అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది.
అందరి కళ్లే అతడిపైనే ఉన్నాయి. ఐపీఎల్ కాంట్రాక్ట్ అందుకున్న అతడు పాక్‌పై ఎలా ఆడుతాడో అని అందరూ ఆసక్తికిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఇరు జట్లు శుభారంభం చేయాలని పట్టుదలతో ఉన్నాయి.
కాగా అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు మూడు సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ రెండింట, భారత్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది.
తుది జట్లు
ఇండియా అండర్-19: ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్ సి, మహ్మద్ అమన్(కెప్టెన్), హర్వాన్ష్ సింగ్(వికెట్ కీపర్), నిఖిల్ కుమార్, కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, మహ్మద్ ఈనాన్, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహా
పాకిస్తాన్ అండర్-19: షాజైబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, సాద్ బేగ్(కెప్టెన్/ వికెట్ కీపర్), ఫర్హాన్ యూసఫ్, ఫహమ్-ఉల్-హక్, మహ్మద్ రియాజుల్లా, హరూన్ అర్షద్, అబ్దుల్ సుభాన్, అలీ రజా, ఉమర్ జైబ్, నవీద్ అహ్మద్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment