ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి సమయం అసన్నమవుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ మెగా వేలంలో ముంబై యువ ఆటగాడు ఆయుష్ మహాత్రేపై 5 సార్లు ఛాపింయన్ చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసినట్లు తెలుస్తోంది.
మెగా వేలానికి ముందు మహాత్రేని సెలక్షన్ ట్రయల్ కోసం సీఎస్‌కే పిలిచినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. మహాత్రే సీఎస్‌కే టాలెంట్ స్కౌట్‌లతో పాటు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని దృష్టిని కూడా ఆకర్షించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అతడికి ఈ నెలఖారులో హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో సెలక్షన్ ట్రయల్‌కు హాజరు అవ్వమని సీఎస్‌కే పిలుపునిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ల మహాత్రే ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో ముంబై తరపున ఆడుతున్నాడు.
ఈ టోర్నీలో భాగంగా ముంబై బుధవారం ప్రారంభం కానున్న తమ ఐదవ-రౌండ్ మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే మహాత్రేని సీఎస్‌కే సెలక్షన్ ట్రయల్‌కు హాజరు కానున్నాడు. ఆ తర్వాత నవంబర్ 23న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు ఈ యువ ఓపెనర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.
ఇరానీ కప్‌తో అరంగేట్రం..
మహాత్రే ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరానీ కప్‌లో లక్నో వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు (తొమ్మిది ఇన్నింగ్స్‌లు) ఆడిన అతను 35.66 సగటుతో 321 పరుగులు చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే మహాత్రేకి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడిని వేలంలో సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఓపెనర్‌గా పంపాలని సీఎస్‌కే యోచిస్తుందంట.
చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే ‘కొత్త రాజు’ అంటున్న ఆస్ట్రేలియా మీడియా!
Comments
Please login to add a commentAdd a comment