భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో 8 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు చాహల్‌ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన చాహల్‌ను కనీసం మళ్లీ తిరిగి పొందే ప్రయత్నం కూడా ఆర్సీబీ చేయలేదు.
అయితే ఈ వేలంలో చాహల్‌ను సంజూ శాంసన్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ రూ. 6.50 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక వేలంలో తనను పట్టించుకోని ఆర్సీబీపై తాజాగా చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 8 సీజన్ల పాటు సేవలు అందించిన తనను విడిచిపెట్టడం చాలా బాధ కలిగించిందని చాహల్ తెలిపాడు. "నన్ను రిటైన్ చేసుకోలేదనే విషయం తెలియగానే చాలా బాధపడ్డాను. 2014లో ఆర్సీబీతో నా ప్రయాణం మొదలైంది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి మ్యాచ్ నుంచే నాపై నమ్మకం ఉంచాడు.
నేను 8 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫ్రాంచైజీ తరపున ఆడాను. 2022 వేలానికి ముందు నేను మేనేజ్‌మెంట్‌ను ఎక్కువ డబ్బులు అడిగానని నాపై విమర్శలు వచ్చాయి. నేను అలా చేయలేదని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చా. దాదాపు 140 మ్యాచ్‌లు పైగా ఆర్సీబీ తరపున ఆడాను. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం.
ఆర్సీబీ నన్ను ఎందుకు సొంతం చేసుకోలేదో ఇప్పటికి నాకు అర్దం కాలేదు. రిటైన్ చేసుకోపోనప్పటికీ వేలంలో కచ్చితంగా కొనుగోలు చేస్తామని మాట ఇచ్చారు. కానీ వేలంలో కనీస ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత వారి నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు.
ఈ విషయం గుర్తు తెచ్చుకున్న ప్రతీసారి నాకు బాధ కలుగుతోంది. ఆ తర్వాత ఏది జరిగినా అది నా మంచికే అని భావించాను. రాజస్తాన్ రాయల్స్‌లో చేరడం వల్ల నేను డెత్ బౌలర్‌గా మారాను. ఆర్సీబీలో ఉన్నప్పుడు నా ఓవర్ల కోటా దాదాపు 16 లేదా 17 ఓవర్‌కే పూర్తయ్యేది. కానీ రాజస్తాన్‌లో చేరాక నా ప్రదర్శన 5 - 10 శాతం ఇంప్రూవ్ అయింది" అని ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు.
చదవండి: Asian Games 2023: భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది
Comments
Please login to add a commentAdd a comment