ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా జరిగిన ఈ వేలంలో అన్‌క్యాప్డ్ న్యూజిలాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌ను కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ అందరిరని ఆశ్చర్యపరిచింది. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే వంటి కివీస్ స్టార్ క్రికెటర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిన చోట.. జాకబ్స్ అమ్ముడుపోవడంతో అందరూ విస్తుతపోయారు.
21 ఏళ్ల జాకబ్‌ను రూ.30 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ముంబై తనను దక్కించుకోవడాన్ని బెవాన్ జాకబ్స్ సైతం నమ్మలేకపోతున్నాడు.
"ఉదయం మేల్కొన్నవెంటనే వేలంలో నేను అమ్ముడుపోయానన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా నాకు ఇది చాలా పెద్ద అవకాశం. నన్ను కొనుగోలు చేసినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు.
నాకు అక్కడ ఆడే అవకాశం లభిస్తే ఇంకా ఎక్కువగా సంతోషపడతాను. ముంబై ఇండియన్స్ వంటి అద్బుత ఫ్రాంచైజీలో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. అదేవిధంగా ప్రపంచంలోని అత్యుత్తమమైన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకబ్ పేర్కొన్నాడు.
ఇప్పటివరకు ఆరు టీ20లు ఆడిన జాకబ్.. 33.50 సగటుతో 134 పరుగులు చేశాడు. సూపర్ స్మాష్ 2024-25 సీజన్‌పై జాకబ్ దృష్టిపెట్టాడు. సూపర్ స్మాష్ సీజన్‌ను ఐపీఎల్‌కు ముందు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని జాకబ్ భావిస్తున్నాడు.
ఈ టోర్నీలో అతడు ఆక్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే డెవాల్డ్ బ్రెవిస్, క్రిష్మార్ సాంటోకీ వంటి విదేశీ ఆటగాళ్లు తమ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.
చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు'
Comments
Please login to add a commentAdd a comment