Day 2: ఐపీఎల్‌-2025 మెగా వేలం లైవ్‌ అప్‌డేట్స్‌.. | IPL 2025 Mega Auction Day 2 Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

Day 2: ఐపీఎల్‌-2025 మెగా వేలం లైవ్‌ అప్‌డేట్స్‌..

ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలం

ఐపీఎల్‌-2025 సీజన్‌ మెగా వేలం ఘనంగా ముగిసింది. జెద్దా వేదికగా రెండు రోజులు పాటు జరిగిన ఈ మెగా వేలంలో మొత్తం 182 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. అందుకోసం మొత్తం ప‌ది ఫ్రాంచైజీలు రూ. 639.15 కోట్లు ఖర్చుచేశాయి.

ఓవ‌రాల్‌గా ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆట‌గాడిగా టీమిండియా వికెట్ కీప‌ర్‌ రిష‌బ్ పంత్ నిలిచాడు. రూ.27 కోట్ల భారీ ధ‌ర‌కు రిష‌బ్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.

2024-11-25 22:44:46

మొహిత్‌ రాథేకు రూ. 30 లక్షలు

👉ఆశోక్‌ శర్మను రూ.30లక్షలకు రాజస్తాన్‌ సొంతం చేసుకుంది.

👉మొహిత్‌ రాథేను ఆర్సీబీ రూ.30 లక్షలకు దక్కించుకుంది.

2024-11-25 22:40:58

అర్జున్‌ టెండూల్కర్‌ను సొంతం చేసుకున్న ముంబై..

👉దక్షిణాఫ్రికా స్పీడ్‌ స్టార్‌ లుంగీ ఎంగిడీని కోటి రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

👉దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ లిజార్డ్‌ విలియమ్స్‌ను రూ.75 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది.

👉ఐపీఎల్‌-2025 ఆఖరి నిమిషం‍లో అర్జున్‌ టెండూల్కర్‌ అమ్ముడుపోయాడు. రూ.30 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

2024-11-25 22:37:59

కెన్వా మఫాకాకు రూ.1.50 కోట్లు

👉అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ కరిమ్ జనత్‌కు రూ.75 లక్షలకు గుజరాత్‌ దక్కించుకుంది.

👉అజయ్ మండల్‌ను రూ.30 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.

👉దక్షిణాఫ్రికా పేసర్ కెన్వా మఫాకాను రూ. 1.50 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

2024-11-25 22:37:59

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌లోకి ఆంధ్ర ఆటగాడు..

ఆంధ్ర ప్లేయ‌ర్ త్రిపురాన విజయ్‌ని రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌
 

2024-11-25 22:31:15

అర్జున్‌ టెండూల్కర్‌ భారీ షాక్‌..

👉ఐపీఎల్‌-2025 మెగా వేలంలో సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ అమ్ముడు పోలేదు.

👉ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని రూ.2 కోట్లకు కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

👉భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను కేకేఆర్‌ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

👉రాజవర్దర్‌ హంగర్గేరకర్‌ను రూ.30 లక్షలకు లక్నో సొంతం చేసుకుంది.

2024-11-25 21:48:59

గ్లెన్‌ ఫిలిఫ్స్‌కు రూ. 2 కోట్లు

👉టీమిండియా ప్లేయర్లు మయాంక్‌ అగర్వాల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌లకు ఊహించని షాక్‌ తగిలింది. మయాంక్, శార్థూల్‌లు ఆఖరి రౌండ్‌లో కూడా అమ్ముడుపోలేదు.

👉అజింక్య రహానేను కేకేఆర్‌ రూ.1.50 కోట్లకు కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

👉న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిఫ్స్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ.2 కోట్ల​కు దక్కించుకుంది. కాగా తొలి రౌండ్‌లో ఫిలిప్స్‌ అమ్ముడుపోకపోయిన సంగతి తెలిసిందే.
 

2024-11-25 21:41:19

డేవిడ్‌ వార్నర్‌కు మరోసారి నిరాశే..

ఆస్ట్రేలియా డేవిడ్‌ వార్నర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఫైనల్ రౌండ్‌లో కూడా వార్నర్‌ అమ్ముడుపోలేదు.

2024-11-25 21:36:58

దేవ్‌దత్త్‌ పడిక్కల్‌కు రూ. 2 కోట్లు

టీమిండియా ఆటగాడు దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ను రూ. 2 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. తొలి రౌండ్‌లో పడిక్కల్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే.

2024-11-25 21:35:03

13 ఏళ్ల యువ క్రికెటర్‌కు జాక్‌పాట్‌

13 ఏళ్ల యువ క్రికెటర్‌వైభవ్ సూర్య‌వంశీని రూ.1.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

2024-11-25 21:35:03

అమ్ముడు పోని స్టార్‌ ప్లేయర్లు..

స్టార్‌ ప్లేయర్లు క్రిస్‌ జోర్డాన్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, రోస్టన్‌ చేజ్‌, కైల్ జేమీసన్, ఒలీ స్టోన్‌ అమ్ముడుపోలేదు.

2024-11-25 20:37:33

పంజాబ్‌ కింగ్స్‌లోకి ఆంధ్ర ప్లేయర్‌

👉ఇంగ్లండ్‌ బౌలర్‌ జెమీ ఓవర్టన్‌ను సీఎస్‌కే రూ.1.50 కోట్లకు సీఎస్‌కే సొంతం చేసుకుంది.

👉ఆసీస్‌ పేసర్‌ బార్ట్‌లెట్‌ను పంజాబ్‌ రూ.80 లక్షలకు దక్కించుకుంది.

👉యువరాజ్‌ చౌదరిని లక్నో రూ.30 లక్షలకు దక్కించుకుంది.

👉ఆంధ్ర ఆటగాడు పైలా అవినాష్‌ను రూ. 30 లక్షలకు పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది.

👉రామకృష్ణ ఘోష్‌ను సీఎస్‌కే రూ.30 లక్షలకు సీఎస్‌కే సొంతం చేసుకుంది. 

2024-11-25 20:29:09

ప్రిన్స్ యాదవ్‌కు రూ.30 లక్షలు

👉సుర్యాన్ష్‌ సెగ్దేను పంజాబ్‌ కింగ్స్‌ రూ.30 లక్షలకు దక్కించుకుంది.

👉ప్రిన్స్ యాదవ్‌ను రూ.30 లక్షలకు లక్నో కైవసం చేసుకుంది.
 

2024-11-25 20:08:27

నాథన్‌ ఈల్లీస్‌కు రూ. 2 కోట్లు

👉శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ దుష్మాంత చమీరాను రూ.75 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.

👉ఆసీస్‌ పేసర్‌ నాథన్‌ ఈల్లీస్‌ను సీఎస్‌కే రూ. 2 కోట్లకు దక్కించుకుంది.

👉వెస్టిండీస్‌ యువ పేసర్‌ షెమార్‌ జోషఫ్‌ను రూ.75 లక్షలకు లక్నో కైవసం చేసుకుంది.

👉ముషీర్‌ ఖాన్‌ను రూ.30 లక్షలకు పంజాబ్‌ దక్కించుకుంది.

2024-11-25 20:08:27

సర్ఫరాజ్‌ ఖాన్‌ అన్‌సోల్డ్‌..

👉ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జాకబ్‌ బెతల్‌ను రూ.2.60 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.

👉ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఆరోన్ హార్డీని పంజాబ్‌ రూ.1.25 కోట్లకు దక్కించుకుంది.

👉టీమిండియా బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ అమ్ముడుపోలేదు.

👉శ్రీలంక ఆటగాడు కమిందు మెండీస్‌ను రూ.75 లక్షలకు ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది.
 

2024-11-25 19:59:32

ఢిల్లీ యువ సంచలనంపై కాసుల వర్షం..

👉ఇంగ్లండ్‌ ఆటగాడు బ్రైడన్‌ కార్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోటిరూపాయలకు దక్కించుకుంది.

👉ఢిల్లీ యువ ఆటగాడు ప్రియాన్షు ఆర్యను పంజాబ్‌ కింగ్స్‌ రూ.3.80 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతంచేసుకుంది.

👉మనోజ్‌ భాండాగేను ఆర్సీబీ రూ.50 లక్షలకు దక్కించుకుంది.

👉విప్‌రాజ్‌ నిగమ్‌ను రూ.50 లక్షలకు ఢిల్లీ దక్కించుకుంది.

2024-11-25 19:44:23

.

👉న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ శాంట్నర్‌ను రూ.2కోట్లకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది.

👉అఫ్గాన్‌ పేసర్‌ ఫజాలక్‌ ఫరూఖీని రూ.2 కోట్లకు రాజస్తాన్‌ దక్కించుకుంది.

👉ఇంగ్లండ్‌ పేసర్‌ రీస్‌ టాప్లీని రూ.75 లక్షలకు  ముంబై దక్కించుకుంది.

2024-11-25 19:31:36

జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజాకు షాక్‌

జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా, ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్లు అట్కిన్‌సన్‌, లూక్‌ వుడ్‌  అన్‌సోల్డ్‌గా మిగిలారు.
 

2024-11-25 19:27:59

అమ్ముడుపోని స్టీవ్‌ స్మిత్‌..

 ఐపీఎల్‌-2025 వేలంలో ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌, వెస్టిండీస్‌ పేసర్‌ అల్జారీ జోషఫ్‌, శ్రీలంక ప్లేయర్‌ పాథుమ్‌ నిస్సాంక అమ్ముడుపోలేదు.

2024-11-25 19:24:32

గుర్జప్నీత్ సింగ్‌కు రూ. .2.20 కోట్లు

గుర్జప్నీత్ సింగ్‌ను సీఎస్‌కే రూ.2.20 కోట్లకు సొంతం చేసుకుంది.
 

2024-11-25 19:24:32

అమ్ముడుపోని ఉమేష్ యాదవ్..

భారత ప్లేయర్లు ఉమేష్ యాదవ్,ఆండ్రీ సిద్దార్థ్‌, రిషీ ధావన్‌, అర్షన్‌ కులకర్ణి, శివమ్‌ సింగ్‌, రాఘవ్‌ గోయల్‌ అమ్ముడుపోలేదు.
 

2024-11-25 19:24:32

జయదేవ్‌ ఉనద్కట్‌ను సొంతం చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌

జయదేవ్‌ ఉనద్కట్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోటిరూపాయలకు దక్కించుకుంది.

హర్నర్‌ పన్నును రూ.30 లక్షలకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

యుద్దవీర్‌ సింగ్‌ను రాజస్తాన్‌ రూ.35 లక్షలకు కొనుగోలు చేసింది.
 

2024-11-25 19:12:39

ఆర్బీసీ గూటికి ముంబై పేసర్‌

👉లంక ప్లేయర్‌ నువాన్‌ తుషారాను కోటి 60లక్షలకు దక్కించుకున్న ఆర్బీబీ

👉లాస్ట్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఈ లంక పేసర్‌

2024-11-25 18:48:30

ఉమ్రాన్‌ మాలిక్‌, ముస్తఫిజుర్‌లకు భారీ షాక్‌..

ఫాస్ట్‌ బౌలర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ అమ్ముడుపోలేదు.
 

2024-11-25 18:44:25

స్పెన్సర్‌ జాన్సన్‌కు రూ.2.80 కోట్లు.. కేకేఆర్‌ సొంతం

👉ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ను రూ.2.80 కోట్లకు కేకేఆర్‌ దక్కించుకుంది.

👉వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్‌ను ఆర్సీబీ రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.

👉తమిళనాడు స్పిన్నర్‌ సాయికిషోర్‌ను రూ.2 కోట్లకు గుజరాత్‌ దక్కించుకుంది.

2024-11-25 18:43:04

విల్‌ జాక్స్‌కు భారీ ధర..

👉దీపక్‌ హుడాను సీఎస్‌కే రూ.1.70 కోట్లకు కొనుగోలు చేసింది.

👉ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ రూ.5.25 కోట్లకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది.

👉అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.2.40 కోట్లకు దక్కించుకుంది.

 

2024-11-25 18:39:25

.

👉వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ.2.60 కోట్లకు సొంతం చేసుకుంది.

👉షాబాజ్‌ ఆహ్మద్‌ను లక్నో రూ.2.40 కోట్లకు దక్కించుకుంది.

👉టిమ్‌ డేవిడ్‌ను ఆర్సీబీ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.
 

2024-11-25 18:27:53

ఇంగ్లండ్‌ ఓపెనర్‌కు భారీ షాక్‌..

👉దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రావిస్‌ కనీస ధర రూ. 75 లక్షలు... అన్‌సోల్డ్‌

👉న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ కనీస ధర. 2 కోట్లు.. అన్‌సోల్డ్‌

👉ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ కనీస ధర రూ. 2 కోట్లు-అన్‌సోల్డ్‌
 

2024-11-25 18:23:32

మనేష్‌ పాండేకు రూ.75 లక్షలు

👉టీమిండియా బ్యాటర్‌ మనేష్‌ పాండేను రూ.75 లక్షలకు కేకేఆర్‌ దక్కించుకుంది.

👉మన్యాల సిద్ధార్ద్‌ను రూ.75లక్షలకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది.

👉దిగ్వేష్‌ సింగ్‌ను రూ.30 లక్షల​కు లక్నో కొనుగోలు చేసింది.

2024-11-25 18:20:13

ముఖేష్‌ చౌదరికి రూ.30 లక్షలు

  ఫాస్ట్‌ బౌలర్‌ ముఖేష్‌ చౌదరిని రూ. 30లక్షలకు సీఎస్‌కే సొంతం చేసుకుంది.

2024-11-25 18:13:50

అమ్ముడుపోని భారత వికెట్‌ కీపర్లు..

ఈ వేలంలో భారత వికెట్‌ కీపర్లు హర్విక్‌ దేశాయ్‌, వన్ష్‌ బేడీ, అవినాష్‌ అరవల్లీ అమ్ముడుపోలేదు.

2024-11-25 18:08:49

దర్శన్‌ నలకండేకి రూ. 30 లక్షలు

దర్శన్‌ నలకండేను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.

2024-11-25 18:06:47

అన్షుల్‌ కాంబోజ్‌కు రూ.రూ.3.40 కోట్లు

భారత ఫాస్ట్‌ బౌలర్లు అన్షుల్‌ కాంబోజ్‌, ఆర్షద్‌ ఖాన్‌పై కాసుల వర్షం​ కురిసింది. అన్షుల్‌ కాంబోజ్‌ను రూ.3.40 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకోగా.. ఆర్షద్‌ను రూ. 1.30 కోట్లకు గుజరాత్‌ కొనుగోలు చేసింది.

2024-11-25 18:03:40

సీఎస్‌కేలోకి ఆంధ్ర ఆటగాడు..

👉ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్‌ను రూ.30 లక్షల కనీస ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

👉హిమం‍త్ సింగ్‌ను రూ. రూ.30 లక్షల కనీస ధరకు లక్నో  సొంతం చేసుకుంది.

👉ఆల్‌రౌండర్ మయాంక్ దాగర్ రూ. 30 లక్షలు- అన్‌సోల్డ్‌

2024-11-25 17:56:40

శుభ‌మ్ దూబేకు రూ.80 లక్షలు

👉శుభ‌మ్ దూబేను రూ.80 ల‌క్ష‌ల‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కొనుగోలు చేసింది.
👉భారత ప్లేయర్లు మాధవ్‌ కౌశిక్‌ అమ్ముడుపోలేదు.

2024-11-25 17:52:25

ఈ విదేశీ ప్లేయర్లకు నో లక్‌

👉భారత క్రికెటర్‌ విజయకాంత్‌ వియస్కాంత్‌ అన్‌సోల్డ్‌
👉వెస్టిండీస్‌ ప్లేయర్‌ అకీల్‌ హొసేన్‌ అన్‌సోల్డ్‌
👉ఇంగ్లండ్‌ వెటరన్‌ ప్లేయర్‌ ఆదిల్‌ రషీద్‌ అన్‌సోల్డ్‌
👉సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అన్‌సోల్డ్‌.

2024-11-25 17:05:54

అల్లా ఘజన్‌ఫర్‌కు రూ.4.8 కోట్లు..

అఫ్గానిస్తాన్‌ యువ సంచలనం అల్లా ఘజన్‌ఫర్‌పై కాసుల వర్షం కురిసింది. అతడిని రూ.4.8 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది.

2024-11-25 16:49:21

లూకీ ఫెర్గూసన్‌ను రూ.2 కోట్లు

న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ లూకీ ఫెర్గూసన్‌ను రూ.2 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది.

2024-11-25 16:43:15

ఆకాష్‌ దీప్‌కు రూ.8 కోట్లు..

టీమిండియా పేసర్‌ ఆకాష్‌ దీప్‌ను రూ.8 కోట్లకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది.

2024-11-25 16:43:15

దీపక్ చాహర్‌కు రూ. 9 కోట్లు.. సొంతం చేసుకున్న ముంబై

టీమిండియా పేసర్ దీపక్ చాహర్‌ను రూ.9 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

2024-11-25 16:37:14

ముఖేష్ కుమార్‌కు రూ.8 కోట్లు..

టీమిండియా పేసర్ ముఖేష్ కుమార్‌ను ఆర్టీమ్‌ను ఉపయోగించి రూ.8 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

2024-11-25 16:33:16

భువనేశ్వర్ కుమార్‌కు రూ.10.75 కోట్లు..

టీమిండియా వెటరన్‌ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

2024-11-25 16:27:08

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్‌కు రూ.2.40 కోట్లు..

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోట్జియను రూ.2.40 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది.

2024-11-25 16:23:30

తుషార్ దేశ్‌పాండేకు రూ. 6.25 కోట్లు..

టీమిండియా పేసర్ తుషార్ దేశ్‌పాండేను రూ. 6.25 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
 

2024-11-25 16:20:28

.

2024-11-25 16:13:37

జోష్‌ ఇంగ్లిష్‌కు రూ.2.60 కోట్లు..

ఆస్ట్రేలియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిష్‌ను  రూ.2.60 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

2024-11-25 16:07:07

శ్రీకర్‌ భరత్‌కు భారీ షాక్‌..

 ఆంధ్ర వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ ధర రూ. 75 లక్షలు.. అన్‌సోల్ట్‌

2024-11-25 16:07:07

షాయ్ హోప్ అన్‌సోల్ట్‌..

వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్ షాయ్ హోప్ కనీస ధ రూ. 1.5 కోట్లు.. అన్‌సోల్ట్‌

2024-11-25 16:03:35

నితీష్ రాణాకు రూ.4.20 కోట్లు..

టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్ రాణాకు రూ.4.20 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

2024-11-25 16:01:00

కృనాల్‌ పాండ్యాకు రూ.5.75 కోట్లు..

బరోడా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాను రూ.5.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

2024-11-25 15:56:58

మార్కో జాన్సెన్‌కు జాక్‌పాట్‌..

దక్షిణాఫ్రికా స్టార్‌ ఆల్‌రౌం‍డర్‌ మార్కో జాన్సెన్‌ను రూ. 7 కోట్లకు పంజాబ్‌ దక్కించుకుంది.

2024-11-25 15:49:44

సామ్‌ కుర్రాన్‌ను రూ.2.40 కోట్లు

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కుర్రాన్‌ను రూ. 2.40 కోట్లకు చెన్నైసూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది.

2024-11-25 15:45:56

వాషింగ్టన్‌ సుందర్‌కు రూ.3.20 కోట్లు

టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను రూ.3.20 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది.

2024-11-25 15:45:56

శార్దూల్‌ ఠాకూర్‌ అన్‌సోల్డ్‌

టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ కనీస ధర: రూ. 2 కోట్లు.. అన్‌సోల్డ్‌

2024-11-25 15:41:18

టీమిండియా ప్లేయర్లకు షాక్‌..

టీమిండియా బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కనీస ధర. కోటి.. అన్‌సోల్డ్‌

టీమిండియా బ్యాటర్‌ పృథ్వీ షా కనీస ధర రూ. 75 లక్షలు... అన్‌సోల్డ్

2024-11-25 15:39:38

ఫాఫ్‌ డుప్లెసిస్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ

సౌతాఫ్రికా మాజీ బ్యాటర్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కనీస ధర: రూ. 2 కోట్లు.. ఢిల్లీ క్యాపిటల్స్‌

2024-11-25 15:37:53

రోవ్‌మన్‌ పావెల్‌కు రూ. 1.50 కోట్లు..

వెస్టిండీస్‌ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ కనీస ధర: రూ. 1.50 కోట్లు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

2024-11-25 15:37:53

.

2024-11-25 15:36:45

అమ్ముడుపోని గ్లెన్‌ ఫిలిప్స్‌..

న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కనీస ధర: రూ. 2 కోట్లు.. అన్‌సోల్డ్‌

2024-11-25 15:35:51

.

జెద్దా వేదికగా ఐపీఎల్‌-2025 సీజన్ మెగా వేలం రెండో రోజు ప్రారంభమైంది. రెండో రోజు వేలంలో తొలి ప్లేయర్‌గా న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌ వచ్చాడు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు.

 

2024-11-25 15:35:51
Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement