ముంబై : ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ప్రముఖ బుకీని మంగళవారం నాడు థానే పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ముంబైలోని దొంబివాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న థానే దోపిడీ వ్యతిరేక విభాగానికి చెందిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి బుకీని అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌లను, పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్‌లను సీజ్ చేశారు. నిందితుడు దేశంలోనే టాప్‌మోస్ట్ బుకీ సోను జలాన్ అలియాస్ సోను మలాద్‌గా పోలీసులు ప్రకటించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జలాన్ ఈ ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్‌లు నిర్వహించడానికి సోషల్ మీడియా ద్వారా కొన్ని లింకులను పంపించేవాడు. ఇతర ఏజెన్సీలకు, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం. బెట్టింగ్‌లో పాల్గొనాలనుకునే వారు ఆ లింకుల ద్వారా బెట్టింగ్ పెడతారు. ఇలా పెట్టినవారికి జలాన్‌కు సంబంధించిన వ్యక్తుల ద్వారా కన్‌ఫర్మేషన్ కాల్ వస్తుంది. జలాన్ దొంబివాలా పరిసరాలలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాలను కూడా బెట్టింగ్‌కు అడ్డగా మార్చుకున్నాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment