రాజస్తాన్ జెర్సీలో చహల్ (PC: IPL/BCCI)
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్ మెగా వేలం-2025లో జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 18 కోట్లు కొల్లగొట్టాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ కొనసాగుతున్నాడు.
ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఏకంగా 205 వికెట్లు కూల్చాడు. తద్వారా ఇప్పటికీ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
ఇక ఐపీఎల్-2024లో రాజస్తాన్‌కు ఆడిన చహల్ 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, వేలానికి ముందు రాజస్తాన్ అతడిని వదిలేయగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం జరిగిన మొదటి సెట్‌వేలంలో చహల్ కోసం.. గుజరాత్ తొలుత బిడ్ వేసింది. ఈ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలో దిగింది. అయితే, ధర రూ. 15 కోట్లు దాటిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఊహించినవిధంగా.. పంజాబ్ కింగ్స్ రేసులోకి వచ్చి ధరను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో సన్ రైజర్స్‌తప్పుకోగా.. పంజాబ్ చహల్‌ను దక్కించుకుంది.
చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం
Comments
Please login to add a commentAdd a comment