ఈ యాక్సిడెంట్‌ చూస్తే షాక్‌.. గాల్లో అంతెత్తు ఎగిరిపడ్డ భార్యాభర్తలు | Bike And Car Accident Near Thane horrible Record In Cctv Footage | Sakshi
Sakshi News home page

ఈ యాక్సిడెంట్‌ చూస్తే షాక్‌.. గాల్లో అంతెత్తు ఎగిరిపడ్డ భార్యాభర్తలు

Published Sun, Jul 11 2021 2:36 PM | Last Updated on Sun, Jul 11 2021 3:08 PM

Bike And Car Accident Near Thane horrible Record In Cctv Footage - Sakshi

ముంబై: థానేలోని షాహాపూర్‌కు సమీపంలో ఉన్న ఆగ్రా రోడ్‌లోని కోర్టు ముందు కారు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘోర ప్రమాదం కోర్టు దగ్గరున్న సిసిటివిలో రికార్డు అయింది. గాయపడిన వారిద్దరూను దగ్గరలో ఉన్న  ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వివరాలు..షాహాపూర్‌లోని ఆగ్రా రోడ్‌లో అసంగావ్ వైపు ఓ కారు వెళ్తుంది. అస్సలే ఆ రోడ్డు చాలా  ఇరుకైనది. ఈ క్రమంలో  అతివేగంతో ఎదరుగా వస్తున్న  బైక్ నేరుగా కారును ఢీ కొట్టింది.

దీంతో బైక్ పై వెళ్తున్న భార్య, భర్తలు ఇద్దరూ గాల్లో పల్టీలు కొడతూ కిందపడ్డారు.అయితే వెంటనే  బైక్ రైడర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ వెంటనే స్థానికులు అక్కడకి చేరుకునిఅంబెలెన్స్ కు సమాచారం ఇచ్చారు. అయితే భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement