File Photo
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత మూడు సీజన్లలో తమ సారథిగా వ్యవహరించిన రాహుల్‌ను లక్నో ఈసారి రిటైన్ చేసుకోలేదు.
దీంతో ఈ కర్ణాటక బ్యాటర్-కీపర్ నవంబర్ 24-25 తేదీలలో జెడ్డాలో వేదికగా జరగనున్న మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే చాలా మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులు రాహుల్ తన సొంత గూటికి చేరాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్-2025లో సీజన్‌లో కేఎల్ ఆర్సీబీ తరపున ఆడితే చూడాలని ఆశపడుతున్నారు. కాగా గతంలో రాహుల్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు.
రాహుల్‌కు రూ.20 కోట్లు!
ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో మాక్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో చాలా మంది అభిమానులు పాల్గోన్నారు. కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకోవడానికి రూ. 20 కోట్లు వెచ్చిందేందుకు ఫ్యాన్స్ సిద్దమయ్యారు. మరికొంతమంది ఫ్యాన్స్ రిషబ్ పంత్ కోసం పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?
అయితే ఆర్సీబీ యాజమాన్యం కూడా రాహుల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. తమ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌ను వేలంలోకి ఆర్సీబీ విడిచిపెట్టింది. విరాట్ కోహ్లి,యశ్ దయాల్, పాటిదార్‌ను మాత్రం బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ పర్స్‌లో ప్రస్తుతం రూ. 83 కోట్లు ఉన్నాయి.
చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల
Comments
Please login to add a commentAdd a comment