చహల్‌ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!? | Yuzvendra Chahal goes to RCB for a Rs 12 crore in IPL 2025 Mock Auction | Sakshi
Sakshi News home page

IPL 2025: చహల్‌ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!? అట్లుంటది మరి ఫ్యాన్స్‌తో..

Published Thu, Nov 14 2024 12:40 PM | Last Updated on Thu, Nov 14 2024 12:56 PM

Yuzvendra Chahal goes to RCB for a Rs 12 crore in IPL 2025 Mock Auction

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబ‌ర్ 24, 25వ తేదీలలో జెడ్డా వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌  వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.

ఈ మెగా వేలం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్లను ఏ ఫ్రాంచైజీ దక్కుంచుకుంటుందోనని ఫ్యాన్స్‌ తహతహలాడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ కోసం ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో మాక్ వేలం నిర్వహించారు. 

ఈ  మెగా వేలం కోసం చహల్‌ తన కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో రూ. 2 కోట్ల బిడ్డింగ్ నుంచే మాక్ వేలం ప్రారంభమైంది.  ఈ క్రమంలో చాహల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 

అయితే రూ.9 కోట్లకు పైగా ఆర్సీబీ వెచ్చించేందుకు సిద్దం కావడంతో పోటీ నుంచి పంజాబ్‌, గుజరాత్ తప్పుకొన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోటీలోకి వచ్చింది. చహల్‌ కోసం రూ. 11.5 కోట్లకు బిడ్‌ వేసింది. ఆఖరికి ఈ మాక్‌ వేలంలో చాహల్‌ను రూ. 12 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 

చహల్‌​ ఐపీఎల్ జర్నీ ఇదే.. 
చహల్ 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతడు ఆర్సీబీకి 8 సీజన్ల పాటు  ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఎన్నో అద్బుత విజయాలు అందించాడు. 

కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని  రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. రాజస్తాన్‌ తరపున తొలి సీజన్‌లోనే పర్పుల్ క్యాప్‌ను చహల్ గెలుచుకున్నాడు. 

ఇప్పుడు రాజస్తాన్‌ కూడా చహల్‌ మెగా వేలంలోకి విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ సొంతం చేసుకునే ఛాన్స్‌ ఉంది. కాగా చహల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో ఇప్పటివరకు 155 మ్యాచ్‌లు ఆడిన చహల్‌.. 22.12 సగటుతో 200 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల(96) వీరుడిగానూ ఉన్నాడు
చదవండి: NPL 2024: మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్‌​ ధావన్‌..
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement