక్బాల్ బెయిల్‌పై బయటకొచ్చాడు.