![IPL 2022: Yuzvendra Chahal Record As RR Spinner Surpasses Shreyas Gopal - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/7/6995.jpg.webp?itok=xBlvgb9U)
IPL 2022 PBKS Vs RR- Yuzvendra Chahal Record: ఐపీఎల్ మెగా వేలం-2022కు ముందు క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడు టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్. రిటెన్షన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేయగా వేలంలోకి వచ్చాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ పోటీ పడి మరీ ఆరున్నర కోట్లు వెచ్చించి చహల్‌ను సొంతం చేసుకుంది.
అందుకు తగ్గట్టుగానే ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చహల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2022లో ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న చహల్ భాయ్ పంజాబ్ కింగ్స్‌తో శనివారం(మే 7) నాటి మ్యాచ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఒక సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చరిత్రకెక్కాడు. 2019లో 20 వికెట్లతో ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్న శ్రేయస్ గోపాల్‌ను అధిగమించాడు. పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా జానీ బెయిర్ స్టో వికెట్ తన ఖాతాలో వేసుకుని ఈ ఫీట్ నమోదు చేశాడు.
కాగా తాజా ఎడిషన్‌లో చహల్ ఇప్పటి వరకు 22 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో చహల్ 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చహల్ 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో చహల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్.. ‘‘ఇతడు చాలా బాగా ఆడుతున్నాడు. టూ గుడ్’’ అంటూ కొనియాడాడు.
చదవండి👉🏾Kieron Pollard: పొలార్డ్‌పై వేటు తప్పదు.. ఇకపై అతడికి అవకాశం ఉండదు!
Comments
Please login to add a commentAdd a comment