సాక్షి, థానే: మహారాష్ట్రలో మరో స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ స్వాతి భర్తను హత్య చేయిస్తే.. మహరాష్ట్రలో మాజీ ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రియుడు చేస్తున్న విపరీత ఒత్తిడిని తట్టుకోలేకే ప్రస్తుత ప్రియుడితో.. అతన్ని హత్య చేయించినట్లు నిందితురాలు 45 ఏళ్ల సుమారి యాదవ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
సుమారి యాదవ్‌కు 46 ఏళ్ల రాంజీ శర్మ మధ్య చాలాకాలం పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ కొన్నేళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగించారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. మూడేళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సుమారీ యాదవ్.. ఈ మధ్య 35 ఏళ్ల జయప్రకాష్ చౌహాన్‌తో సహజీవనం సాగిస్తోంది. దాదాపు నాలుగు నెలల నుంచి మాజీ ప్రియుడు రాంజీ శర్మ డబ్బుకోసం సుమారిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులు, ఇతర ఒత్తిడులు తట్టుకోలేక శర్మను హత్య చేసేందుకు ప్రస్తుత ప్రియుడు చౌహాన్‌తో కలిసి సుమారి ప్లాన్ వేసింది.
రాంజీ శర్మకు మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉండడంతో.. పార్క్‌లోనే అతన్ని హత్య చేసేందుకు ఇద్దరూ ప్రణాళిక రూపొందించారు. అనుకున్నట్లుగానే నవంబర్18న శర్మ మార్నింగ్ వాక్‌నుంచి తిరిగి వస్తున్న సమయంలో.. చౌహాన్ అత్యంత వేగంగా కారుతో అతన్ని ఢీకొట్టి హత్య చేశాడు. ఈ ఘటన తరువాత కారును శుభ్రం చేసి.. యాక్సిండెంట్ అయినట్లు అందరినీ నమ్మించాడు. తాను కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు నటించాడు. ఎవరికీ అనుమానం రాకుండా కారును సర్వీసింగ్ చేయించాడు.
ఇంత వరకూ బాగానే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులకు విస్మయం కలిగించే ఈ విషయం బయట పడింది. వెంటనే పోలీసులు సుమారి యాదవ్, చౌహాన్, శర్మల ఫొన్ రికార్డును పరిశీలించారు. విషయం అర్థమైన వెంటనే చౌహాన్, సుమారి యాదవ్‌లను అదుపులోకి తీసుకుని విచానించడంతో.. విషయం మొత్తం బయటపడింది. ఇదిలావుండగా సుమారి యాదవ్‌కు మొత్తం ఐదుగురు సంతానం ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment